భోగీంద్రులును మీరు బోయి రండు వేగగ మీదటి విభవాలకు
హరుడ పోయిరా అజుడ నీవును బోయి తిరిగిరా మీదటి తిరునాళ్ళకు
సురలు మునులును భూసురలు బోయిరండు అరవిరి నిన్నాళ్ళు నలసితిరి
జముడ పోయిరా శశియు నీవును బోయి సుముఖుడవై రా సురల గూడి
గుములై దిక్పతులు దిక్కులకు బోయిరండు ప్రమదాన నిన్నాళ్ళు బడలితిరి
నారద సనక సనందాదులు భూరివిభవముల బోయిరండు
దూరముగా బోకిట్టే తొరలి వేంకటగిరి జేరి నన్నిట్లనే సేవించుడీ
Showing posts with label భ. Show all posts

Saturday, July 17, 2010
భోగిశయనమును బుసకొట్టెడిని
భోగిశయనమును బుసకొట్టెడిని యోగ నిద్ర పాయును మేల్కొనవే
కన్నులు దెరవక కమల బాంధవుడు వెన్నెల రేణువు వెలయ దిదే
అన్నువ మలసీ నరుణోదయమిదే మిన్నక నీవిటు మేలు కొనవే
తెల్లని కన్నులు దెరవక విరియగ నొల్లక జలజము లున్నవివే
కల్ల నిదుర నిను గవియగనియ్యక మెల్లనాయ నిటు మేలు కొనవే
తెరవగు రెప్పల దెల్లవారవలె తెరవక చీకటి దీరే దీదే
తెరగు వేంకటాధిప నీ వెరుగుదు మెరుగులు చల్లుచు మేలుకొనవే

భోగము నేను
భోగము నేను నీకు భోగివి నీవు శ్రీ గురుడ విన్నిటాను చిత్తగించు నన్నును
చక్కని జన్మపు సంసార వ్రుక్శమునకు పక్కున ఫలము నీవు భావించగా
మక్కువ గర్మమనేటి మత్తగజమునకును యెక్కిన మావటీడవు యెంచగ నీవు
నెట్టిన దేహమనేటి నిర్మల రాజ్యమునకు పట్టమేలుచుండిన భూపతివి నీవే
దిట్టయైన చిత్తమనే తేజిగుఅమునకు వొట్టుక రేవంతుడవు వుపమింవనీవు
సంతతమైన భక్తి చంద్రోదయమునకు రంతుల జెలగు సముద్రమవు నీవు
చెంతల శ్రీవేంకటేశ జీవుడనే మేడలోన అంతర్యామివి నీవు అంకెల జూచినను

భూమిలోన
భూమిలోన గొత్తలాయ బుత్రోత్సవ మిదివో నేమవుకృష్ణజయంతి నేడే యమ్మా
కావిరి బ్రహ్మాండము కడుపులోనున్న వాని దేవకి గర్భమున నద్దిర మోచెను
దేవతలెల్ల వెదకి తెలిసి కాననివాని యీవల వసుదేవుడు యెట్టు గనెనమ్మా
పొడవుకు బొడవైన పురుషోత్తముడు నేడు అడరి తొట్టెలబాలుడాయ నమ్మ
వుడుగక యజ్ఞ భాగమొగి నారగించేవాడు కొడుకై తల్లిచన్నుగుడిచీనమ్మా
పాలజలధియల్లుండై పాయకుండేయీతనికి పాలవుట్లపండుగ బాతే యనటే
అలరి శ్రీవేంకటాద్రి నాటలాడనే మరిగి పేలరియై కడు పెచ్చువెరిగీనమ్మా

భావించి నేరనైతి
భావించి నేరనైతి పశుబుద్ది నైతిని యీవల నాయపచార మిది గావవయ్యా
హరి నీవు ప్రపంచమందు బుట్టించితి మమ్ము పరము నే సాధించేది బలుద్రోహ మవుగాదో
నీరులనేలేటివాడు చెప్పినట్టు సేయక విరసాలు బంట్లకు వేరే సేయదగునా
పంచేద్రియములు నాపై బంపువెట్టితివి నీవు యెంచి వాని నే దండించే దిది నేరమౌగాదో
పెంచేటితల్లిదండ్రులు ప్రియమైవడ్డించగాను కంచము కాలదన్న సంగతియా బిడ్డలకు
మిక్కిలిసంసారము మెడగట్టితివి నాకు అక్కర నే వేసారేది అపరాధ మవుగాదో
దిక్కుల శ్రీవేంకటాద్రిదేవుడ నీవియ్యగాను యెక్కడో జీవుడ నేను యెదురాడదగునా

భావించి తెలుసుకొంటే
భావించి తెలుసుకొంటే భాగ్యఫలము ఆవలీవలి ఫలము లంగజ జనకుడె
దానములలో ఫలము తపములలో ఫలము మోసములలో ఫలము ముకుందుడె
జ్ఞానములలో ఫలము జపములలో ఫలము నానా ఫలములును నారాయణుడె
విమతులలో ఫలము వేదములలో ఫలము మనసులోని ఫలము మాధవుడె
దినములలో ఫలము తీర్థ యాత్రల ఫలము ఘనపుణ్య ఫలము కరుణాకరుడె
సతత యోగఫలము చదువులలో ఫలము అతిశయోన్నత ఫలము యచ్యుతుడె
యతులలోని ఫలము జితకామిత ఫలము క్షితి మోక్షము ఫలము శ్రీవేంకటేశుడె

భావయామి గోపాలబాలం
భావయామి గోపాలబాలం మనస్సేవితం తత్పదం చింతయేహం సదా
కటి ఘటిత మేఖలా ఖచిత మణి ఘంటికా పటల నినదేన విభ్రాజమానం
కుటిల పద ఘటిత సంకుల శింజితానతం చటుల నటనా సముజ్జ్వల విలాసం
నిరతకర కలితనవనీతం బ్రహ్మాది సుర నికర భావనా శోభిత పదం
తిరువేంకటాచల స్థిత మనుపమం హరిం పరమ పురుషం గోపాలబాలం
Download

భావమెరిగిన
భావమెరిగిన నల్లబల్లి చెన్నుడా నావద్దనే వుండుమీ నల్లబల్లి చెన్నుడా
వేసరక నీవు నాతో వేమారు జేసినట్టి బాసలు నమ్మితి నల్లబల్లి చెన్నుడా
వాసికి వన్నెకు నీకు వలచి చొక్కితి నేను నా సూటికే మన్నించు నల్లబల్లి చెన్నుడా
క్రియ గూడ నేను నీ కేలువట్టి పెండ్లాడితి బయలీదించకు నల్లబల్లి చెన్నుడా
ప్రియములు రెట్టింప బెనగితి నిందాకా నయములు చూపుమీ నల్లబల్లి చెన్నుడా
యెనసితి విటు నన్ను నియ్యకోలు సేసుకొని పనుపడె రతి నల్లబల్లి చెన్నుడా
ఘన శ్రీవేంకటాద్రిపై కందువ నేలుకొంటివి నను నిందరిలోపల నల్లబల్లి చెన్నుడా

భావములోనా
భావములోనా బాహ్యమునందును గోవింద గోవిందయని కొలువవో మనసా
హరి యవతారములే యఖిల దేవతలు హరి లోనివే బ్రహ్మాండంబులు
హరి నామములే అన్ని మంత్రములు హరి హరి హరి హరి యనవో మనసా
విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు
విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా
అచ్యుతుడితడే ఆదియు నంత్యము అచ్యుతుడే యసురాంతకుడు
అచ్యుతుడు శ్రీవేంకటాద్రి మీదనిదె అచ్యుత యచ్యుత శరణనవో మనసా

భావమున బరబ్రహ్మమిదె
భావమున బరబ్రహ్మమిదె కైవసమై మాకడ చూడన్
నీలమేఘ ముపనిషార్థం బదె పాలుదొంగిలెడి బాలులలో
చాలు నదియ మాజన్మరోగముల చీల దివియు మము జెలగించన్
తనియని వేదాంత రహస్యం బదె వొనర గోపికలవుట్లపై
పనుపడి సకలాపజ్జాలంబుల పనులు దీర్చ మము బాలించన్
భయములేని పెనుబరమపదం బదె జయమగు వేంకట శైలముపై
పయిపడు దురితపు బౌజుల నుక్కున లయముసేయు మము లాలింపన్

భారమైన వేపమాను
భారమైన వేపమాను పాలువోసి పెంచినాను తీరని చేదేకాక దియ్యనుండీనా
పాయదీసి కుక్కతోక బద్దలు వెట్టి బిగిసి చాయ కెంతగట్టినాను చక్కనుండీనా
కాయపు వికారమిది కలకాలము జెప్పినా పోయిన పోకలే కాక బుద్ధి వినీనా
ముంచిముంచి నీటిలోన మూల నానబెట్టుకొన్నా మించిన గొడ్డలి నేడు మెత్తనయ్యి నా
పంచమహాపాతకాల బారి బడ్డచిత్తమిది దంచి దంచి చెప్పినాను తాకి వంగీనా
కూరిమితో దేలుదెచ్చి కోకలోన బెట్టుకొన్నా సారె సారె గుట్టుగాక చక్కనుండీనా
వేరులేని మహిమల వేంకటవిభుని కృప ఘోరమైన ఆస మేలుకోర సోకీనా

భామనోచిన నోము
భామనోచిన నోము ఫలము సఫలముగాను కామతాపంబునకు కాండవమునోమె
కొమ్మ చలిమందులకు గొంతిదామెర నోమె కమ్మదావులకు మును గౌరి నోమె
నెమ్మతిని కన్నీట నిండు గొలకులు నోమె ముమ్మడించిన వగల ముచ్చింత నోమె
చెదరు గందంబునకు చిట్టిబొట్టు నోమె కదియు పులకులకు మొలకుల నోము నోమె
ముదిత మాటాడకిదె మోనదాగెలు నోమె పొదలు చెమటలకు నినువుల నోము నోమె
నెలత మొగమునకు వెన్నెల మించులటు నోమె వెలయుగాంతికి వీధివెలుగు దా నోమె
ఎలమితోదిరు వేంకటేశుగూడి లలితాంగి నిచ్చకల్యాణంబు నోమె

భామ శృంగారించు
భామ శృంగారించు భావమే యందము కాముని రతిసాటి కాంతులీలాగు
పూవొకటి వికసించె పున్నమి చంద్రుని వలెనే పూవుమీద మరిరెండు పూలుబూసె
రెండు పూవుల నడుమ పూసెనొకపువ్వు పూవు కింద ముప్పదిరెండు మొగ్గలెత్తె
పక్షి యొక్కటి వాలె భద్రేభమనగాను పక్షిమీదను రెండు పక్షులాయెను
రెండు పక్షుల నడుమనే వ్రాలె నొక పక్షి పక్షితో జోడుగా పలికే నొకపక్షి
చిగురునే రెంటి చెందామరో యనగ చిగురు మీదను రెండు చిగురులెత్తె
చిగురుబోణి యింట శ్రీ వేంకటేశుడు చిగురు లోపలి తేనె చెలగి చవిచూచె

భళి భళి రామ
భళి భళి రామ పంతపు రామ నీ బలిమి కెదురు లేరు భవహర రామ
విలువిద్య రామా వీర విక్రమ రామా తలకొన్న తాటకాంతక రామా
కొలయై బరుని తలగుండు గండ రామా చలమరి సమరపు జయజయ రామా
రవికుల రామా రావణాంతక రామా రవినుత ముఖ కపిరాజ రామా
సవరగా కొండలచే జలధి గట్టిన రామా జవ సత్త్వ సంపన్న జానకీ రామ
కౌసల్యా రామ కరుణానిధి రామ భూసుర వరద సంభూత రామ
వేసాల పొరలే శ్రీవేంకటాద్రి రామ దాసులమము గావ తలకొన్న రామ

భక్తినీపై దొకటె
భక్తినీపై దొకటె పరమసుఖము యుక్తిజూచిన నిజం బొక్కటేలేదు
కులమెంత గలిగెనది కూడించు గర్వంబు చలమెంత గలిగెనది జగడమే రేచు
తలపెంత పెంచినా తగిలించు కోరికలు యెలమి విజ్ఞానంబు యేమిటాలేదు
ధనమెంత గలిగెనది దట్టమౌలోభంబు మొనయు చక్కదనంబు మోహములు రేచు
ఘనవిద్య గలిగినను కప్పు పై పై మదము యెనయగ పరమ పద మించుకయులేదు
తరుణులెందరు అయిన తాపములు సమకూడు సిరులెన్ని గలిగినను చింతలేపెరుగు
యిరవయిన శ్రీవేంకటేశు నినుకొలువగా పెరిగె నానందంబు బెళకులికలేవు

భక్తికొలది వాడే
భక్తికొలది వాడే పరమాత్ముడు భుక్తిముక్తి తానెయిచ్చు భువి పరమాత్ముడు
పట్టినవారిచే బిడ్డ పరమాత్ముడు బట్టబయటి ధనము పరమాత్ముడు
పట్టపగటి వెలుగు పరమాత్ముడు యెట్టనెదుటనే వున్నాడిదె పరమాత్ముడు
పచ్చిపాలలోనివెన్న పరమాత్ముడు బచ్చనవాసినరూపు పరమాత్ముడు
బచ్చుచేతివొరగల్లు పరమాత్ముడు యిచ్చుకొలదివాడువో యీ పరమాత్ముడు
పలుకులలోనితేట పరమాత్ముడు ఫలియించునిందరికి పరమాత్ముడు
బలిమిశ్రీ వేంకటాద్రి పరమాత్ముడు యెలమి జీవులప్రాణమీ పరమాత్ముడు

భక్త సులభుడును
భక్త సులభుడును పరతంత్రుడు హరి యుక్తిసాధ్య మిదె యొకరికీ గాడు
నినుపగులోకముల నిండిన విష్ణుడు మనుజుడ నాలో మనికియయ్యె
మునుకొని వేదముల ముడిగినమంత్రము కొననాలికలలో గుదురై నిలిచె
యెలమి దేవతలనేలినదేవుడు నలుగడ నదముని నను నేలె
బలుపగు లక్ష్మీపతియగుశ్రీహరి యిల మాయింటను యిదివో నిలిచె
పొడవుకు బొడవగు పురుషోత్తముడిదె బుడిబుడి మాచేత బూజగొనె
విడువ కిదివో శ్రీ వేంకటేశ్వరుడు బడివాయడు మాపాలిట నిలిచి

Subscribe to:
Posts (Atom)