సతతవిరక్తుడు సంసారిగాడు రతిసమ్మదుడు విరక్తుడు నితడె
నిత్యుడైనవాడు నిఖిలలోకముల బ్రత్యక్ష విభవసంపన్నుడు గాడు
నిత్యుడు నితడే నిరుమానుడైన ప్రత్యక్ష విభవ సంపన్నుడితడె
యోగియైనవాడు నొనర నేకాలము భోగియై భోగిపై భోగింపలేడు
యోగియు నితడే వుడుగక భోగిపై భోగించునటువంటి పురుషుండు నితడే
దేవుడైనవాడు దెలుప లోకముల దేవతారాధ్యుడై దీపింపలేడు
దేవుడు నితడే దివిజవంద్యుడైన శ్రీ వేంకటగిరి దేవుండితడె
No comments:
Post a Comment