సర్వోపాయములు జగతి నాకితడే వుర్వీధరుడు పురుషోత్తముండితడే
సకలగంగాతీర్థ స్నానఫలములివి స్వామిపుష్కరణి జలమేనాకు సకలపుణ్య క్షేత్రవాసయాత్రలివి సరి వేంకటాచల విహారమిదియే
సకలవేదాధ్యన శాస్త్రపాఠంబులివి శౌరిసంకీర్తనంబిదియే నాకు సకలకర్మానుష్ఠానముల యితనికిచ్చట జాతువడికైంకర్యమిదియే
ఉపవాసములివి యితనిప్రసాదంబులొగి భుజింపుటే నాకు దినదినంబు జపరహస్యోపదేశంబు లితనిపాదజలంబుల శరణనేటి సేవయొకటే
ఉపమింప బుణ్యపురుషులదర్శనము నాకు నొగినిచటి బహువృక్ష దర్శనంబు యెపుడు బుణ్యకథాశ్రవణంబు లిచ్చోటయెన్నగల బహుపక్షి కలకలంబు
తలపుగల యోగంబులందు శ్రీవైష్ణవుల దగులుసంవాస సహయోగంబు వెలయ నిండుమహోత్సవంబు లిన్నియు నితనివిభవంబులెసగు తిరునాళ్ళు నాకు
చెలగి యిటు దేవతాప్రార్థనింతయు నాకు శ్రీవేంకటేశుని శరణాగతి అలరునాసంపదలు యితని పట్టపురాణి అలమేలు మంగకడకంటి చూపు
No comments:
Post a Comment