ఎంత పుణ్యమో యిటు మాకుగలిగె చెంతనే నీకృప సిద్ధించబోలు
శ్రీపతి మీకథ చెవులను వింటిమి పాపములణగెను భయముడిగె
తీపుగ తులసీ తీర్థము గొంటిమి శాపము దీరెను సఫలంబాయె
గోవింద మిముగను గొంటిమిప్పుడే పావనమైతిమి బ్రతికితిమి
తావుల మీపాదములకు మ్రొక్కితిమి వేవేలు గలిగిన వేడుకలాయె
శ్రీవేంకటేశ్వర సేవించితి మిము ధావతి దీరెను తనిసితిమి
వావిరి ముమ్మారు వలగొని వచ్చితి నీవారమైతిమి నిలిచితి మిపుడు
Showing posts with label ఎ. Show all posts

Saturday, August 7, 2010
ఎంత మాయల
ఎంత మాయల వాడు ఎంచి చూడగ వీడు యింతియీతని రూపము ఎవ్వరెరుగుదురు
తెలుపు జలములలోన తెప్పవలె దేలీనే తలకి పాతాళమున దగియుండేనే
కెలసి తనకన్నులను కెంపువలె జేసీనే నెలత భీకరముగా నేడు నవ్వీనే
ఒరపుగా భూదాన మొకరికి దానడిగీనే తరుణి భూమొక్కరికి ధారవోసినే
మరలి పద్మజుని మనుమనినైన జంపీనే పరచు దనమున వృధాపాలు మాలీనే
పలుమారు తనసిగ్గు బయటబడ జేసేనే కలికితనమునను తామ గడవబాసీనే
వెలది వేంకటగిరి విభుడు నాకౌగిట తొలగక జెమటల దొప్ప దోచీనే

ఎక్కువ తక్కువ
ఎక్కువ తక్కువ లేవో యెఱుగ మిద్దరిలోన ఒక్కటై నీవురముపై వున్నదిదె చెలియ
ఆకడ జలధి ద్రచ్చి అమృత మిచ్చితివీవు ఆకెకైతే మోవిజిందీ నమృతము
సైకపు పసిడి చీర సరిగట్టితివి నీవు మేకొని యీమైకైతే మేనెల్ల బసిడే
నిగిడి కౌస్తుభపుమాణికము గట్టితివీవు మగువకైతే నోరెల్లా మాణికములే
బెగడి యాకసమెల్లా పెద్దసేసి కొలచితివి బిగిసే యీచెలికైతే బిడికెడు నడుమే
పలుమారు జలధిలో బవళించితివినీవు కలికి గుణములోనే ఘనజలధి
యెలమి శ్రీ వేంకటేశ యిప్పుడు గూడితిగాని జలజాక్షి యైతే నిన్ను సన్నలనే గలసె

Saturday, June 5, 2010
ఎవ్వరెవ్వరివాడో
ఎవ్వరెవ్వరివాడో యీజీవుడు చూడ నెవ్వరికి నేమౌనో యీజీవుడు
ఎందరికి గొడుకుగా డీజీవుడు వెనుక కెందరికి దోబుట్ట డీజీవుడు
యెందరిని భ్రమయించ డీజీవుడు దుఃఖ మెందరికి గావింప డీజీవుడు
ఎక్కడెక్కడ దిరుగ డీజీవుడు వెనుక కెక్కడో తనజన్మ మీజీవుడు
యెక్కడి చుట్టము దనకు నీజీవుడు యెప్పు డెక్కడికి నేగునో యీజీవుడు
ఎన్నడును జేటులేనీజీవుడు వెనుక కెన్నిదనువులు మోవ డీజీవుడు
యెన్నగల తిరువేంకటేశు మాయల దగిలి యెన్నిపదవుల బొంద డీజీవుడు

ఎవ్వరుగలరమ్మా
ఎవ్వరుగలరమ్మా యిక నాకు నెవ్వగలలో జిత్తము నెలకొన్నదిపుడు
మనసుకోరిక దీని మానిపెదనంటినా వొనగూడి మనసు నావొదలేదు
పెనగి తమకము వాపెదనంటినా మేన అనయము వెరపు దానై యున్నధివుడు
చింత తాలిముల ముంచెదనంటినా మేన సంతావముల సేయ జలపట్టెను
అంతరంగము నాది యంటినా నెవున సంతతము నాతడే జట్టిగొనెనిపుడు
సింగారపు మెను నా చేతికి లోనంటినా అంగవించి పరవశమై యున్నది
యింగితమెరిగి వేంకటేశుడు నాకంటినా కంగినన్ను గారించి కలసెనిపుడు

ఎవ్వరు లేరూ
ఎవ్వరు లేరూ హితవుచెప్పగ వట్టీ నొవ్వుల బడి నేము నొగిలేమయ్యా
అడవి బడినవాడు వెడల జోటులేక తొడరి కంపలకిందు దూరినట్లు
నడుమ దురిత కాననములతరి బడి వెడలలేక నేము విసిగేమయ్యా
తెవులువడినవాడు తినబోయి మధురము చవిగాక పులుసులు చవిగోరినట్లు
భవరోగముల బడి పరమామృతము నోర జవిగాక భవములు చవులాయనయ్యా
తనవారి విడిచి యితరమైనవారి వెనక దిరిగి తావెర్రైనట్లు
అనయము తిరువేంకటాధీశు గొల్వక మనసులోనివాని మరచేమయ్యా

ఎవ్వరు దిక్కింక
ఎవ్వరు దిక్కింక నాకు నేది బుద్ది యివ్వల విచారించవే ఇందిరారమణా
వెంటబెట్టి కామక్రోధవితతులు చుట్టి నన్ను తొంటి మీసేవకు నన్ను దూరము సేసె
కంటకపుటింద్రియాలు కడుహితశత్రులై అంటిన మోముత్రోవ నంటకుండా జేసెను
తిప్పి తిప్పి నాయాసలు తెగీ వైష్ణవధర్మాన దెప్పల దేలకుండాను తీదీపు సేసె
వొప్పగుంసంసార మిది వున్నతి నాచార్యసేవ చొపు మాపి పుణ్వాసకు జొరకుండాజేసెను
మచ్చరపు దేహ మిది మనసిట్టె పండనిక తచ్చి యజ్ఞానమునకు దావుసేసె
ఇచ్చల శ్రీవేంకటేశ ఇంతలో నన్ను నేలగ నిచ్చలు నీకృపే నన్ను నిర్మలము సేసెను

ఎవ్వరు గర్తలుగారు
ఎవ్వరు గర్తలుగారు యిందిరానాథుడే కర్త నివ్వటిల్లాతనివారై నేమము దప్పకురో
కర్మమే కర్తయితే కడకు మోక్షము లేదు అర్మిలి జీవుడు గర్తయైతే బుట్టుగేలేదు
మర్మపుమాయ గర్తయితే మరి విజ్ఞానమేలేదు నిర్మితము హరిదింతే నిజమిదెరుగరో
ప్రపంచమే కర్తయితే పాపపుణ్యములు లేవు వుపమ మనసు గర్తైయుంటే నాచారమేలేదు
కపటపు దెహములే కర్తలయితే చావులేదు నెపము శ్రీహరిదింతే నేరిచి బ్రదుకరో
పలుశ్రుతులు గర్తలై పరగితే మేరలేదు అల బట్టబయలు గర్తైతే నాధారము లేదు
యెలమి నిందరికి గర్త యిదివో శ్రీవేంకటాద్రి నిలయపుహరి యింతే నేడే కొలువరో

ఎవ్వరివాడో
ఎవ్వరివాడో యెఱుగరాదు అవ్వలివ్వలిజీవు డాటలో పతిమే
ధర జనించకతొలుత తను గానరాదు మరణమందినవెనుక మఱి కానరాదు
వురువడిదేహముతో నుందినయన్నాళ్ళే మరలుజీవునిబదుకు మాయవో చూడ
యిహములో భోగించు నిందు గొన్నాళ్ళు మహిమ పరలోకమున మలయు గొన్నాళ్ళు
తహతహల గర్మబంధముల దగిలినయపుడే అహహ దేహికి బడుచులాటవో బదుకు
సంతానరూపమై సాగు ముందరికి కొంత వెనకటిఫలము గుడువ దా దిరుగు
యింతటికి శ్రీవేంకటేశు డంతర్యామి అంతి నితనిగన్నబదుకువో బదుకు

ఎవ్వరివాడో ఈ దేహి యివ్వల నవ్వల నీ దేహి
కామించు నూరకే కలవియు లేనివి యేమిగట్టుకొనె నీ దేహి
వాములాయ నిరువదియొక వావులు యేమని తెలిసెనో యీ దేహి
కందువ నిజములు గల్లలునడపి యెందుకు నెక్కెనో యీ దేహి
ముందర నున్నవి మొగిదనపాట్లు యిందె భ్రమసీ నీ దేహి
పంచేంద్రియముల పాలాయ జన్మము యించుక యెరుగడు యీదేహి
అంచెల శ్రీ వేంకటాధీశ నీకృప వంచగ గెలిచెను వడి నీ దేహి

ఎవ్వరిభాగ్యం
ఎవ్వరిభాగ్యం బెట్టున్నదో దవ్వు చేరువకు తానె గురుతు
పరమమంగళము భగవన్నామము సురలకు నరులకు శుభకరము
యిరవుగ నెఱిగిన యెదుటనె వున్నది వరుసల మఱచినవారికి మాయ
వేదాంతసారము విష్ణుభక్తి యిది అదిమునులమత మయినది
సాదించువారికి సర్వసాధనము కాదని తొలగిన గడుశూన్యంబు
చేతినిదానము శ్రీవేంకటపతి యేతల జూచిన నిందరికి
నీతియు నిదియే నిజఏవకులకు పాఠకులకు నది భవసాగరము

ఎవ్వరికైనను
ఎవ్వరికైనను యివ్రాత నను నవ్వులు సేసెబో నావ్రాత
తొలిజన్మంబున దోషకారియై నలుగడ దిప్పెను నావ్రాత
యిల దుర్గుణముల కీజన్మంబున నలకువ సేసెబో నావ్రాత
పురుషుని జేసల్పుని ననిపించుట నరజన్మమునకు నావ్రాత
తరుచయ్యినైపాతక మరుపెట్టుక నరకము చూపెబో నావ్రాత
పామఱితనమున బహువేదనలను నామ సెనసెబో నావ్రాత
కామితఫలు వేంకటపతిని గొలిచి నామతి దెలిపెబో నావ్రాత

ఎవ్వరికిగలదమ్మ
ఎవ్వరికిగలదమ్మ యింత సౌభాగ్యము యివ్వల నీతో సరి యెంచరాదే నొరుల
వీడిన తురముతోడ విరుల పైపై రాల వాడిక కన్నులతోడ వచ్చేనేమి
వడియు జెమటతోడ వత్తివంటి మోవితోడా నడపు మురిపెములతోడ నవ్వేవేమే
నిద్దుర కన్నులతోడ నిండుబులకలతోడ ముద్దుగారే మోముతోడ మురిసేవేమే
వొద్దనే శ్రీవేంకటేశుడొగిగూడు తెరుగమే ముద్దురాల నేడు నీ మోహ మెంచరాదే

ఎవ్వరి గాదన్న
ఎవ్వరి గాదన్న నిది నిన్ను గాదంట యెవ్వరి గొలిచిన నిది నీకొలువు
అవయవములలో నది గాదిది గా దని మేలివి మేలన నేలా
భువియు బాతాళము దివియు నందలి జంతు నివహ మింతయునూ నీదేహమేకాన
నీవు లేనిచోటు నిజముగ దెలిపిన ఆవల నది గాదనవచ్చును
శ్రీవేంకటగిరి శ్రీనాథ సకలము భావింప నీవే పరిపూర్ణుడవుగాన

ఎవ్వడోకాని
ఎవ్వడోకాని యెరుగరాదు కడు దవ్వులనే వుండు తలపులో నుండు
యెదయవు తనరెక్క లెగసి పోలేడు కడు దాగుగాని దొంగయు గాడు
వడి గిందుపడును సేవకుడునుగాడు వెడగుగోళ్ళు వెంచు విటుడును గాడు
మిగుల బొట్టివాడు మింటికిని బొడవు జగడాలు తపసి వేషములును
మగువకై పోరాడు మరి విరక్తుండును తగు గాపుబనులు నెంతయు దెల్లదనము
తరుణుల వలపించు దగిలి పైకొనడు తురగము దోలు రౌతునుగాడు
తిరువేంకటాద్రిపై పరగు నెప్పుడును పరమమూర్తియై పరగు నీఘనుడు

ఎఱుగుదురిందరు
ఎఱుగుదురిందరు నెఱిగీనెఱుగరు హరి దానే నిజపరమాతుమని
నలినాసనుడెఱుగు నారదుడెఱుగు కొలది శివుడెఱుగు గుహుడెఱుగు
యిల గపిలుడెఱుగు నింతా మనువెఱుగు తలప విష్ణుడే పరతత్త్వమని
బెరసి ప్రహ్లాదుడు భీష్ముడు జనకుడు గురుతుగ బలియు శుకుడు గాలుడు
వరుస నెఱుగుదురు వడి రహస్యముగ హరి యితడే పరమాత్ముడని
తెలియదగిన దిది తెలియరాని దిది తెలిసినాను మది దెలియ దిది
యిల నిందరు దెలిసిరిదే పరమమని కలవెల్ల దెలిపె వేంకటరాయడు

ఎఱుగనైతి
ఎఱుగనైతి నిందాకా నేటిదో యంటానుంటి నెఱి దొరలనాడీని నేనే మందు నికను
కొండలలో నెలకొన్న కోన చెన్నరాయడిదే బొండు మల్లెల వేసెనేపూచి నన్నును
పండుముత్తేల సొమ్ములప్పటి నామెడ బెట్టి దుండగము సేసె నేమందు నేనికను
గొప్పయైన యేటిదరి గోన చెన్నరాయడిదే దప్పికి గప్పురదుంపె దరుణి చేత
చెప్పరాని మాటలెల్ల జెవిలో దానే చెప్పి దుప్పటి గప్పీ నేమందు నికను
గుఱితో శ్రీ వేంకటాద్రి కోన చెన్నరాయడిదే చెరుగు పట్టి ప్రియురాలు చెప్పికూడెను
జఱయుచు వచ్చి వచ్చి చనవు లెల్లా నొసగి మెఱసి తొరల నాడి మఱే మందు నికను

ఎఱుక గలుగునా
ఎఱుక గలుగునా డెఱుగడటా మఱచినమేనితొ మరి యెఱిగీనా
పటువైభవముల బరగేటినాడె తటుకున శ్రీహరి దలచడటా
కుటిలదేహియై కుత్తిక బ్రాణము తటతటనదరగ దలచీనా
ఆలుబిడ్డలతో మహాసుఖ మందుచు తాలిమితో హరి దలచడటా
వాలినకాలునివసమైనప్పుడు దాళి వేడగా దలచీనా
కొఱతలేని తేకువ దానుండేటి తఱి వేంకటపతి దలచడటా
మరులు దేహియై మఱచివున్నయడ తఱచుటూరుపుల దలచీనా

ఎప్పుడును
ఎప్పుడును గుట్టుతోడి యిల్లాండ్లము నేము వొప్పుగ సిగ్గు విడువనోజగాదు మాకును
మాట మాటలను నీకు మనసిచ్చి మెచ్చి యాపె కాటుక కన్నుల జూచి కరగించీని
తేటలు నేరుచునాపె తేలించనోపు నాపె యేటికి యవ్వరిపొందులేమి బాతి యికను
చేయివేసి చేయివేసి చెక్కునొక్కి చేత మొక్కి మాయపు నవ్వులు నవ్వి మరగించీని
చాయలకు వచ్చునాపె సరసములాడు నాపె ఆయనాయ వున్నసుద్దులాడ నేల యికను
వలపులు చల్లి చల్లి వాడికెగా నిన్ను గూడి వెలయించ నేర్చునాపె యిన్నిటా నాపె
అలరి శ్రీ వేంకటేశ అప్పటి నన్ను గూడితి తొలుతటి సద్దులేల దొమ్ములేల యికను

ఎపుడు గానిరాడో
ఎపుడు గానిరాడో యెంత దడవాయ కాని చప్పుడాలకించి మతి జల్లురనెనమ్మా
ఇద్దర మదరిపాటు ఏకాంతాన నాడుకొన్న సుద్దులు దలచి మేను చురుకనెనమ్మా
పెద్దగా గస్తూరి బొట్టూ పెట్టిన నాతడు గోర తిద్దుట దలచి మేను దిగులనేనమ్మా
పాయక యతడూ నేను బవ్వళించే యింటి వంక బోయపోయి కడు జిన్నబోతినే యమ్మ
తోయపు గుబ్బల చన్నుదోయి మీద వాడొత్తిన పాయపుజంద్రులజూచి భ్రమసితినమ్మా
కూడిన సౌఖ్యములందు కొదలేని వానినా వేడుక మతి దలచి వెరగాయనమ్మా
యీడులేని తిరు వేంకటేశుడిదె నాతోడ నాడినట్టే నాచిత్త మలరించెనమ్మా

Subscribe to:
Posts (Atom)