శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, August 6, 2010

సతి చక్కదనమెంతో

సతి చక్కదనమెంతో సరసుని మోహమెంతో చతురలింక సరి జూడరమ్మా

కాంత కన్నులు వ్రాసి కడలు వ్రాయగ రాక చింత తోడ దలవంచె జెలి విభుడు
పంతపు నడుము వ్రాసిబయలు వ్రాయగ రాక కొంత దడ వుస్సురనె గోమలి ప్రాణేశుడు

కలికి కుచాలు వ్రాసి కఠినము వ్రాయలేక తలపోయ దొడగె బంతపు విభుడు
నళినాక్షి మోము వ్రాసి నవ్వులు వ్రాయగరాక నిలువున వెరగందె నెలత రమణుడు

వనిత కౌగిట దన్ను వ్రశి రతి వ్రాయలేక తనువెల్ల మరచెను తమకమున
వెనక ముందర వ్రాసి వేడుక వ్రాయగరాక చినుకు జెమట వ్రాసె శ్రీవేంకటేశుడు

No comments:

Post a Comment