భామ శృంగారించు భావమే యందము కాముని రతిసాటి కాంతులీలాగు
పూవొకటి వికసించె పున్నమి చంద్రుని వలెనే పూవుమీద మరిరెండు పూలుబూసె
రెండు పూవుల నడుమ పూసెనొకపువ్వు పూవు కింద ముప్పదిరెండు మొగ్గలెత్తె
పక్షి యొక్కటి వాలె భద్రేభమనగాను పక్షిమీదను రెండు పక్షులాయెను
రెండు పక్షుల నడుమనే వ్రాలె నొక పక్షి పక్షితో జోడుగా పలికే నొకపక్షి
చిగురునే రెంటి చెందామరో యనగ చిగురు మీదను రెండు చిగురులెత్తె
చిగురుబోణి యింట శ్రీ వేంకటేశుడు చిగురు లోపలి తేనె చెలగి చవిచూచె
No comments:
Post a Comment