సర్వేశ్వరుడవు స్వతంత్రడువు నీవు సర్వోత్తముడ నన్నిచట కావవే
శక్తిగలిగితే నీ సరుసదేవుడ గాన యుక్తి గలిగితే నే నొడలు మోతునా
యుక్తియు శక్తియు ఒకటే లేక భక్తుడనైతి నన్ను పాలింపవే
బహుపుణ్యుడనైతే బ్రహ్మపట్టమేలనా సహజ విజ్ఞానినైతే సంసారి నౌదునా
విహిత పుణ్య జ్ఞాన విముఖుడ గనకనే అహిశయనుడ శరణంటి కావవే
శ్రీవేంకటేశ నీవు చేసిన ప్రతిమ నింతే నీవెరుగనిది లేదు నేరుపు నాయందు నీదే
భావము లోపల నీవే పైకొని బుద్ధియ్యగాను నీవాడ ననుకొంటి నేడు కావవే
No comments:
Post a Comment