శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, August 6, 2010

సతతము నేజేయు

సతతము నేజేయు ననాచారములకు గడ యెక్కడ మతి ననుగని కావుము రామా రామా రామా

సేసిననాబ్రహ్మహత్యలు శిశుహత్యలు గోహత్యలు ఆసలనెన్నో యెన్నో ఆయాజాడలను
యీసున నే నిపు డెరిగియునెరగక సేసేదురితపు రాసులకును గడలే దిదె రామా రామా రామా

నమలెడినానాచదువులకు నానావిధభక్షణములు కమిలినదుర్గంధపుశాకమ్ములు దొములును
జముబాధల నరకంబుల సారెకు నన్నెటువలె శ్రీరమణుడ ననుగాచే విటు రామా రామా రామా

కపటపునాధనవాంఛలు కలకాలము బరకాంతల జపలపుదలపుల సేతలసంఖ్యము లరయగను
యెపుడును నిటువలెనుండెడుహీనుని నన్నెటు గాచెదో రవమున శ్రీవేంకటగిరిరామా రామా రామా

No comments:

Post a Comment