దేవుడుగలవారికి దిగులు జింతయు లేదు శ్రీవిభుడే అన్నిటా రక్షించుగనక
యేలికగలబంటుకు యేవిచారములేదు వోలి మగడుగలాలికి వొప్పమి లేదు
పోళిమి దండ్రిగలపుత్రుని కంగద లేదు మేలుగా బండినభూమికి గరవులేదు
బలముగలరాజుకు భయమేమియు లేదు కలిమిగలవాని కక్కర లేదు
యిల నాచారవంతుని కేపాపమును లేదు తలపుబుణ్యముగల ఆతనికి జేటు లేదు
గురువుగలవానికి గొఱత యేమియు లేదు పరముగలవానికి భ్రాంతులు లేవు
యిరవై శ్రీవేంకటేశు డిన్నిటా మాకు గలడు అరయ దాసులము మా కడ్డాకే లేదు
No comments:
Post a Comment