సహజ వైష్ణవాచారవర్తనుల సహవాసమే మాసంధ్య
అతిశయముగ శ్రీహరి సంకీర్తన సతతంబును మాసంధ్య
మతి రామానుజమతమే మాకును చతురత మెరసిన సంధ్య
పరమభాగవత పదసేవనయే సరవి నెన్న మాసంధ్య
సిరివరు మహిమలు చెలువొందగ వేసరక వినుటె మాసంధ్య
మంతుకెక్క తిరుమంత్ర పఠనమే సంతతమును మాసంధ్య
కంతుగురుడు వేంకటగిరిరాయని సంతర్పణమే మాసంధ్య
No comments:
Post a Comment