శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Saturday, June 5, 2010

ఎఱుగనైతి

ఎఱుగనైతి నిందాకా నేటిదో యంటానుంటి నెఱి దొరలనాడీని నేనే మందు నికను

కొండలలో నెలకొన్న కోన చెన్నరాయడిదే బొండు మల్లెల వేసెనేపూచి నన్నును
పండుముత్తేల సొమ్ములప్పటి నామెడ బెట్టి దుండగము సేసె నేమందు నేనికను

గొప్పయైన యేటిదరి గోన చెన్నరాయడిదే దప్పికి గప్పురదుంపె దరుణి చేత
చెప్పరాని మాటలెల్ల జెవిలో దానే చెప్పి దుప్పటి గప్పీ నేమందు నికను

గుఱితో శ్రీ వేంకటాద్రి కోన చెన్నరాయడిదే చెరుగు పట్టి ప్రియురాలు చెప్పికూడెను
జఱయుచు వచ్చి వచ్చి చనవు లెల్లా నొసగి మెఱసి తొరల నాడి మఱే మందు నికను

No comments:

Post a Comment