శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

Saturday, June 5, 2010

ఐనదయ్యీ గానిదెల్లా

ఐనదయ్యీ గానిదెల్లా నటు గాకుండితే మానీ మానుపరా దివి హరిమాయా మహిమలు

పుట్టేటి వెన్ని లేవు పోయేటి వెన్ని లేవు వెట్టి దేహాలు మోచినవెడజీవులు
గట్టిగా దెలుసుకొంటే కలలోనివంటి దింతే పట్టి ఇందుకుగా నేల బడలేమో నేము

కడచిన వెన్ని లేవు కాచుకున్న వెన్ని లేవు సుడిగొన్న తనలోని సుఖదుఃఖాలు
యెడపుల నివి రెండు యెండనీడవంటి వింతే కడనుండి నే మేలకరగేమో నేము

కోరినవి యెన్ని లేవు కోరగల వెన్ని లేవు తీరనైసంపదలతో తెందేపలు
ధారుణి శ్రీవేంకటేశుదాసులమై యిన్నియును చేరి కైకొంటిమి యేమి సేసేమో నేము