శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

Thursday, June 10, 2010

జ్ఞానులాల యోగులాల

జ్ఞానులాల యోగులాల సకలవిరక్తులాల నానావిహాల విని నమ్మేరు సుండి

అలరియింతులయధరామృతము లివియెల్ల కాలకూటవిషములకరణి సుండి
శీలముతో వీరలచెట్టలు వట్టుటలెల్లా బాలనాగాల దొడికి పట్టుట సుండి

కాంతలు నవ్వుచునైనా గన్నుల జూచినచూపు పంతమున నలుగులపాతర సుండి
బంతుల నెదుటనున్న పడతులచన్ను లివి కంతల నొడ్డినబడిగండ్లు సుండి

జవ్వనపుగామినుల సరసపుమాటలెల్లా మవ్వమైనయట్టిచొక్కు మంత్రాలు సుండి
యివ్వలను శ్రీవేంకటేశ్వరుదాసుల కివి చివ్వన జెప్పినట్టు చేసేవి సుండి

జ్ఞానయజ్ఞమీగతి

జ్ఞానయజ్ఞమీగతి మోక్షసాధనము నానార్థములు నిన్నే నడపె మాగురుడు

అలరి దేహమనేటి యాగశాలలోన బలువై యజ్ఞానపుపశువు బంధించి
కలసి వైరాగ్యపుకత్తుల గోసికోసి వెలయు జ్ఞానాగ్నిలో వేలిచె మాగురుడు

మొక్కుచు వైష్ణవులనేమునిసభ గూడపెట్టి చొక్కుచు శ్రీపాదతీర్థ సోమపానము నించి
చక్కగా సంకీర్తనసామగానము చేసి యిక్కువతో యజ్ఞము సేయించెబో మాగురుడు

తదియ్యగురు ప్రసాదపు పురోడాశమిచ్చి కొదదీర ద్వయమనుకుండలంబులు వెట్టి
యెదలో శ్రీవేంకటేశు నిటు ప్రత్యక్షముచేసె యిదివో స్వరూపదీక్ష యిచ్చెను మా గురుడు

జోఅచ్యుతానంద

జోఅచ్యుతానంద జోజో ముకుంద రావె పరమానంద రామ గోవింద

నందు నింటను జేరి నయము మీఱంగ చంద్రవదనలు నీకు సేవ చేయంగ
నందముగ వారిండ్ల నాడుచుండంగ మందలకు దొంగ మా ముద్దురంగ

పాలవారాశిలో పవళించినావు బాలుగా మునుల కభయమిచ్చినావు
మేలుగా వసుదేవు కుదయించినావు బాలుడై యుండి గోపాలుడైనావు

అట్టుగట్టిన మీగ డట్టె తిన్నాడే పట్టి కోడలు మూతిపై రాసినాడే
అట్టె తినెనని యత్త యడగ విన్నాడే గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే

గొల్లవారిండ్లకు గొబ్బునకుబోయి కొల్లలుగా త్రావి కుండలను నేయి
చెల్లునా మగనాండ్ర జెలిగి యీశాయీ చిల్లతనములు సేయ జెల్లునటవోయి

రేపల్లె సతులెల్ల గోపంబుతోను గోపమ్మ మీ కొడుకు మా యిండ్ల లోను
మాపుగానే వచ్చి మా మానములను నీపాపడే చెఱిచె నేమందుమమ్మ

ఒకని యాలినిదెచ్చి నొకని కడబెట్టి జగడములు కలిపించి సతిపతులబట్టి
పగలు నలుజాములును బాలుడై నట్టి మగనాండ్ర చేపట్టి మదనుడై నట్టి

అంగజుని గన్న మా యన్న యిటు రారా బంగారు గిన్నెలో పాలు పోసేరా
దొంగ నీవని సతులు గొంకుచున్నారా ముంగిట నాడరా మోహనాకార

గోవర్ధనంబెల్ల గొడుగుగా పట్టి కావరమ్మున నున్న కంసుపడగొట్టి
నీవు మధురాపురము నేలచేపట్టి ఠీవితో నేలిన దేవకీపట్టి

అలిగి తృణావర్తు నవని గూల్చితివి బలిమిమై బూతన బట్టి పీల్చితివి
చెలగి శకటాసురుని జేరి డొల్చితివి తలచి మద్దులు రెండు ధరణి వ్రాల్చితివి

హంగుగా తాళ్ళపా కన్నయ్య చాల శృంగార రచనగా చెప్పెనీ జోల
సంగతిగ సకల సంపదల నీవేళ మంగళము తిరుపట్ల మదనగోపాల


Download

జీవు డెంతటివాడు

జీవు డెంతటివాడు చిత్త మెంతటిది తన దైవికము గడప నెంతటివాడు దాను

విడిచిపోవనియాస విజ్ఞానవాసనల గడచి మున్నాడె నెక్కడివివేకములు
వుడుగనియ్యనిమోహ ముబ్బి పరమార్థముల మెడవట్టి నూకె నేమిటికింక నెరుక

పాయనియ్యనిమహాబంధ మధ్యాత్మతో రాయడికి దొడగై సైరణలేల కలుగు
మాయనియ్యనికోపమహిమ కరుణామతిని వాయెత్తనియ్య దెవ్వరికి జెప్పుదము

సరిలేనియాత్మచంచల మంతరాత్మకుని నెరగనియ్యదు దనకు నేటిపరిణతులు
తిరువేంకటాచలాధిపునిమన్ననగాని వెరసి యిన్నిటి గెలువ వెరవు మఱిలేదు

జవ్వాది మెత్తినది

జవ్వాది మెత్తినది అది తన జవ్వనమే జన్నె వట్టినది

ముద్దుల మాటలది అది చెక్కు టద్దముల కాంతి నలరినది
గద్దరి చూపులది అది తన వొద్ది చెలియమీద నొరగున్నది

పుత్తడి బోలినది అది తన చిత్తము ని సొమ్ము చేసినది
గుత్తపు గుబ్బలది అది అల చిత్తజుని లెక్క సేయనిది

ఎమ్మెలు యెఱుగనిది అది తన కెమ్మోవి జిరునవ్వు గెరలున్నది
కమ్ముకొనగ వెంకటరాయా నీ కమ్మని కౌగిట గలశున్నది

జలజనాభ హరి

జలజనాభ హరి జయ జయ యిల మానేరము లెంచకువయ్యా

బహుముఖముల నీప్రపంచము సహజగుణంబుల చంచలము
మహిమల నీ విది మరి దిగవిడువవు విహరణ జీవులు విడువగ గలరా

పలునటనలయీప్రకృతి యిది తెలియగ గడునింద్రియవశము
కలిసి నీ వందే కాపురము మలినపు జీవులు మానగగలరా

యిరవుగ శ్రీవేంకటేశుడ నీమాయ మరలుచ నీవే సమర్థుడవు
శరణనుటకే నే శక్తుడను పరు లెవ్వరైనా బాపగలరా

జయలక్ష్మి వరలక్ష్మి

జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా

పాలజలనిధిలోని పసనైనమీగడ మేలిమితామరలోని మించువాసన
నీలవర్ణునురముపై నిండిననిధానమవై యేలేవు లోకములు మమ్మేలవమ్మా

చందురుతోడ బుట్టిన సంపదలమెఱుగవో కందువ బ్రహ్మల గాచేకల్పవల్లి
అందినగోవిందునికి అండనే తోడునీడవై వుందానవు మాఇంటనే వుండవమ్మా

పదియారువన్నెలతో బంగారుపతిమ చెదరనివేదములచిగురుబోడి
యెదుట శ్రీవేంకటేశునిల్లాలవై నీవు నిదుల నిలిచేతల్లి నీవారమమ్మా


Download

జయము జయము

జయము జయము ఇక జనులాల భయములు వాసెను బ్రదికితి మిపుడు

ఘన నరసింహుడు కంభమున వెడలె దనుజులు సమసిరి ధరవెలసె
పొనిసె నధర్మము భూభారమడగె మునుల తపము లిమ్ముల నీడేరె

గరిమతో విష్ణుడు గద్దెపై నిలిచె హిరణ్య కశిపుని నేపడచె
అరసి ప్రహ్లాదుని అన్నిటా మన్నించె హరుడును బ్రహ్మయు అదె కొలిచేరు

అహోబలేశుడు సిరి నంకమున ధరించె బహుగతి శుభములు పాటిల్లె
ఇహపరము లొసగె నిందును నందును విహరించెను శ్రీవేంకటగిరిని

జయమంగళము

జయమంగళము నీకు సర్వేశ్వర జయమంగళము నీకుజలజవాసినికి

శరణాగతపారిజాతమా పొరి నసురలపాలిభూతమా
అరుదయిన సృష్టికి నాదిమూలమా వో హరి నమో పరమపుటాలవాలమా

సకలదేవతాచక్రవర్తి వెకలిపై నిండినవిశ్వమూర్తి
అకలంకమైనదయానిధి వికచముఖ నమో విధికివిధి

కొలిచినవారలకొంగుపైడి ములిగినవారికి మొనవాడి
కలిగినశ్రీవెంకటరాయా మలసి దాసులమైనమాకు విధేయా


Download

జయజయ నృసింహ

జయజయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాదవరద

మిహిర శశినయన మృగనరవేష బహిరతస్థల పరిపూర్ణ
అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాదవరద

చటుల పరాక్రమ సమఘనవిరహిత నిటలనేత్ర మౌని ప్రణుత
కుటిలదైత్యతతి కుక్షి విదారణ పటు వజ్రనఖ ప్రహ్లాదవరద

శ్రీ వనితా సంశ్రిత వామాంక బావజకోటి ప్రతిమాన
శ్రీ వేంకటగిరిశిఖరనివాస పవనచరిత ప్రహ్లాదవరద

జయ జయ రామా

జయ జయ రామా సమరవిజయ రామా భయహర నిజభక్తపారీణ రామా

జలధిబంధించిన సౌమిత్రిరామా సెలవిల్లువిరచినసీతారామా
అలసుగ్రీవునేలినాయోధ్యరామా కలిగి యజ్ఞముగాచేకౌసల్యరామా

అరిరావణాంతక ఆదిత్యకులరామా గురుమౌనులను గానేకోదండరామా
ధర నహల్యపాలిటిదశరథరామా హరురాణినుతులలోకాభిరామా

అతిప్రతాపముల మాయామృగాంతక రామా సుతకుశలవప్రియ సుగుణ రామా
వితతమహిమలశ్రీవేంకటాద్రిరామా మతిలోనబాయనిమనువంశరామా

జనులు నమరులు

జనులు నమరులు జయలిడగా ఘనుడదె వుయ్యాలగంభముకాడ

వదలక వలసినవారికి వరములు యెదురెదురై తానిచ్చుచును
నిదురలేక పెనునిధినిధానమై కదల డదే గరుడగంభముకాడ

కోరినవారికి కోరినవరములు వోరంతప్రొద్దు నొసగుచును
చేరువయై కృపసేసీ నిదివో కూరిముల నడిమిగోపురమాడ

వడి వేంకటపతి వరములరాయడు నుడుగు గాళ్ళు గన్నులు సుతుల
బడిబడి నొసగును బ్రాణచారులకు కడిమి నీడదిరుగనిచింతాడ

జడమతిరహం

జడమతిరహం కర్మజంతురేకో౨హం జడధినిలయాయ నమో సారసాక్షాయ

పరమపురుషాయ నిజభక్తజనసులభాయ దురితదూరాయ సింధురహితాయ
నరకాంతకాయ శ్రీనారాయణాయ తే మురహరాయ నమో నమో

నగసముద్ధరణాయ నందగోపసుతాయ జగదంతరాత్మాయ సగుణాయ
మృగనరాంగాయ నిర్మితభవాండాయ పన్నగరాజశయనాయ నమో నమో

దేవదేవేశాయ దివ్యచరితాయ బహు భావనాతీతాయ పరమాయ
శ్రీవేంకటేశాయ జితదైత్యనికరాయ భూవల్లభాయ నమో పూర్ణకామాయ

జగన్మోహనాకార

జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటునాసోదంబు ఇది నీవెలితో నావెలితో

యెన్నిమారులు సేవించిన కన్నులూ తనియవు విన్ననీకథామృతమున వీనులు తనియవు
సన్నిధిని మిమ్ము నుతియించి సరుస జిహ్వయు తనియదు విన్న కన్నది కాదు ఇది నావెలితో నీవెలితో

కడగి నీప్రసాదమే కొని కాయమూ తనియదు బడి ప్రదక్షిణములు సేసి పాదములు నివి తనియవు
నుడివి సాష్టాంగంబు చేసి నుదురునూ తనియదు వెడగుదన మిది గలిగె నిది నావెలితో నీవెలితో

చెలగి నిను నే పూజించి చేతులూ తనియవు చెలువు సింగారంబు తలచి చిత్తమూ తనియదు
అలరి శ్రీ వేంకటగిరీశ్వర ఆత్మ నను మోహించజేసితి వెలయ నిన్నుయు దేరె మును నీవెలితో నావెలితో

జగతి వైశాఖ

జగతి వైశాఖ శుద్ధ చతుర్దశి మందవార మగణితముగ కూడె నదె స్వాతియోగము

పక్కన నుక్కు కంభము పగిలించుక వెడలి తొక్కి హిరణ్యకశిపు తొడికిపట్టి
చక్కగా గడపమీద సంధ్యాకాలమున వక్కలుసేసె నురవడి శ్రీనరసింహుడు

పిప్పిగాగ చప్పరించి పేగులు జందేలు వేసి తొప్పదోగుచు నెత్తురు దోసిట జల్లె
రొప్పుచు కోపముతో తేరుచు పకపక నవ్వి తప్పకచూచె వాని నుదగ్ర నరసింహుడు

ఎదుట ప్రహ్లాదుజూచి ఇందిర తొడపైనుంచె అదన అందరికిని అభయమిచ్చె
కదిసి శ్రీవేంకటాద్రి గద్దెమీద కూచుండె వెదచల్లె కృపయెల్ల వీరనరసింహుడు

జగడపు చనువుల

జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర

మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున
జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే పతిపై చల్లే రతివలు జాజర

భారపు కుచముల పైపై కడు సింగారము నెరపేటి గంధవొడి
చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర

బింకపు కూటమి పెనగేటి చెమటల పంకపు పూతల పరిమళము
వేంకటపతిపై వెలదులు నించేరు సంకుమ దంబుల జాజర