శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Thursday, June 10, 2010

జయము జయము

జయము జయము ఇక జనులాల భయములు వాసెను బ్రదికితి మిపుడు

ఘన నరసింహుడు కంభమున వెడలె దనుజులు సమసిరి ధరవెలసె
పొనిసె నధర్మము భూభారమడగె మునుల తపము లిమ్ముల నీడేరె

గరిమతో విష్ణుడు గద్దెపై నిలిచె హిరణ్య కశిపుని నేపడచె
అరసి ప్రహ్లాదుని అన్నిటా మన్నించె హరుడును బ్రహ్మయు అదె కొలిచేరు

అహోబలేశుడు సిరి నంకమున ధరించె బహుగతి శుభములు పాటిల్లె
ఇహపరము లొసగె నిందును నందును విహరించెను శ్రీవేంకటగిరిని

No comments:

Post a Comment