శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, August 6, 2010

సారె దూర జాలనూ

సారె దూర జాలనూ చలముల కోపమా చేరితిమా చనవోలి చెన్నుని భ్రమలను

యీడకు బిలుపించెను యేమి సేయుమనీ నేవోడక తన యెదుట నున్నదానను
పాడితో నీట ముంచనీ పాలముంచనీ తాను వాడు దనవలపుల వలకు లోనైతిని

మాటనన్ను నాడించెను మనసెట్టు దెలిసీ నే యేటికైనా నియ్యకొంటి నిదివో నేను
నాటిమాట చెల్లించీనా నగనీ తెగడనీ మేటి పాయము తనకే మీదుగా నెత్తితిని

కాగిట నన్నునించెను కళ దాకె నిక నేలే దాగక తనకు నిట్టె దక్కితి నేను
వీగక శ్రీ వేంకటాద్రి విభుడు దానన్ను గూడె యేగించనీ రేగించనీ యిరవైతి నేను

No comments:

Post a Comment