అంటి నిన్ను బాయలేని దాపె తలనేవేగేనా వెంట వెంట దిరుగరా వెలదు లెల్లాను
తలకొని నీమోము తప్పక చూచితేను వలవరా యెటువంటి వనితలైనా
సెలవుల నేపాటైనా చిరునవ్వు నవ్వితేను మొలవవా పులకలు మోపుల కొలదులు
చనవున నీతోను సరసములాడితేను మనసులు కరగరా మగువలెల్లా
యెలసి నీతోగన యేపాటి మాటాడినాను తనుదానె కాగిళ్ళు తగులు కోకుండునా
నివ్వటిల్లు తమకాన నీమేను సోకితేను నివ్వెరగు బొందరా నెలతలెల్లా
రవ్వగా శ్రీ వేంకటేశ రతి నలమేలుమంగ యివ్వల కూడినందుకు హెచ్చవా వేడుకలు
Showing posts with label అ. Show all posts

Saturday, August 7, 2010
అనతియ్య గడవయ్య
అనతియ్య గడవయ్య ఆకడ నీకడ నీకు తానకపు కానుకలు దక్కేనో దక్కదో
మోవితేని బోనాలు మోసునవ్వు మొనాలు ఆవల చెలి యొకతె అంపె నీకదే
కాని కంటి కుంకుమలు కమ్మవూర్పు సురటులు ఈవల నీకంపితిని ఎక్కెనో యెక్కదో
చేసన్న వీడేలు చిమ్ముగోరి మేడేలు పోసరించి వేరొకతె పుత్తెంచె నీకు
యీసు జెమట పన్నీరు యింపుగాకల రతులు వాసిగ నీకంపితిని వచ్చెనో రాదో
పలుకుల కప్పురాలు భావారతి చప్పరాలు యెలమి శ్రీవేంకటేశ యిచ్చే నెవ్వెతో
బలు సరసపు మొక్కు పాన్పుపై కూటమి చొక్కు తలకిక నీకిచ్చితిని తనిసెనో తనియదో

అహొ సాధు త
అహొ సాధు త వాగమనం బహుళవైభవైః ప్రతివచనైకిం
తతోపసరమి ధ్యా శఠవచనై రతిస్త వైర్మమ హితం కిం
బతమమదేహా త్ప్రాణస్త ధాపి గత ఏవైతత్ కారణమిహకిం?
సంవృతిచేలం జహిచపలత్వం సంవాదేమే సతతంకిం
త్వంవామమచి త్తంసాత్వయసి కింవా కురుమమ ఖేలనమిహకిం?
అతిబిభేమి భవదాచరణాదిహ చతుర వేంకటా చలరమణా
సతీం మామను సరసికిమదర్ధం రతిరాజవిభవ రచనమిదంకిం?

Tuesday, June 1, 2010
అదివో నిత్యసూరులు
అదివో నిత్యసూరులు అచ్యుత నీదాసులు యెదురులేనివారు యేకాంగవీరులు
రచ్చల సంసారమనేరణరంగములోన తచ్చి కామక్రోధాలతలలు గొట్టి
అచ్చపుతిరుమంత్రపుటారువుబొబ్బలతోడ యిచ్చలనే తిరిగేరు యేకాంగ వీరులు
మొరసి పుట్టుగులనేముచ్చు బౌజుల కురికి తెరలి నడుములకు దెగవేసి పొరి
గర్మము బొడిచి పోటుగంటుల దూరి యెరగొని తిరిగేరు యేకాంగవీరులు
వొడ్డినదేహములనేవూళ్ళలోపల చొచ్చి చెడ్డయహంకారమును చెఱలు పట్టి
అడ్డమై శ్రీవేంకటేశు నుండనుండి లోకులనే యెడ్డల జూచి నవ్వేరు యేకాంగవీరులు

అదె చూడరే
అదె చూడరే మోహన రూపం పది కోట్లు గల భావజరూపం
వెలయగ పదారువేల మగువలను అలమిన ఘన మోహనరూపం
వలచిన నందవ్రజము గొల్లెతల కులుకు చూపులకు గురియగురూపం
ఇందిరా వనితనెప్పుడు తనవుర మందు నిలిపిన మోహనరూపం
కందువ భూపతి కౌగిట సొంపుల విందులు మరిగిన వేడుకరూపం
త్రిపుర సతుల భోధించి రమించిన అపురూపపు మోహనరూపం
కవురుల శ్రీ వేంకటపతియై ఇల ఉపమించగ రాని వున్నతరూపం

Download
Tuesday, May 18, 2010
అహోబలేశ్వరుడు
అహోబలేశ్వరుడు అరికులదమనుడు మహా మహిమలకు మలసీవాడె
కదలు కన్నులును కరాళవదనము గుదిగొను భయదపు కోరలను
అదరు మీసములు అలరగ నవ్వుచు వుదుట తోడ కొలువున్నాడు వాడె
అతిసిత నఖములు అనంత భుజములు వితత పరాక్రము వేషమును
అతుల దీర్ఘజిహ్వయు కడు మెరయగ మితిలేని కరుణ మెరసీ వాడు
సందడి సౌమ్యములు శంఖచక్రములు పొందుగ దివిజులు పొగడగను
ఇందిర దొడపై నిడి శ్రీవేంకట మందు నిందు కడు అలరీ వాడే

అహోబలేశ్వరుడు అఖిల వందితుడు మహి నితని గొలిచి మనుడిక జనులు
మూడు మూర్తులకు మూలంబీతడు వేడి ప్రతాపపు విభుడీతడు
వాడి చక్రాయుధ వరదుండీతడు పోణిమి పురాణ పురుషు డీతడు
అసురలకెల్ల కాలాంతకు డీతడు వసుధ దివ్యసింహం బితడు
విసువని ఏకాంగ వీరుడీతడు దెసల పరాత్పరతేజం బితడు
నిగిడి శ్రీవేంకట నిలయుడీతడు బగివాయని శ్రీపతి యీతడు
సొగసి దాసులకు సులభు డీతడు తగు ఇహపరముల దాతయు నీతడు

అహో నమో నమో
అహో నమో నమో ఆదిపురుష నీకు ఈహల నెంతవాడను ఎట్టుగాచితివి
లోకాలోకములు లోన నించుకొన్న నీవు ఈకడ నా యాత్మలోన నెట్టణగితివి
ఆకడ వేదములకు నగోచరమైన నీవు వాక్కుచే నీ నామముల వడి నెట్టణగితివి
అన్నిటా బ్రహ్మాదుల యజ్ఞ భోక్తవైన నీవు అన్న పానాదు లివి యెట్టారగించితివి
సన్నుతి పూర్ణుడవై జనియించిన నీవు వున్నతి నా పుట్టుగలో వొకచో నెట్టుంటివి
దేవతలచే పూజ తివిరి గొనిన నీవు ఈవల నాచే పూజ ఎట్టుగొంటివి
శ్రీ వేంకటాద్రి మీద సిరితో గూడిన నీవు ఈ వీధి మా యింట ఇపుడెట్టు నిలిచితివి

అస్మదాదీనాం
అస్మదాదీనాం అన్యేషాం తస్మిన్ తస్మిన్ తత్ర చ పునశ్చ
సతతాధ్యయననిష్ఠాపరాణాం దృఢ వ్రతినాం యతీనాం వనవాసినాం
గతిరిహ స్మర్తుం కా జగత్యాం పర స్థితిరియం కా విష్ణుసేవా పునశ్చ
మోహినామత్యంతముష్కరాణాం గుణ గ్రాహిణాం భువనైక కఠినానాం
దేహసంక్షాళన విదేశకోవా సదా శ్రీహరిస్మరణవిశేషః పునశ్చ
కింకుర్వాణదుఃఖితజీవినాం పంకిలమనోభ్బయభ్రాంతానాం
శంకాం నిరురుతి స్సరసా కా, శ్రీ వేంకటాచలపతేర్వినుతిః పునశ్చ

అవునయ్య నీ సుద్దు లటు
అవునయ్య నీ సుద్దు లటు వంటివి జవళితో నంటు బచ్చలి వంటి వాడవు
చెలరేగి యేడ లేని చేతలెల్లా జేసివచ్చి వెలయు నిప్పుడు నన్ను వేడుకొనేవు
పలుమారు నీచేత బాసలు గొన వెరతు కలువ కంటుల యెడ కాత రీడ వనుచు
వాడ వారిపై నెల్లా వలపుల చల్లి వచ్చి యీడ నాతో నెడలేని యిచ్చలాడేవు
కోడె కాడ నీ వోజ కొనియాడ నిచ్చితయ్యీ జాడతో నింతుల యెడ చంచలుడ వనుచు
పెక్కు గోపికల నెల్లా బెండ్లాడి యిట వచ్చి గక్కన నా కౌగిట గలసితివి
నిక్కి శ్రీ వేంకటేశుడ నే నలమేల్మంగను కక్కసించ నోప నీవు గబ్బి వాడవనుచు

అవియే పో నేడు
అవియే పో నేడు మాతోనంటి సేసే తపములు వివరించుకొని ఇట్టె విచ్చేయి మనవే
కొండల కొట్టగొనల గోరమైన తపములు పండు బలములలోని పచ్చిమేతలు
గుండె దాకే మంత్రాల కుత్తికలో జసములు దొండకారుణ్యాన నాడు తాజేసెగా
యేరులలో మునకలు యెఖ్ఖువ ఆచారాలు ఆ రీతి మోనము తోడి యానందాలు
కోరికోరి చలివేడి కోటికోటి నేమాలు చేరి యీ రీతి దపాలు సేసినాడుగా
సమ్మతించ జేసిన యాసన భేదబంధాలు వుమ్మడి యన్యోన్యపు యోగాలు
దొమ్మి శ్రీ వేంకటపతి తొల్లి సేసె నట్లనె రమ్మని నేడును నారతి జేసెగా

అవి యటు
అవి యటు భావించినట్లాను కవగొని యిందుకు గలగరు ఘనులు
అరయగ నేబదియక్షరములె పో ధరలోపల నిందాస్తుతులు
సరి బురాణములు శాస్త్రవేదములు యింపుగ పన్నియు నిండి పొడమె
వొక్కదేహమున నున్నయంగములు పెక్కువిధములై బెరసినివి
చిక్కుల గొన్నిటి సిగ్గుల దాతురు యెక్కువయతులకు నిన్నియు సమము
అంతరాత్మలో నంతర్యామై బంతుల దిరిగేటిబంధువులు
చింతింప నతడే శ్రీవేంకటేశ్వరు డింతకు గర్తని యెంతురు బుధులు

అవధారు రఘుపతి
అవధారు రఘుపతి అందరిని చిత్తగించు ఇవలనుండే కొలువిదెనదె సముఖాన
రామరాఘవరామ రామచంద్రప్రభో శ్రీమదయోధ్యాపతి సీతాపతి
ప్రేమనారదుడు పాడిపెక్కు రంభాదులాడేరు మోమెత్తి కవులెల్ల మ్రొక్కేరదివో
ఇనవంశకుల జాత ఇక్ష్వాకుకుల తిలక ఘనదశరథసుత కౌశికప్రియ
మునులు దీవించేరు ముందట భరతుడదె వెనకలక్ష్మణుడు సేవించె వింజామర
కందువకౌసల్యాగర్భ రత్నాకర చెందిన శ్రీవేంకటాద్రి శ్రీనివాస
సందడి కుశలవులు చదివేరు వొకవంక చెంది నీరాజనము చెప్పరాదు రామ

అవధారు దేవ
అవధారు దేవ హరికుల రామ వివిధమై నీబంటు వెలయుచున్నాడు
అదె కలశాపుర హనుమంత రాయడు కదనము లోన రక్కసుల గొట్టి
యెదుట నిందరి లోన నేకాంగవీరుడై కొదలేక ప్రతాపించి కొలువైవున్నాడు
చల్లని వనాల నీడ సాగుడు కొండలలోన వల్లెగా వేసుకొన్న వాలముతోడ
పల్లదాన వలకేలు పంతమున నెత్తుకొని కొల్లున మంటపములో కొలువై వున్నాడు
పెక్కు పండ్ల గొలలు పిడికిట బట్టుకొని చక్కగా పెరిగి పెద్దజంగ చాచి
యిక్కువ శ్రీవేంకటాద్రి నిరవైన సర్వేశ గుక్కక నీపై భక్తి గొలువై విన్నాడు

అల్లదె జవ్వని
అల్లదె జవ్వని హరి యురమున నదె మెల్లనె యిటు వుపమించరే మీరు
మత్తెపు జిప్పలో ముంచిన కలువలో వొత్తిలి కనుగవ లొక మాటాడరే
గుత్తపు గుండలో కొండలో కుచములో హత్తి యేర్పడగ ననరే మీరు
తామెర తూండ్లో తతియగు తీగెలో భామ చేతు లేర్పరచరే యిపుడు
దోమటి సింహమో తొడ గిన బయలో ఆమాటాడరే అందులో నొకటి
నీలపు మణులో నిండిన మేఘమో బలకి తురు మొక పలుకున జెప్పరే
యీ లీల శ్రీవేంకటేశ్వరు గూడెను మేలిమి మెఅగో మెలుతో యనరే

అలుకలు చెల్లవు
అలుకలు చెల్లవు హరి పురుషోత్తమ నలి నిందిర నీతో నవ్వినది
ఆదిలక్ష్మి మోహన కమలంబున వేద మాత నిను వేసినది
ఆదెస నీపై నభయహస్తమును సాదరముగ గడు సాచినది
సిరి దన కన్నుల చింతామణులను పొరి నీపై దిగ బోసినది
వరద హస్తమున వలచెయి బట్టుక అరుదుగ నిను మాటాడించినది
జలధి కన్య తన సర్వాంగంబుల బిలిచి నిన్ను నిటు పెనగినది
అలముక శ్రీ వేంకటాధిప నిను రతి నెలమి నీ వురంబెక్కినది

అలుక లేటికి
అలుక లేటికి రావే యాతనివద్దకి నీవు బలిమైతే వలపులు పదనుకు వచ్చునా
సంగడి నున్న సతికి చనవులు గలుగుగాక కంగి కడనుండితేను కలదా పొందు
చెంగటనున్న రుచులు చేరి నోరూరించుగాక అంగడినున్న సొమ్ములు ఆసలు పుట్టించునా
వినయపుటింతికిని వేడుక లీడేరుగాక పెనగుచు బిగిసితే ప్రేమపుట్టునా
తనువున బూసిన గందము చల్లనౌగాక వనములో తరువులు వడదీర్చవోపునా
సేవచేసే మగువకు చేతలెల్ళా జెల్లుగాక యీవల నొడ్డారించితే నింపు వుట్టునా
శ్రీ వేంకటేశుడిందు విచ్చేసి తానిన్నుగూడెను పూవులు పిందెలౌగక పొల్లు వెలవెట్టునా

అలవటపత్రశాయివైన
అలవటపత్రశాయివైన రూప మిట్టిదని కొలువై పొడచూపేవా గోవిందరాజా
పడతులిద్దరిమీద బాదములు చాచుకొని వొడికపురాజసాన నొత్తగిలి
కడలేనిజనాభికమలమున బ్రహ్మను కొడుకుగా గంటివిదె గోవిందరాజా
సిరులసొమ్ములతోడ శేషునిపై బవళించి సొరిది దాసుల గృప జూచుకొంటాను
పరగుదైత్యులమీద పామువిషములే నీవు కురియించితివా గోవిందరాజా
శంకుజక్రములతోడ జాచినకరముతోడ అంకెల శిరసుకిందిహస్తముతోడ
తెంకిని శ్రీవేంకటాద్రి దిగువతిరుపతిలో కొంకక వరములిచ్చే గోవిందరాజా

అలరులు గురియగ
అలరులు గురియగ నాడెనదే అలకల గులుకుల నలమేలుమంగ
అరవిరి సొబగుల నతివలు మెచ్చగ అర తెర మరుగున నాడె నదే
వరుసగ పూర్వదు వాళపు తిరుపుల హరి గరగింపుచు నలమేలుమంగ
మట్టపు మలపుల మట్టెలకెలపుల తట్టెడి నడపుల దాటెనదే
పెట్టిన వజ్రపు పెండెపు దళుకులు అట్టిట్టు చిమ్ముచు నలమేలుమంగ
చిందుల పాటల శిరిపొలయాటల అందెల మ్రోతల నాడె నదే
కందువ తిరువెంకటపతి మెచ్చగ అందపు తిరుపుల నలమేలుమంగ

అలర నుతించరో
అలర నుతించరో హరిని యెలయించి మిము భ్రమయించీనీ గాలము
సేయరో మనుజులారా చింత హరి నికనైన రోయరో మీ భుజియించు రుచుల మీద
కాయమస్థిరము యీకవి యధృవము చాల బోయబో యెందుకు గాకపోయ గాలము
మెచ్చరో మనుజులార మీరే హరికథలు పుచ్చరో మీ మదిలోని పొరలెల్లాను
కొచ్చరో మనుజులార కోరిక లెల్లను మీకు నిచ్చీని శుభములు యివి యెల్లకాలము
కనరో వేంకటపతి గన్నులు దనియగా వినరో యీతని స్తుతు వీనులు నిండ
మనరో శ్రీహరిచేతి మన్ననలు మీరు తనమీది మదిబుద్ది దాచీనీ గాలము

Subscribe to:
Posts (Atom)