శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, August 6, 2010

సర్వాంతరాత్ముడవు

సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను సర్వాపరాధినైతి చాలుజాలునయ్యా

వూరకున్నజీవునికి వొక్కొక్క స్వతంత్రమిచ్చి కోరేటియపరాధాలు కొన్ని వేసి
నేరకుంటే నరకము నేరిచితే స్వర్గమంటూ దూరువేసేవింతేకాక దోషమెవ్వరిదయ్యా

మనసు చూడవలసి మాయలు నీవే కప్పి జనులకు విషయాలు చవులుచూపి
కనుగొంటే మోక్షమిచ్చి కానకుంటె కర్మమిచ్చి ఘనము సేసేవిందు కర్తలెవ్వరయ్యా

వున్నారు ప్రాణులెల్లా నొక్కనీగర్భములోనే కన్నకన్న భ్రమతలే కల్పించి
యిన్నిటా శ్రీవేంకటేశ యేలితివి మమ్ము నిట్టె నిన్ను నన్ను నెంచుకుంటే నీకే తెలియునయ్యా

No comments:

Post a Comment