శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, August 6, 2010

సారె నిన్నలమేల్మంగ

సారె నిన్నలమేల్మంగ జవ్వనమునను చేరి యవధరింతు విచ్చేవయ్య జాజర

వసంతకాలము వచ్చె వనితమోవి ఇగిర్చె కొనరె యెలుగులను కోవిలగూసె
ముసరీ జూపుల తేంట్లు మోతుగై వలపు పూచె రసికత నాడుదువు రావయ్య జాజర

పున్నమ వెన్నెలగాసె కన్నుగలువలు విచ్చె పిన్నలై జెమటలను జాలువారె బన్నీరు
సన్నపు జెమటలను జలువారె బన్నీరు చెన్నుమీర నాడుదు విచ్చేయవయ్య జాజర

మరుడు విల్లందుకొనె మచ్చికలు గూడజేసె పొరిపొరి సిగ్గులచే పుప్పొడిరాలె
ఇరవై శ్రీవేంకటేశ యీకె నిట్టె గూడుతివి సరుగ మీమీద మీరె చల్లరయ్య జాజర

No comments:

Post a Comment