చెలి పలుగోకులే నీ సింగారము అలరె నీ కిన్నియును అవధారు నేడు
అంగన నిన్ను గూడగనటు నీపై వడిసేటి అంగపు జెమట నీకునభిశేకము
వుంగటి గొప్ప విరులు వుపరిసురత వేళ సంగతి రాలేటి చల్లువేదపూజ
నించిన కాగిటిలోన నెలత నిట్టూర్పుగాలి అంచులు మోవ విసరే యాల వట్టాలు
అంచెల మర్మము సోకనాడుకొనే మాటలు కాంచనపు గిన్నెలతో కప్పురబాగాలు
వనిత విడెము తోడ వంచిన మోవితేనె ననుపైన నీకు మహ నైవేద్యము
యెనసి శ్రీవేంకటేశ యిన్నియ గలిగె నీకు మొనగోరి మాచేతి మొక్కు లిందవయ్యా
No comments:
Post a Comment