శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

Monday, June 21, 2010

దోమటి వింతెరుగరా

దోమటి వింతెరుగరా తొల్లిటివారు వామదేవవసిష్ఠవ్యాసాదులు

తానే దైవమైతే తపమేల జపమేల పూని సారె బూజించేపూజలేల
కూనువంగి యింటింట గోరనేల వేడనేల యీనెపాన లోకమెల్లా నేలరాదా తాను

తగ దా స్వతంతుడైతే దరిద్రదుఃఖములేల నొగలి వ్యాధులచేత నొవ్వనేల
నగుబాటులైన జననమరణములేల ముగురువేల్పులదండ మొనచూపరాదా

శ్రీ వేంకటేశుడే శేఖరపుదైవమని సావధాను డితనికి శరణుజొచ్చి
భావములోపల దనపాపబంధములు బాసి తావుల నాతనికృప దండ చేరరాదా

దొరతో సంగాతము

దొరతో సంగాతము దొరికిన పాటే చాలు వొరసి మీరగ బోతే నొక్కరీతి నుండునా

యేకతాన లోన నుండి యేలనన్ను బిలిచేవు వాకిటికి రావయ్యా వలసితేను
చేకొని యొకతె యుంటె సిగ్గువడి వెళ్ళి వచ్చి కూకులు వత్తులుగాను కూళదాననా

మరగించి మరగున మాట లేలాడించేవు తెఅదియ్యవయ్య అంత తీట గలిగితె
వరుసకు వచ్చి నాపె వాదు నాతో బెట్టుకొంటె విరసమై యూరకుండ వెఱ్ఱిదాననా

పట్టె మంచముపై నుండి పైగాలు చాచనేల యిట్టె వుర మెక్కవయ్య యింత గలిగె
జట్టిగా శ్రీ వేంకటేశ సరినొకతె గూచుంటె వట్టి యితవు సేసుకో వాసిలేని దాననా

దొరకెగా పూజ

దొరకెగా పూజ కందువ పూజ నీ విరహపు తనుతావి విరవాది పూజ

కలికి నీ కనుచూపు కలువరేకుల పూజ లలన నీ నగవు మొల్లల పూజ
తలపోత చింత చిత్తపు గమలపు పూజ చలివేడి వూర్పు నీ సంపంగి పూజ

కనుల జెక్కిన జేయి కరపల్లవపు పూజ తను పులకలు జాజి ననల పూజ
తనరు నీ వలపులు దొంతర పూవుల పూజ యెనయు జెమట మల్లె మొగ్గల పూజ

చెనకు నీగోళ్ళే చిరి గేదగుల పూజ గునియు గుబ్బలు పూవు గుత్తుల పూజ
ఘనతమై గూడి వేంకటపతి మోము సోకిన నీదు మోవి మంకెన పూవు పూజ

దొరకె మాపాలికి

దొరకె మాపాలికి గందువయర్థము దరిదాపైయుండినతత్వార్థము

తిరముగ నల్లదీవి దెచ్చినయర్థ మిదివో విరజవోడరేవున వెళ్ళినర్థము
పరమభాగవతులు పాతినర్థ మిదివో పురుషోత్తముడనేటిపురుషార్థము

చందపువేదముల శసనము వేసినర్థము ముందు సముద్రలకెల్లా మొదలర్థము
అందరియాత్మలనేటిఅంగళ్ళలోనియర్థము యెందు సహస్రనామపుటెన్నికర్థము

కొలచి బ్రహ్మాండముల కొప్పెరలోనర్థము యిల నిహపరముల కెక్కినర్థము
యెలమి హీనునినైన యెక్కుడుసేసేయర్థము అలరి శ్రీవేంకటేశుడైనయర్థము

దొరకునా యితనికృప

దొరకునా యితనికృప తుదిపదంబు అరిదివిభవము లొల్లమనినా బొదలు

సొంపలర నితడు కృపజూచు టరుదనికాక యింపు సామాన్యమా యితనికరుణ
లంటమైనఘనమైన లక్ష్మీకటాక్షములు సంపదలు తోడనే చల్లువెదలాడు

తగ నితనిపై భక్తి తగులు టరుదనికాక నగుట సామాన్యమా ననిచి యితడు
జగదేకహితములుగ సరసతలు సౌఖ్యములు దిగులువాయగ నితడు దిప్పు దీరాడు

తిరువేంకటాద్రి సిద్ధించు టరుదనికాక మరుగ దను నిచ్చునా మరియొకరిని
యిరవైన భోగములు యిష్టసామ్రాజ్యములు విరివిగొని యితనిదయవెంటనే తిరుగు

దైవము పుట్టించినట్టి

దైవము పుట్టించినట్టి తనసహజమే కాక కోవిదునికైనా జాలిగుణమేల విడుచు

ఆరయ బంచదార నద్దుక తినబోతే చేరరానిముష్టిగింజ చేదేల మాను
సారమైన చదువులు సారె సారె జదివినా గోరపుదుష్టునికి కోపమేల మాను

నిప్పు దెచ్చి వొడిలోన నియమాన బెట్టుకొంటే యెప్పుడును రాజుగాక యిది యేల మాను
ముప్పిరి బాతకుడైనమూఢు డెన్నియాచారాలు తప్ప కెంతసేసినాను దయయేల కలుగు

యింటిలోన గొక్కు దెచ్చి యిరవుగ బెట్టుకొంటే దంటయై గోడలు పడదవ్వ కేలమాను
గొంటరై శ్రీవేంకటేశు గొలువకుండినవాడు తొంటిసంసారవుగాక దొర యేటికౌను

దైవము నీవే

దైవము నీవే యిక దరి చేరుతువుగాక జీవులవసము గాదు చిక్కిరి లోలోననే

పుట్టుట సహజ మిది పొదలేజీవులకెల్ల గట్టిగా జగమునందు కలకాలము
నట్టేటివరదవలె నానాటినీమాయ కొట్టుక పారగజొచ్చె కూడినవిజ్ఞానము

పాపమే సహజము బద్దసంసారులకెల్ల కాపురపువిధులలో కలకాలము
తేపలేనిసముద్రమురెరగున కర్మమెల్లా మాపురేపు ముంచజొచ్చె మతిలోనిధైర్యము

లంపటమే సహజము లలి దేహధారులకు గంపమోపు కోరికెలకలకాలము
యింపుల శ్రీవేంకటేశ ఇదె నీదాసులని పంపుసేసి బ్రదికించె ప్రపన్నసుగతి

దైవమా పరదైవమా

దైవమా పరదైవమా యేవగింతలు నాకు నెట్టు దెచ్చేవో

పాపకర్ముని దెచ్చి పరమియ్యదలచిన మేపులకే పోక మెయికొనీనా
తీపులు రూపులు దివిరి నావెనువెంట నేపొద్దు నీవేడ దెచ్చేవో

అధమాధముని దెచ్చి యధికుని జేసేనంటే విధినిషేధములు వివరించునా
నిధినిధానములు నిచ్చనిచ్చలు బెక్కు విధముల నెటువలె వెదచల్లెదవో

అతికష్టుడగునాకు నలవిగానియీ మత మొసగిన నేను మరిగేనా
ప్రతిలేని వేంకటపతి నీదునామా మృత మిచ్చి నను నీవే మెరయింతుగాక

దైవమా నీమాయ

దైవమా నీమాయ తామొలెఱగనీదు కావరపువిషయాలకట్లు వదలవు

గక్కున బెరిగివచ్చీ కాలము మీదమీద వొక్కనాటికొక్కనాటి కొత్తు కొత్తుక
నిక్కి తుమ్మిదలవంటినెరులెల్లా దెల్లనాయ కక్కరమాయ మేను కాంక్షలూ నుడుగవు

చిన్ననాడుమోహించినచెలులు నేజూడగానే పన్నినవయసుమీరి ప్రౌడలైరి
వన్నెకుబెట్టినసొమ్ము వడి రాసి యెత్తుదీసె మున్నిటివే వెనకాయ ముచ్చటా దొలగదు

సిగ్గులెల్లా బెడబాసె చేరి యవ్వరు నవ్వినా యెగ్గుపట్టదు మనసు యెఱుకతోనే
నిగ్గులశ్రీవేంకటేశ నీవు నన్ను నేలుకొని దగ్గరి నాలోనుండగా తలపూగైవాలదు

దైవమా నీకు

దైవమా నీకు వెలితా తలపువెలితేకాక వేవేలు కర్మల వేసారగవలనె

హరియంటే బాపేటి అన్నిపాపాలు సేసిన పొరినందుపై నమ్మిక పుట్టుదుగాక
నరసింహాయంటే వచ్చే నానాపుణ్యాలకు తిరముగా ఋణములు దీర్చుకొనగలనా

దేవ జగన్నాథయంటే తెగనిజన్మములేవి కైవశము నామనసు గాదుగాక
గోవిందయనియంటే గూడని పదవులేవి కావిరిగాలమూరకె కడపేము నేము

వేదనారాయణయంటే వీడేటి బంధములు ఆదిగా మూడులోకాలనైనా నున్నదా
శ్రీదేవిపతియైన శ్రీవేంకటేశ్వరుడా యేదెసా నీవే నన్ను యీడేర్తువుగాక

దైవక్రుతమెవ్వరికి

దైవక్రుతమెవ్వరికి దప్పింపరాదనుచు భావించి జనులాడుపలుకు నిజమాయ

కందునకు బెడబాసి చందురుదింతి ముఖ్హ చందురుడైన నది అందును గలిగె
కందువగు చెలినొసలి కస్తూరి తిలకమను కందు ముఖ్హచంద్రునకుగడు నందమాయ

జలజములు శశిచేత నులికి యీకాంతకుచ జలజంబులైన నది సరుసనే కలిగె
లలితమగు ప్రాణవల్లభుని సురతాంకమున విలువనేయగరాని విదియ చందురులు

తీగె బహుజలజములకు దెమలి కామినిమేను దీగె యయ్యిన నదియుదిరుగ మరికలిగె
ఈ గతుల దిరువేంకటేశ్వరుని సమసురత యోగంబు వలన ఘ్హర్మోదకశ్రీలు

దైవకృతంబట

దైవకృతంబట చేతట తనకర్మాధీనంబట కావలసినసౌఖ్యంబులు గలుగక మానీనా

ఎక్కడిదుఃఖపరంపర లెక్కడిసంసారంబులు యెక్కడిజన్మము ప్రాణులకేలా కలిగినది
యెక్కడిమోహవిడంబన యెక్కడియాశబంధము యెక్కడికెక్కడ నిజమై యివి దానుండీనా

యీకాంతలు నీద్రవ్యము లీకన్నులవెడయాసలు యీకోరికె లీతలపులు యిట్టే వుండీనా
యీకాయం బస్థిరమన కీదుర్దశలకు లోనై యీకల్మషముల బొరలగ నివి గడతేరీనా

దేవశిఖామణి తిరుమల దేవునికృపగల చిత్తము పావనమై దురితంబుల బాయక మానీనా
ఆవిభుకరుణారసమున నతడే తను మన్నించిన ఆవేడుక లీవేడుక లాసలు సేసీనా

Saturday, June 19, 2010

దేహినిత్యుడు

దేహినిత్యుడు దేహము లనిత్యాలు యిహల నా మనసా యిది మరువకుమీ

గిది బాతచీరమాని కొత్త చీరగట్టినట్టు ముదిమేను మాని దేహముమొగి గొత్తమేను మోచు
అదన జంపగలేవు ఆయుధము లితని గదసి యగ్నియు నీరు గాలి జంపగ లేవు

ఈతడు నరకు వడ డీతడగ్ని గాలడు యీతడు నీటమునుగ డీతడు గాలిబోడు
చేతనుడై సర్వగతుండొఊ చెలియించ డేమిటను యీతల ననాది యీ తడిరపు గదలడు

Wednesday, June 16, 2010

దేహము దా నస్థిరమట

దేహము దా నస్థిరమట దేహి చిరంతనుడౌనట దేహపుమోహపుసేతలు తీరుట లెన్నడొకో

కన్నుల బుట్టినకాంక్షలు కప్పికదా దుర్బోధల కన్నులు మనసును దనియక గాసిబడిరి జనులు
తన్నిక నెరుగుట లెన్నడు తలపుల దొలగుట లెన్నడు తిన్ననిపరవశములచే దిరుగుట లెన్నడొకో

సిగ్గులుదొలగనియాశల జిక్కికదా దుర్మానపు సిగ్గులయెగ్గులచేతను చిక్కువడిరి జనులు
సిగ్గులు దొలగుట యెన్నడు చిత్తములోనౌటెన్నడు తగ్గులమొగ్గులసేతలు తలగుట లెన్నడొకో

మనసునబుట్టినయాతడు మనసున బెనగొని తిరుగగ మనసే తానగుదైవము మరచిరి యందరును
అనయము తిరువేంకటపతి యాత్మ దలచి సుఖింపుచు ఘనమగు పరమానందము కలుగుట లెన్నడొకో

దేవునికి దేవికిని

దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ వేవేల మొక్కులు లోకపావని నీకమ్మా

ధర్మార్థకామ మోక్షతతులు నీ సోపానాలు అర్మిలి నాలుగువేదాలదె నీ దరులు
నిర్మలపు నీ జలము నిండు సప్తసాగరాలు కూర్మము నీ లోతు వోకోనేరమ్మా

తగని గంగాది తీర్థమ్ములు నీకడళ్ళు జగతి దేవతలు నీ జల జంతును
గగనపు బుణ్యలోకాలు నీ దరిమేడలు మొగి నీచుట్టు మాకులు మునులోయమ్మా

వైకుంఠ నగరము వాకిలే నీ యాకారము చేకొను పుణ్యములే నీ జీవభావము
యేకడను శ్రీ వేంకటేశుడే నీ వునికి దీకొని నీ తీర్థమాడితిమి కావవమ్మా

Monday, June 14, 2010

దేవుడుగలవారికి

దేవుడుగలవారికి దిగులు జింతయు లేదు శ్రీవిభుడే అన్నిటా రక్షించుగనక

యేలికగలబంటుకు యేవిచారములేదు వోలి మగడుగలాలికి వొప్పమి లేదు
పోళిమి దండ్రిగలపుత్రుని కంగద లేదు మేలుగా బండినభూమికి గరవులేదు

బలముగలరాజుకు భయమేమియు లేదు కలిమిగలవాని కక్కర లేదు
యిల నాచారవంతుని కేపాపమును లేదు తలపుబుణ్యముగల ఆతనికి జేటు లేదు

గురువుగలవానికి గొఱత యేమియు లేదు పరముగలవానికి భ్రాంతులు లేవు
యిరవై శ్రీవేంకటేశు డిన్నిటా మాకు గలడు అరయ దాసులము మా కడ్డాకే లేదు

దేవశిఖామణివి

దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు ఈవల నీబంట నాకు నెదురింక ఏది

కామధేనువు పిదుకగల కోరికెలివెల్ల కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవట
కామించి నీ బంటనట కమ్మినిన్ను దలచితి ఏమి మాకు కడమయ్యా ఇందిరా రమణ

ఎంచ కల్పవృక్షమును ఇచ్చు సిరులెల్లాను మించి కల్పవృక్షముల నీడలా కృష్ణుడవట
అంచల నీ బంటనట ఆత్మలొ నిను నమ్మితి వంచించ కడమయేది వసుధాధీశ

తగనొక్క చింతామణి తలచినట్లచేసు మిగుల కౌస్తుభమణి మించినా కృష్ణుడవట
పగటు శ్రీవేంకటేశ భక్తుడ నీకట నేను జగములో కొరతేది జగదేకవిభుడ

దేవశిఖామణి

దేవశిఖామణి దివిజులు వొగడగ వేవేలు గతుల వెలసీ వాడే

వీధుల వీధుల వెసతురగముపై భేదిల బల్లెము బిరబిర దిప్పుచు
మోదము తోడుత మోహన మూరితి ఏ దెస జూచిన నేగీ వాడే

కన్నులు దిప్పుచు కర్ణములు కదల సన్నల రాగెకు చౌకళింపుచును
అన్నిటా తేజియాడగ దేవుడు తిన్నగ వాగేలు తిప్పీవాడే

వలగొని దిరుగుచు వాలము విసరుచు నిలిచి గుఱ్ఱమటు నేర్పులు చూపగ
బలు శ్రీ వేంకటపతి అహోబలపు పొలమున సారెకు పొదలీవాడే

దేవరగుణములు

దేవరగుణములు దెలియవు నీవే మాకును నేరుప వయ్యా

వదలక నీతో వాసికి బెనగిన యెదుటనె నీ మన సెట్టుండునో
కదిసి నీరీతికి గడు దమకించిన యిది వేసాలని యెంతువో నీవు

చెనకగ నీ యెడ సిగ్గులు నెరపిన పనులవి యేమని భావింతువో
ననిచి నీ యెదుట నవ్వులు నవ్విన తనివి లేనిదని తగ నాడుదువో

కూడుదు నిన్నిట గుబ్బల నొత్తిన వోడ దనుచు గో రూదుదువో
యీడనె శ్రీ వేంకటేశ యేలితివి వీడెమిచ్చితే వెరగందుదువో

దేవర చిత్తం

దేవర చిత్తం దివ్య నిధి దేవనిర్మిత నిధీ యవధానం

అతివలు నాట్యంబాడెదమని వున్నతి మెఅయుచు నున్నారిదివో
ప్రతినలతో రంధయు మేనకయును ధ్రుతి విద్య తమకంబున వినుమని

గానవిద్య తమకంబున వినుమని కానుకలివె సురకాంతలవి
కానుపించుకో గంధర్వ సతులను ధీనుత పంపుసుధీ యవధానం

పరియంకంబున బవళించెదవో సిరుల విభవముల జెలగెదవో
తిరువేంకటగిరిదేవ యన్నిటా తిరమందితి విటు ధీ యవధానం