చేసినట్టే సేసుగాక చింత మాకేలా వాసీ వంతూ నతనిదే వట్టిజాలియేలా
కర్మమూలమైనవి యీకాయపువ ర్తనలెల్లా ధర్మమూలమైనది యీ దైవికము
మర్మమైనవా డొక్కడే మనసులోనున్న హరి నిర్మిత మాతనిదింతే నేర నే నెంతవాడ
ధనమూలమైనది యీతగినప్రపంచ మెల్లా తనువుమూలమైనది యీతపసులెల్లా
ననిచి యీరెంటికిని నారాయణుడే కర్త కొనమొద లాతనిదే కొసరు మాకేల
భోగమూలమైనది యీపొందైనసంసారము యోగమూలము విరతి కొక్కటైనది
యీగతి శ్రీవేంకటేశు డెట్టువలసిన జేసు బాగులుగా నీతనిశ్రీపాదమే మాదిక్కు
Showing posts with label చ. Show all posts

Thursday, June 10, 2010
చేరి యశోదకు
చేరి యశోదకు శిశు వితడు ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు
సొలసి చూచినను సూర్యచంద్రులను లలి వెదచల్లెడులక్షణుడు
నిలిచిననిలువున నిఖిలదేవతల కలిగించు సురలగనివో యితడు
మాటలాడినను మరియజాండములు కోటులు వోడమేటిగుణరాశి
నీటగునూర్పుల నిఖిలవేదములు చాటువనూ రేటిసముద్ర మితడు
ముంగిట జొలసిన మోహన మాత్మల బొంగించేఘనపురుషుడు
సంగతి మావంటిశరణాగతులకు నంగము శ్రీవేంకటాధిపు డితడు
Download

చేరి కొల్వరో
చేరి కొల్వరో యీతడు శ్రీదేవుడు యీ రీతి శ్రీ వెంకటాద్రి నిరవైన దేవుడు
అలమేలుమంగ నురమందిడుకొన్న దేవుడు చెలగి శంఖ చక్రాల చేతి దేవుడు
కల వరద హస్తము గటి హస్తపు దేవుడు మలసీ శ్రీ వత్స వనమాలికల దేవుడు
ఘన మకర కుండల కర్ణముల దేవుడు కనక పీతాంబర శృంగార దేవుడు
ననిచి బ్రహ్మాదుల నాభి గన్న దేవుడు జనించె బాదాల గంగ సంగతైన దేవుడు
కోటి మన్మథాకార సంకులమైన దేవుడు జూటపు గిరీటపు మించుల దేవుడు
వాటపు సొమ్ముల తోడి వసుధాపతి దేవుడు యీటులేని శ్రీవేంకటేశుడైన దేవుడు

చేపట్టి మమ్ము గావు
చేపట్టి మమ్ము గావు శ్రీనరసింహా నీ శ్రీ పాదములే దిక్కు శ్రీనరసింహా
చెలగువేయిచేతుల శ్రీనరసింహా చిలికేటినగవుల శ్రీనరసింహా
సిలుగులేనిమంచి శ్రీనరసింహా చెలి దొడెక్కించుకొన్న శ్రీనరసింహా
క్షీరసముద్రమువంటి శ్రీనరసింహా దైత్యు జీరినవజ్రపుగోళ్ళ శ్రీనరసింహా
చేరి ప్రహ్లాదునిమెచ్చే శ్రీనరసింహా నుతిం చేరు దేవతలు నిన్ను శ్రీనరసింహా
శ్రీవనితతో మెలగు శ్రీనరసింహా చేవదీరె నీమహిమ శ్రీనరసింహా
శ్రీవేంకటాద్రిమీది శ్రీనరసింహా సర్వ జీవదయాపరుడ వో శ్రీనరసింహా

చేతులెత్తి మొక్కరమ్మ
చేతులెత్తి మొక్కరమ్మ చేరి యారతెత్తరమ్మ యేతులే బూమెల్లా నిండె నీదేవునికి
తతిగొని పన్నీటిధారలు పై నించినించి సతముగా బెద్దలు మజ్జనమార్చగా
అతివలచనుగొండ లంగము లొత్తినందుకు యితవులై తోచె నేడు యిందిరాపతికి
కప్పురపుధూళి మేన గలయగ గంపెడేసి నెప్పున సందుసందుల నిగిడించగా
చొప్పులెత్తి గొల్లెతలచూపులు దాకినకుమ్మె లప్పుడన్నియును గప్పె నందువల్ల హరికి
తట్టుపుణు గలది యందపుటలమేలుమంగ నిట్టే వురముమీద నమరించగా
నెట్టన బచ్చి సేసిననెలతలచేతలలో చిట్టకములెల్లా గప్పె శ్రీవేంకటపతికి

చేకొనువారికి చేరువిదే
చేకొనువారికి చేరువిదే పైకొనిజీవులభాగ్యమిదే యేకడ జూచిన యితరము లేదు
తలపులోన నంతర్యామిదివో తెలిసిచూచితే ద్రిష్టంబు
చలమున దనమతి సందేహించిన కలగి మూడులోకంబుల లేడు
వెస గనుదెఱచిన విశ్వాత్మకు డిదె దెపల నింతటా ద్రిష్టంబు
పసిగొని తను బాపములు భ్రమించిన కసరి సృష్టి చీకటివడు నపుడే
చేరి కొలిచితే శ్రీవేంకటపతి సారె బ్రతుకునకు శాసనము
పైరగుతనలో భక్తి వదలితే కూరిమి తెరమఱగునకును మఱగు

చేకొంటి నిహమే
చేకొంటి నిహమే చేరినపరమని కైకొని నీవిండు కలవేకాన
జగమున గలిగిన సకలభోగములు తగిన నీ ప్రసాదములే యివి
అగపడునేబదియక్షరపంజ్తులు నిగమగోచరపునీమంత్రములే
పొదిగొని సంసారపుత్రదార లిల వదలని నీదాసవర్గములే
చెదరక యేపొద్దు జేయునాపనులు కదిసిన నియ్యాగ్యాకైకర్యములే
నలుగడ మించిననాజన్మాదులు పలుమరు లిటు నీపంపు లివి
యెలమిని శ్రీవేంకటేశ్వర నీనిక వలసినప్పుడీ వరములు నాకు

చెల్లునంటా వచ్చివచ్చి
చెల్లునంటా వచ్చివచ్చి చెట్టా పట్టేవు తొల్లియు నెందరి నిట్టే దొమ్ముల బెట్టితివో
ఆపరాని తమకాన నానచేసేగాక యింత మాపుదాణ నీ తోడి మాటలేలరా
దాపరాని మదన ముద్రలు మేననవే నీకు నేపుచు భ్రమల బెట్టి యెవ్వతె సేసినవో
ఉండలేక నీవద్దనే వుసురంటి గాక యింత బండు బండు సేసిన యీప్రాణమేలరా
వుండుగాగ జిత్తమెల్లా ఒక్కజేసితివి నా యండనుండే యెవ్వతెకు నమ్ముడు వోయితివో
తనివొక నిన్నింత దగ్గర నిచ్చితి గాక చనువున నిన్నుజేయి చాచనిత్తునా
ఘనుడు వేంకటరాయ కమ్మని యీవిరులు మునుప నెచ్చతో నీపైముడిచి వేసినవో

చెల్లుగా కిట్టు
చెల్లుగా కిట్టు నీకే చింతింపగా పూరి పుల్ల మేరువుసేయ భూమిలో నిపుడు
చెలగి నే మునుసేసినచేత లుండగా మలసి నే తిరుగుతిమ్మట లుండగా
తొలగదోసి తుప్పుడుతోడనే లోహంబు వెలయ బంగారుగావించినగతిని
బిగిసి నామైనున్న పెనుకట్లుండగా జగడగాండ్లు పగచాటగను
జిగిగలచేతి ముసిడికాయయగు నన్ను మొగి గల్పకముఫలముగ జేయవసమా
పొదలిన యింద్రియంబులు వెంట రాగా మదవికారము నే మరుగగానే
వదలక వేంకటేశ్వర నన్ను నిదే నీ పదపంకజములు చేర్పగ నిది వసమా

చెల్లబో యీజీవు
చెల్లబో యీజీవు లిల జేసినపాప మెంతో వుల్లమున నున్నహరి వూరకే దవ్వాయ
కన్నచోటనే హరి కలడన్నవారికి విన్నచోటనే విష్ణుడు వివేకులకు
వున్నతి గొలువలేక వొద్దనుండగా గొందరు మిన్ను మీద వెదకేరు మితిమీఱ జదివి
పట్టినదే బ్రహ్మము పరమార్థవేత్తలకు తిట్టులోనా దైవము దివ్యులకును
ముట్టి చేత మొక్క లేరు ముందటనే వుండగాను బట్టబయలు పాకేరు బహుకర్మవిదుల
ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు దాపున నున్నాడు హరిదాసులకును
యేపున శ్రీవేంకటేశు నేచి శరణనలేక చాపలాన చెదకేరు సకలదేవతల

చెల్ల నెక్కికొంటివిగా
చెల్ల నెక్కికొంటివిగా జీవుడ యీబలుకోటా బల్లిదుడ నీకు నేడు పట్టమాయ గోటా
తొమ్మిదిగవనులై న దొడ్డతోలు గోటా కొమ్మలచవులమూలకొత్తళాలకోటా
వమ్ములేనిమెడవంపువంకదారకోటా పమ్మి పగవారినెల్లా పట్టుకొన్న కోటా
తలవాకిలిదంతపుతలపులకోటా తలిరుజేతుల పెద్దదంతెనాలకోటా
వెలియాసలనేదండువిడిసినకోటా గులుగై యింద్రియములు కొల్లగొన్న కోటా
నడచప్పరములనేనలువైనకోటా జడిసినచెవుల మించుసవరణకోటా
పడనిపాట్ల బడి ఫలియించె గోటా యెడమిచ్చి శ్రీవేంకటేశు డేలె గోటా

చెలులాల యీమేలు
చెలులాల యీమేలు చెలువుడే చూచుగాని యెలమి తోడుత మొక్కి యెరిగించరే
వనిత జవ్వనపు వసంతకాలములోనే వెనుకొని విరహపు వేసవి మించె
ననిచె బెంజెమట వానకాలము నంతలోనె వినయముతో బతికి విన్నవించరే
కాంత పులకల శరత్కాలము నదె తోచె చింతల మంచులతో హేమంతము ముంచె
చెంత గోర్కులెన్నులెత్తి శిశిరవేళ యేతెంచె యింతకు నీకె విభుని దోడి తేరె
చెలియకు గొప్పువీడె చీటికాలము నందె నెలకొన సిగ్గుల వెన్నెలకాలము
అలమె శ్రీవేంకటేశుడంతలోనె తానెవచ్చె పిలిచి సారెకునిట్టె ప్రేమరేచరే

చెలులారా చూడరే
చెలులారా చూడరే యీ చెలి భాగ్యము అలమేలుమంగ యీకె కబ్బెను యీ భాగ్యము
పతిదయ కలిగిన పడతిదీ భాగ్యము అతడు మాట మీరనీదది భాగ్యము
సతతముబాయక జంటై వుండేది భాగ్యము అతివలందరు గల్లా నది యేమి చెప్పరే
మగడు మన్నించిన మగువది భాగ్యము సొగసి యాతడు మోహించుట భాగ్యము
వెగటులేని రతుల వేసర నిది భాగ్యము మగువల వలపుల మరి యేమి భాగ్యము
శ్రీ వేంకటేశుడేలే మచ్చిక నీ సతిది భాగ్య మావేళ నాతడు మెచ్చినది భాగ్యము
తావుకొని యెప్పుడూ దనవాడౌటే భాగ్యము యేవనితల నేరుపులిక నేమి చెప్పరే

చెలియా నాకు నీవు
చెలియా నాకు నీవు సేసే వుపకారమిది వెలలేని గుణముల వేడుకకాడతడు
వచ్చిన దాకా నీవు వద్దనే కాచుకుండు మెచ్చిన దాకా గొలువు మిగులాను
ఇచ్చగించి నందాకా నింపుగ సేవలు సేయు అచ్చపు బొందులు సేయుమాతనికి నాకును
సమ్మతించి నందాక సారె విన్నపాలు సేయు నెమ్మది బత్తైన దాకా నేర్పులు చూపు
కొమ్మని యిచ్చిన దాకా గుట్టున జేయెత్తి మొక్కు యిమ్ముల బొందులు సేయు మిద్దరికి నీవు
నవ్విన దాకా నీవు ననుపు లెల్లా జేయు మివ్వలి మోమైన దాకా నింపులు చల్లు
రవ్వగా శ్రీ వేంకటరాయడిదే నన్ను గూడె మవ్వపు బొందులు సేయు మాకు నీ వెప్పుడును

చెలియరో నీవే
చెలియరో నీవే కదే సృష్టికర్తవు నిలువున నీ మగడు మెచ్చె నమ్మా
బొమ్మల జంకించితేనే పొద్దు గుంకినట్లెను కమ్మి నీవు నవ్వితేనే కాయు వెన్నెల
సొమ్మల మోవి చూపితే చుక్కలు నిండుకొనును నెమ్మది నీ రమణుడు నిను మెచ్చెనమ్మా
పొలితి నీవు చూచితే వొద్దు వొడుచు నప్పుడే పొలయలుకల నెండ పొడచూపును
తిలకించి నిలిచితేదిష్టమౌను లోకమెల్ల నెలకొని నీ విభుడు నిన్ను మెచ్చెనమ్మా
ఎక్కువై నీవు గూడితే నిరు సంజలును దోచు మొక్కిన నీతురుముకు మూగు మేఘాలు
వొక్కటై నీ రతులను వోలార్చగా నేడు నిక్కి శ్రీ వేంకటేశుడు నిన్ను మెచ్చెనమ్మా

చెలి మమ్ము
చెలి మమ్ము జెప్పమని సిగ్గుతోడదానున్నధి తలకొని యాకెతో మంతనమాడవయ్యా
కన్నుల చూపులనే కాంత నీ కారతులెత్తీ మన్నించి రావయ్యాలోని మల్లసాలకు
చన్నులనే నిమ్మపంద్లు సారెకుగానుకలిచ్చీ చెన్నుగా నందుకొందువు చేయిచాచవయ్యా
పచ్చిచిగురాకు మొవిబళ్ళెము నీకుబెట్టీ ఇచ్చ విందారగింతువు ఇయ్యకోవయ్యా
ముచ్చటగరకమలముల నిన్నుబూజించీ కొచ్చి కాగిటిలోన జేకొనగదవయ్యా
మొలకనవ్వులనే ముత్యాలసేనవెట్టీ లలినాపె మొము చూచి లాలించవయ్యా
అలమేలుమంగ పతివైన శ్రీ వేంకటేశ్వర కలసితివీకె నిట్టె కరుణించవయ్యా

చెలి పలుగోకులే
చెలి పలుగోకులే నీ సింగారము అలరె నీ కిన్నియును అవధారు నేడు
అంగన నిన్ను గూడగనటు నీపై వడిసేటి అంగపు జెమట నీకునభిశేకము
వుంగటి గొప్ప విరులు వుపరిసురత వేళ సంగతి రాలేటి చల్లువేదపూజ
నించిన కాగిటిలోన నెలత నిట్టూర్పుగాలి అంచులు మోవ విసరే యాల వట్టాలు
అంచెల మర్మము సోకనాడుకొనే మాటలు కాంచనపు గిన్నెలతో కప్పురబాగాలు
వనిత విడెము తోడ వంచిన మోవితేనె ననుపైన నీకు మహ నైవేద్యము
యెనసి శ్రీవేంకటేశ యిన్నియ గలిగె నీకు మొనగోరి మాచేతి మొక్కు లిందవయ్యా

చెలి నేడు
చెలి నేడు తా నేమి సేయునమ్మ
చెలియేమి సేయు నీచెలు లేమి సేయుదురు చెలువైన విభునిమేనిచెలు వింత సేయగా
సతి నేడు బంగారుచవికెలో జిత్రంపు గతులెంత చూపిన గడకంట జూడదు
ఆతనిజూచిన మంచియబ్బురపు జూపులు ఆతనివెంటనే పోయ నటుగాబోలు
తేనియలూరేటి మంచితియ్యని మాటలు మంత్ర గానములుగా వినుపించి కడువేసరితిమి
వానిమాటలు విన్నవలనై నముదమున వీనులు ముద్రించినవిధముగాబోలును
నిచ్చళపుమోమున నెయ్యము దయలువారె బచ్చనచేతలు గుబ్బలిపై నిండనొప్పెను
అచ్చపువేడుక వేంకటాద్రీశు డీరేయి నెచ్చలికి నిచ్చినట్టినేరుపు గాబోలును

చెలి నీవు
చెలి నీవు మొదలనే సిగ్గరి పెండ్లి కూతురవు ఇలనింత పచ్చిదీరె ఇదివో నీ భావము
చెక్కులవెంటా గారె చెమట తుడుచుకోవే చక్కవెట్టుకొనవే నీ జారిన కొప్పు
అక్కుమీద పెనగొన్న హారాలు చిక్కు దీయవే ఇక్కువల నీ కోరికె లీడేరెనిపుడు
పెదవి మీద కెంపులబేంట్లు రాలుచుకోవే చెదరిన ముంగురులు చేత దువ్వవే
వదలిన పయ్యెద చివ్వన బిగించుకొనవే పదిబదిగా నీనోము ఫలియించె నిపుడు
తిలకము కరగెను దిద్దుకోవే నొసలను కలసిన గురుతులు గప్పుకొనవే
యెలమి శ్రీవేంకటేశుడేలె నలమేలుమంగవు తలచిన తలపులు తలకూడె నిపుడు

చెలగి నా కిందుకే
చెలగి నా కిందుకే చింతయ్యీని తెలిసినదాకా నిది ద్రిష్టమయ్యీనా
హరి పుట్టించినదేహి హరినే కొలువక నరుల గొలుచుట అన్యాయమయ్యా
గరిమ నేరు గుడిచి కాలువ బొగడబోతే యెరవెరవేకాక యితవయ్యీనా
దేవుడిచ్చినట్టిబుద్ది దేవునిపయి బెట్టక భావ మింద్రియాలకియ్య బాపమయ్యా
జీవిత మొకరిసొమ్ము జీవించి యొకరివెంట ఆఅవల బరువులిడు టందమయ్యీనా
అరిది శ్రీవేంకటేశు డంతరాత్మయి వుండగాను శరణనకుండుటనాచారమయ్యా
ధర దనయింట గోటిధన మట్టేవుండగాను మరలి తిరియబోతే మట్టుపడీనా

Subscribe to:
Posts (Atom)