శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, August 6, 2010

సామాన్యమా పూర్వ

సామాన్యమా పూర్వ సంగ్రహంబగు ఫలము నేమమున బెనగొనియె నేడు నీవనక

జగతి బ్రాణులకెల్ల సంసారబంధంబు తగుల బంధించు దురితంపు గర్మమున
మగుడ మారుకుమారు మగువ నీయురముపై తెగి కట్టిరెవ్వరో దేవుండ వనక

పనిలేని జీవులను భవసాగరంబులో మునుగ లేవగ జేయు మోహదోషమున
పనిపూని జలధిలో బండబెట్టిరి నిన్ను వెనకెవ్వరో మొదలి వేలువనక

ఉండనీయక జీవనోపాయమున మమ్ము కొండలను గొబల దతి గొని త్రిప్పుఫలము
కొండలను నెలకొన్న కోనేటి పతి వనగ నుండవలసెను నీకు నోపలేవనక

No comments:

Post a Comment