సర్వేశ్వరుడే శరణ్యము నిర్వాహకు డిన్నిటగాన
పలుదేవతలకు బ్రహ్మాదులకు జలజనాభుడే శరణ్యము
అలరిన బ్రహ్మాండ మలసిననాడును నిలిపినాడితడు ఇన్నిటగాను
అనేక విధముల సకల జీవులకును జనార్దనుడే శరణ్యము
అనాథ నాథు డంతరాత్మకుడు అనాది పతి యితడటుగాన
తగు నిశ్చలులగు తనదాసులకును జగదేక పతియే శరణ్యము
చిగురు చేవ యగు శ్రీ వేంకటేశుడు అగు వరము లొనగు నటుగాన
No comments:
Post a Comment