శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

Saturday, July 24, 2010

లోకపు నీ చేతలకు

లోకపు నీ చేతలకు లోనేకాదా నీకు మారుకొని యుండ నేరుపా నాకు

వుడివోని జవ్వనము వొడిగట్టుకొని నీతో పడిబెట్టి యలుగగ సంగతే నాకు
చిడిముడి కోరికలు చిత్తములో నుండగాను తడిసి నిన్ను బాయగ తగునా నాకు

వుప్పతిల్లు జన్నులు వురమున మోచుకొని చిప్పిలనీ నేరాలెంచ జెల్లునా నాకు
ముప్పిరి మొగమోటలు మోముమీద నుండగాను అప్పుడే నిన్నణకించ ననువా నాకు

నించుకొన్న జవ్వనము నిలువున బెట్టుకొని చండసేసి పెనగగ సరవే నాకు
అండనే శ్రీవేంకటేశ అంతలో నన్నేలితివి అందుకాచి దూరదగ నవునా నాకు

Friday, July 23, 2010

లేదు భయము

లేదు భయము మఱి కాదు భవము ఆదియు నంత్యము దెలిసిన హరియాజ్ఞేకాన

తలపులుగడుగక వొడ లటు తా గడిగిన నేమి వెలుపలికాంక్షలు వుడుగక విధులుడిగిన నేమి
అలరుచు శ్రీహరిదాస్యము ఆతుమ గలిగినయాతడు చెలగుచు పనులైన సేసిన మరి యేమి

పొంచిన కోపము విడువక భోగము విడిచిననేమి పంచేంద్రియములు ముదియక పై ముదిసిన నేమి
వించినదైవము నమ్మిన నిర్భరుడయినయాతడు యెంచుక యేమార్గంబుల నెట్టుండిన నేమి

వేగమె లోపల గడుగక వెలి గడిగిన నేమి యోగము దెలియక పలుచదువులు దెలిసిన నేమి
యీగతి శ్రీ వేంకటపతి నెఱిగి సుఖిందేటియాతడు జాగుల ప్రపమ్చమందును నతమైనా నేమి

లేదు బ్రహ్మవిద్యామహాసుఖము

లేదు బ్రహ్మవిద్యామహాసుఖము తమ కీడు తమకర్మ మేమిసేయగవచ్చు

నానావిధుల బొరలి నరుడు దానై వివిధ మైనకర్మములే అనుభవించి
లేనిలంపటములకు లోనై దురితా ధీనులై క్రమ్మర దిరిగిపోవుటేకాని

పరగ నిన్నిట బొడమి బ్రాహ్మణుడై సరిలేని వేదశాస్త్రములు చదివి
అరుదయినకాంక్షచే నతిపాపపరులై వెరవున బొడవెక్కి విరుగబడుటేకాని

చేరనిపదార్థములే చేరగోరుటగాని చేరువనే యామేలు సిద్ధింపదు
ధీరులై తమలోన దిరువేంకటేశ్వరుని గోరి యిటు భజియింపగూడు టెన్నడుగాన

లెండో లెండో

లెండో లెండో మాటాలించరో మీరు కొండలరాయనినే పేర్కొన్నదిదె జాలి

మితిమీరె చీకట్లు మేటితలవరులాల జతనము జతనము జతనము జాలోజాలి
యితవరులాల వాయించే వాద్యాలకంటె అతిఘోషముల తోడ ననరో జాలి

గాములు వారెడి పొద్దు కావలి కాండ్లాల జాము జాము దిరుగరో జాలో జాలి
దీమనపు పారివార దీవె పంజులు చేపట్టి యేమరక మీలో మీరు యియ్యరో జాలి

కరుకామ్మె నడురేయి గడచె గట్టికవార సరె సరె పలుకరో జాలోజాలి
యీ రీతి వేంకటేశుడిట్టె మేలుకొన్నాడు గారవాన నిక మాన కదరో జాలి

లాలి శ్రీ క్రిష్ణయ్య

లాలి శ్రీ క్రిష్ణయ్య నీల మేఘవర్ణ నవ నీల మేఘవర్ణ బాలగోపాలపాల పవ్వళింపరా....

సింగారించిన మంచి బంగారు ఊయలలోన మరి బంగారు ఊయలలోన
శంఖు చక్రథరస్వామి నిదురపొరా

లలితాంగి రుక్మిణీ లలనాయె కావలెనా నీకు లలనాయె కావలెనా
పలుకు కోయిల సత్యభామయె కావలెనా

అందెలూ మువ్వలూ సందడిగ మ్రోయగను అతి సందడిగ మ్రోయగను
అందముగాను నీవు పవ్వలింపరా

పగడాల పతకాలు కంఠనా ధరియించి నీ కంఠనా ధరియించి
వంగేవు తొంగేవు నిదురపోరా

అలుకలు పోనెల అలవేలు మంగతో శ్రీ అలవేలు మంగతో
కులుకుచు శయ్యనించు వెంకటేశ్వరుడా


Download

లాలనుచు

లాలనుచు నూచేరు లలనలిరుగడల బాలగండవీర గోపాలబాల

ఉదుట గుబ్బల సరసము లుయ్యాల లూగ పదరి కంకణరవము బహుగతులమ్రోగ
వొదిగి చెంపల కొప్పు లొక్కింత వీగ ముదురు చెమటల నళికములు తొప్పదోగ

సొలపు తెలిగన్నుగవ చూపులిరువంక మలయు రవళులకు బహుమారును బెళంక
కొలది కోవిగములు క్రోలుమదనాంక ములగ్రేణిసేయు రవములు వడిదలంక

సరుస పదములు జంగ చాపుచే బాయ గురులీల మీగళ్ళ గుచ్చెళ్ళరాయ
కరమూలముల కాంతి కడుజాయజేయు సరస నురుకుసుమ వాసన లెదురుడాయ

కొలది నునుమేనుల కూనలసి యాడ మెలకువతో నొకరొకరి మెచ్చి సరిగూడ
తలలూచి చొక్కి చిత్తరు బొమ్మలాడ అలరి యెల్లరు మోహనా కృతులు చూడ

లలిత తాంబూల రసకలితంబులైన తళుకు దంతములు కెంపుల గుంపులీన
మొలక వెన్నెల డాలు ముసురు కొనితోన చెలగి సెలవుల ముద్దు చిరునవ్వులాన

మలయ మారుత గతులు మాటికి జెలంగ పలుకు గపురపు తావి పైపై మెలంగ
పలుగాన లహరి యింపుల రాల్గరగంగా బలసి వినువారి చెవి బడలిక దొలంగ

లలనా జనాపాంగ రలిత సుమచాప జలజలోచన దేవ సద్గుణ కలాప
తలపు లోపల మెలగు తత్త్వప్రదీప భళిర గండపరేశ పరమాత్మరూప

Wednesday, July 21, 2010

లలిత లావణ్య

లలిత లావణ్య విలానముతోడ నెలత ధన్యతగతిగె నేటితోడ

కుప్పలుగా మైనసలుకొన్న కస్తూరితోడ తొప్పదోగేటి చెమతతోడ
అప్పుడటు శశిరేఖలైన చనుగవతోడ దప్పిదేరేటి మొముదమ్మితోడ

కులుకుగబరీభరము కుంతలంబులతోడ తొలగదోయని ప్రేమతోడ
మొలకనవ్వులు దొలకుముద్దు జూపులతోడ పులకలు పొడవైన పొలుపుతోడ

తిరువేంకటాచలాధిపుని మన్ననతోడ సరిలేని దివ్యవాసనలతోడ
పతికించరాని అరవిరిభావముతోడ సిరిదొలంకెడి చిన్ని సిగ్గుతోడ

లక్ష్మీకల్యాణము

లక్ష్మీకల్యాణము లలితోంబాడిమిదె నేము లక్ష్మీనారాయణులే లలనయు నీవును

చూపులు చూపులు మీకు సూసకమ్ బాసికము వూపచన్ను గుబ్బలివి పూజికుండలు
తిపులమోవి తేనెలు తీరనిమధుపర్కము దాపుగ వెండ్లి యాడరయ్య తగుందగు మీకును

మాటలు మీకిద్దరికి మంత్రములు మేటి తలంబ్రాలు మీలోమించు నవ్వులు
గాటమైన పులకలు కప్పుర వసంతాలు నీటునం బెండ్లాడరయ్య నెరవేర మీకును

కౌగిలి కౌగిలి మీకు కందువపెండ్లి చవికె పాగిన కోరికలె పావకొరళ్లు
ఆగిన శ్రీ వేంకటేశ అలమేలుమంగనీవు వింగక పెండ్లాడరయ్య వేడ్కాయ మాకును

లంకెలూడుటే

లంకెలూడుటే లాభము యీ కింకరులను నలగెడికంటెను

జంపుల జంపక సరగునబాసేటి లంపటమేపో లాభము
కంపుమోపుతో గనలి శరీరపు కొంపలోనవేగుటకంటెను

ఈవలనావల నేనేటియాసల లావు దిగుటేపో లాభము
యేవగింతలకు నిరవగు నరకపు కోవులబడి మునుగుటకంటెను

తివిరి వేంకటాధిపుదాసులకృప లవలేశమెపో లాభము
చవులని నోరికి సకలము దినితిని భవకూపంబుల బడుటకంటెను