సహజాచారములెల్ల సర్వేశ్వరునియాజ్ఞే అహమించి నమ్మకుండు టదియే పాషండము
నిద్దిరించువానిచేతినిమ్మపంటివలెనే చద్దికర్మములు తానే జారితే జారె
పొద్దువొద్దు తనలోన భోగకాంక్షలుండగాను అద్దలించి కర్మమెల్లననుటే పాషండము
కలగన్నవాడు మేలుకనినటువలెనే తలగి ప్రపంచ మెందో దాగితే దాగె
యిల్ల నీదేహము మోచి యింతా గల్లలనుచు పలికి తప్పనడచేభావమే పాషండము
ధర నద్దముచూచేటి తనరూపమువలె గరిమతో దనయాత్మ కంటే గనె
సరుస శ్రీవేంకటేశు సాకారమటు గని కరగి భజించలేనికష్టమే పాషండము
No comments:
Post a Comment