సర్వజ్ఞత్వము వెదకగనొల్లను సందేహింగనొల్లను సర్వజ్ఞుండను నాచార్యుండే సర్వశేషమే నాజీవనము
యెఱగనొల్లము విజ్ఞానపుగతి యెఱుకలు నే మిటుసోదించి యెఱిగి యితరులను బోధించెదమనుయీపెద్దరికము నొల్లము
యెఱిగేటివాడును యాచార్యుండే యెఱుకయు సర్వేశ్వరుడే యెఱుకయు మఱపును మానివుండుటే యిదియేపో మావిజ్ఞానము
చదువగనొల్లము సకలశాస్త్రములు సారెకుసారెకుసోదించి చదివి పరులతో యుక్తివాదములు జగడము గెలువగనొల్లము
చదివేటివాడును నాచార్యుండే చదువును నాయంతర్యామే చదువుకు జదువమికి దొలగుటే నానాసాత్వికభావమే నా తెలివి
అన్నిటికిని నే నధికారిననెడియహంకారము నొల్లను కన్నులజూచుచు నందరిలో నే గాదని తొలగానొల్లను
మన్నన శ్రీవేంకటేశ్వరుకరుణను మాయాచార్యుడే అధికారి వున్నరీతినే అస్తినాస్తులకు నూరకుండుటే నాతలపు
No comments:
Post a Comment