శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

Sunday, August 8, 2010

నవ్వు వచ్చీ

నవ్వు వచ్చీ నిన్ను జూచి నాకు నేడు యీ రవ్వలు నీకేచెల్లు రాజసపు దేవుడా

సతికుచముల మోవ సాము జేసినటు వలె సతముగా మోచేవు శంఖ చక్రములు
మతకాన వేడుకొనే మార్గమున నున్నట్లు తతి నభయహస్తము తప్పవు నీవిపుడు

కామిని నలిమిపట్టే గతి యలవాటుగా యేమరపు కటిహస్త మెంతైనా నీవు
నేమాననామెరాక నిక్కిచూచే మతకాన కోమలపు నీకునిల్వు కొలువులే యిపుడు

అంకె వుపరి సురత మలవాటు చెడకుండా ఉంకువ శ్రీసతి మోచే పురమున
అంకి శ్రీవేంకటాద్రి నంది మమ్ముగాచేటి పొంకపు మన్ననల చూపులు జల్లేవిదిగో 

నటుమమతావ

నటుమమతావ న్మానస్త్వదీయ నితాంతహితసరణింనమామి

నవదతు భవాన్ జనార్ధన ఘనరతి వివాదవచనం వృధా వృధా
తవమృదు వేదసుధామయవచనై ర్వివిధావశ పదవీం వహామి

న భజతుమాం కరుణానిధే భవ ద్విభవ వినయశ్చ వృధా వృధా
త్రిభువన సుఖకర దివ్యరూపతే ప్రభుతయా పరాభవం భజామి

నచలతు వేంకట నాధమాంవినా విచరణమపితే వృధా వృధా
సుచరిత్రస్త్యం సుభగస్త్యం త్వాం కుచయో పులకాం కురైర్థమామి

Sunday, July 11, 2010

నేల మిన్ను

నేల మిన్ను నొక్కటైననీబంటు వొక్క వేలనే యక్షుని దెగవేసెగా నీబంటు

ఉంగర మెగరవేసి యుదధిలో బడకుండ నింగికి జెయిజాచి నీబంటు
చంగున జలధిదాటి జంబుమాలి నిలమీద కుంగదొక్కి పదముల గుమ్మెగా నీబంటు

వెట్టగా రావణు రొమ్మువిరుగ జేతనే గుద్దె నిట్టతాడువంటివాడు నీబంటు
దిట్టయై మందులకొండ తేజమున నడురేయి పట్టపగలు దెచ్చె బాపురే నీబంటు

అలరనన్నియు జేసి అజునిపట్టానకు నిలుచున్నాడదివో నీబంటు
బలువేంకటేశ ఈ పవననందనుడు కలిగి లోకములెల్ల గాచెగా నీబంటు

నేర్పుకంటె

నేర్పుకంటె బెన్నిధి గద్దా ఓర్పుకంటె సుఖమొకటి గద్దా

కరుణకు నెక్కుడు గతి యిక గద్దా సరసత కెక్కుడు సరిగద్దా
గురుమతి జిత్తము కూరిమి నిలిపిన నెరవుకంటె విధమిక గద్దా

కలిమికంటె జీకటి మరి కద్దా బలిమి కంటె నాపద గద్దా
గెలుపు దెలెసి లంకించిన మతితో జెలగుకంటె నిజనీతి యిక గద్దా

పాయము కంటె నపాయము గద్దా కాయపు రోతకు గడ గద్దా
పాయక వేంకట పతికృప గోరిన యీ యభిమతమున కెదురిక గద్దా

నేరుపరి ననుకోను

నేరుపరి ననుకోను నెరజాణ ననుకోను యీరీతి నాహావ భావాలింతెఱగడా

మలసి తనతో నేను మాటలాడనని దూరి నెలవుల నవ్వితేనే సేన మాటలే
పిలిపించనని తాను బిగువులు నెరపీని తలుపు దెరచితేనే తగుసన్న గాదా

దగ్గర గూచుండనంటా తమకించి నంతలోనె సిగ్గువడి వుండితేనే చేరి వుండుటే
వొగ్గి తన్ను జూడనంటా వొరట్లు వట్టీని అగ్గమై యెదుట నుంటే అన్నియును గాదా

ముందు కౌగిలించనంటూ మొనలెల్ల జూపీని ఇందమని విడేమిచ్చుటదియే అది
అందపు శ్రీ వేంకటేశుడలమేలుమంగ నేను పొందితిమిద్దరమివి పోదులెల్లా గావా

నేరిచిబ్రదికేవారు

నేరిచిబ్రదికేవారు నీదాసులు నేరమి బాసినవారు నీదాసులు

కామము గ్రోధము రెంటీ గాదని విడిచి మంచి నేమము పట్టినవారే నీదాసులు
దోమటి బాపపుణ్యాల దుంచివేసి చూడగానే నీమాయ గెలిచినవారు నీదాసులు

కిక్కిరించినయాసల గిందవేసి మోక్షము నిక్కినిక్కి చూచేవారు నీదాసులు
వెక్కసపుభక్తితోడ వెఱపు మఱపు లేక నెక్కొన్నమహిమవారు నీదాసులు

అట్టె వేదశాస్త్రముల అర్థము దేటపఱచి నెట్టుకొని మించినవారు నీదాసులు
యిట్టె శ్రీవేంకటేశ యితరమార్గములెల్లా నెట్టువడ దోసినవారు నీదాసులు

నేనే బ్రహ్మము

నేనే బ్రహ్మము కోనేరము నేము కామించిన స్వతంత్రము గడు లేదుగాన

క్షణములోపలనె సర్వజీవావస్థలూను గణుతించేవా డొకడు గలడు వేరే
అణుమహత్త్వములందు నంతర్యామైనవాని ప్రణుతించి దాసులమై బ్రదికేముగాని

పనిగొని యేలుటకు బ్రహ్మాదిదేవతల గనిపించేవా డోకడు గలడు వేరే
ననిచి సిరుల లక్ష్మీనాథుడైనవాని అనులవారము నేము బ్రదికేముగాని

సతతరక్షకుడయి శంఖచక్రధరుడయి గతి శ్రీవేంకటపతి గలడు వేరే
అతనిమఱగు చొచ్చి యానందపరవశాన బ్రతిలేక యిందరిలో బ్రదికేము గాని

నేనెందువోయె

నేనెందువోయె తానెందువోయీ రానీలే రానీలే రానీలే
మీనైన నాటి తన మిడుకెల్ల దిగవలె కానీలె కానీలె కానీలె

తలచూపేనాటి తలపెల్ల దిగవలె తలచనీ తలచనీ తలచనీవే
కిరికియైననాటి తన కిటుకెల్లదిగవలె తిరుగనీ తిరుగనీ తిరుగనీవే

హరియైననాటి అదటెల్ల దిగవలె జరగనీ జరగనీ జరగనీవే
వడుగైననాటి వస విడువంగవలె తడవకు తడవకు తడవకువే

కలుషించే నాటి కడమెల్ల దిగవలె అలుగనీ అలుగనీ అలుగనీవే
సతిబాసేనాటి చలమెల్ల దిగవలె తతిగానీ తతిగానీ తతిగానీలే

ముసలైన నాటి ముసుపెల్ల దిగవలె విసుగనీ విసుగనీ విసుగనీవే
మానైననాటి మదమెల్ల దిగవలె పోనీవే పోనీవే పోనీవే

కలికైన నాటి గజరెల్ల దిగవలె చెలగనీ చెలగనీ చెలగనీవే
వేడుకతో నాటి వేంకటపతి నన్ను కూడనీ కూడనీ కూడనీవే

నేనెంతవాడను

నేనెంతవాడను నిన్నడిగి నంటే వీనుల నీకథలెల్లా వినుటేగా

అలిగిన అలుగక అన్యులు మరిదూరి పలికినను మారు పలుకక వాదు
తలచిన కలుగకసరి కొట్టినను గాని మూలుగనివాడే గదా ముక్తికి నర్హుడు

నగినను తానగక నాతులెవ్వరైన తగిలి పెసగిన తగులక
వగచినా వగవక వ్రతము చేరిచె మంటే మొగమోడకున్నవాడే ముక్తికి నర్హుడు

విరిచినా విరువక విష్ణుభక్తియె దాటున వెరపించిన మరి వెడవక
నెరవై శ్రీ వేంకటేశ నీ పాదములె నమ్మి మెరుగు లేనివాడె ముక్తికి నర్హుడు

నేనెంత నీవెంత

నేనెంత నీవెంత నిక్కె మా యిది కానీ లేరా యిది యొక్క కాకు నేనే జాడలా

కోరివేడి తగిలిన గోపసతు లుండ గాను అరయ నాకొంగు పట్టే వలసితినా
మేరతో బెండ్లాడిన రుక్మిణిదేవి వుండగాను యేరా నాతో నవ్వేవు యెగసక్కెమా

చనవిచ్చి మన్నించిన సత్యభామ వుండగాను చెనకేవు నే నీకు జిక్కితినా
పనివడి తెచ్చుకొన్న పదారువేలుండగాను నను జెక్కు నొక్కేవు నాటకములా

గందమిచ్చి మెప్పించిన కలికి యొకతె యుండ అంది నను గాగిలించే వాగడములా
కందున శ్రీ వేంకటేశ కలసితి విటు నన్ను చిందేవు మోహము నాపై చిత్తమింత వచ్చెనా

నేనెంత చిన్ననైనా

నేనెంత చిన్ననైనా నీకే సులభము గాని పూని నా సరివారికి బొడవే సుమ్మీ

యిచ్చకపు పతివి నీవేమన్నా నితవే నాకు కొచ్చికొచ్చి తిట్టినాను కోపమున్నదా
తెచ్చుకొన్న నీసతులు తేనె మాటాడినాను మచ్చరములై పెరిగి మర్మములు నాటురా

నీటున బ్రాణవిభుడ నీవేమి సేసినా వాటమై మొక్కుదు గాక వాసి వట్టేనా
పాతకపు సవతులు నయగారాలు సేసినా యీటెల పోట్లే కాక యింతకోపేనా

చేరినిన్ను నేలినట్టి శ్రీ వేంకటేశ నీవు యేరీతి నుండినాను యెరవున్నదా
సారెకు నీవు ముట్టిన సవతులు వద్దనున్నా నీరసమె రేగు గాని యీయకోలు గాదురా

నేడు దప్పించుకొంటేను

నేడు దప్పించుకొంటేను నేరుపున్నదా పేడుక భోగించుతానే పెనగ జోటున్నదా

తనువు మోచిననాడే తప్పులెల్లా జేసితిని వెనక మంచితనాలు వెదక నేది
ననిచి సంసారినైననాడే నిష్టూరానకెల్ల మునుప నే గురియైతి మొరగ జోటున్నదా

సిరులు చేకొన్ననాడే సిలుగెల్లా గట్టుకొంటి తరగాతిపను లింక దడవనేల
నరలోకముచొచ్చిననాడే పుణ్యపాపముల పొరుగుకు వచ్చితిని బుద్దు లింక నేల

వూపిరిమోచిననాడే వొట్టికొంటి నాసలెల్లా మాపుదాకా వేసరిన మాన బొయ్యీనా
యేపున శ్రీవేంకటేశుడింతలో నన్ను గావగా పైపై గెలిచితిగాక పంతమాడగలనా

నే నొక్కడ

నే నొక్కడ లేకుండితే నీకృపకు బాత్ర మేది పూని నావల్లనే కీర్తి బొందేవు నీవు

అతి మూడులలోన నగ్రేసరుడ నేను ప్రతిలేనిఘనగర్వపర్వతమను
తతి బంచేంద్రియములధనవంతుడను నేను వెతకి నావంటివాని విడువగ జెల్లునా

మహిలో సంసారపు సామ్రాజ్యమేలేవాడ నేను యిహమున గర్మవహికెక్కితి నేను
బహుయోనికూపసంపద దేలేవాడ నేను వహించుక నావంటివాని దేనోపేవా

భావించి నావంటినీచు బట్టి కాచినప్పుడుగా యేవంక నీకీర్తి గడువెంతురు భువి
నావల్ల నీకు బుణ్యము నీవల్లనే బ్రదుకుదు శ్రీవేంకటేశుడ యింత చేరె జుమ్మీ మేలు

నే నేమిసేయుదును

నే నేమిసేయుదును నీవు నాలోపలనుండి శ్రీనాథుడవు నీచేత ఇంతేకాక

తనువేమిసేయును తనువులోపలయున్న చెనటియింద్రియములచేతలుగాక
మనసేమిసేయును మనసులోపలనున్న నినుపుగోర్కులు చేసేనేరములుగాక

జీవుడేమిసేయును జీవునిబొదుగుకున్న భావపు ప్రకృతి చేసేపాపముగాక
చేవదేర బుట్టు వేమిసేయు ముంచుకొన్నట్టి దైవపుమాయలోనిధర్మ మింతేకాక

కాలమేమిసేయును గక్కన శ్రీవేంకటేశు డేలి మన్నించేమన్నన యిదియేకాక
యేల యేల దూర నింక నెవ్వరు నేమిసేతురు మేలిమి నిను దలచి మెచ్చుటేకాక

నే ననగా నెంతవాడ

నే ననగా నెంతవాడ నెయ్యపుజీవులలోన యీనెపాన రక్షించీ నీశ్వరుడేకాక

యెవ్వరు బుద్దిచెప్పిరి యిలపై జీమలకెల్లా నెవ్వగ బుట్టల గొల్చు నించుకొమ్మని
అవ్వల సంసారభ్రాంతి అనాదినుండియు లోలో దవ్వించి తలకెత్తేయంతర్యామేకాని

చెట్టుల కెవ్వరు బుద్దిచెప్పేరు తతికాలాన బుట్టి కాచి పూచి నిండా బొదలుమని
గుట్టుతో జైతన్యమై గుణములన్నిటికిని తిట్టపెట్టి రచించినదేవు డింతేకాక

బుద్దు లెవ్వరు చెప్పిరి పుట్టినట్టిమెకాలకు తిద్ది చన్ను దాగి పూరి దినుమని
పొద్దువొద్దు లోన నుండి భోగములు మఱపిన నిద్దపు శ్రీవేంకటాద్రినిలయుండేకాక

Tuesday, June 29, 2010

నెలమూడు శోభనాలు

నెలమూడు శోభనాలు నీకు నతనికిదగు కలకాలమును నిచ్చకల్యాణమమ్మా

రామనామమతనిది రామవు నీవైతేను చామన వర్ణమతడు చామవు నీవు
వామనుడందురతని వామనయనవు నీవు ప్రేమపుమీ యిద్దరికి పేరుబలమొకటే

హరి పేరాతనికి హరిణేక్షణవు నీవు కరిగాచెదాను నీవు కరియానవు
సరి జలధిశాయి జలధికన్యవు నీవు బెరసి మీయిద్దరికి బేరుబలమొకటే

జలజ నాభుడతడు జలజముఖివి నీవు అలమేలుమంగవు నిన్నెలమెదాను
ఇలలో శ్రీవేంకటేశుడిటు నిన్నురానమోచె పిలిచి పేరుచెప్పెబేరుబలమొకటే

నెలత చక్కదనమే

నెలత చక్కదనమే నిండు బండారము నీకు గలిగె గనకలక్ష్మీ కాంతుడవైతివి

పడతి నెమ్మోమునకు బంగారు కళలుదేరీ వెడలే సెలవి నవ్వే వెండిగనులు
అడియాలమగు మోవినదె పగడపుదీగె నిడువాలుదనమే నీలముల రాశి

తరుణి పాదపు గోళ్ళు తళుకుల వజ్రములు పరగు జేతిగోళ్ళె పద్మరాగాలు
అంది కన్నుల తేటలాణి ముత్తెపు సరులు సరి బచ్చల కొండలు చనుమొనలు

చెలితేనె మాటలు జిగి బుష్యరాగాలు వలపు తెరసిగ్గులు వైడూర్యాలు
తొలకు ననురాగాలే దొడ్డ గోమేధికాలు కలసితీకెను శ్రీవేంకటేశు కౌగిటను

నెరవాది సాహసులు

నెరవాది సాహసులు నిత్యశూరులు దురిత విదూరులు ధృవాదులు

తక్కక శ్రీహరిభక్తితపాలుసేసి యెక్కిరి చక్కగా వైకుంఠము సనకాదులు
వొక్కట విష్ణుకథలు వోడసేసుక దాటిరి పెక్కు సంసారజలధి భీష్మాదులు

కడువిరక్తి యనేటి కత్తులనే నరకిరి నడుమ భవపాశముల నారదాదులు
బడినే హరిదాసులపౌజులు గూడుకొనిరి నుడివడ కిహమందే శుకాదులు

పరమశాంతములనే పట్టపేనుగులమీద వరుసల నేగేరు వ్యాసాదులు
సిరుల శ్రీవేంకటేశు జేరి సుఖము బొందిరి బెరసి దాస్యమున విభీషణాదులు
నెయ్యములలో నేరెళ్ళో వొయ్యన వూరెడి వువ్విళ్ళో

పలచని చెమటల బాహుమూలముల చెలములలోనా జెలువములే
ధళధళమను ముత్యపు జెరగు సురటి దులిపేటి నీళ్ళ తుంపిళ్ళో

తొటతొత గన్నుల దొరిగేటినీళ్ళ చిటిపొటి యలుకలు చిరునగవే
వట ఫలంబు నీ వన్నెల మోవికి గుటుకల లోనా గుక్కిళ్ళో

గరిగరికల వేంకటపతి కౌగిట పరిమళములలో బచ్చనలు
మరునివింటి కమ్మనియంప విరుల గురితాకులినుప గుగ్గిళ్ళో

నెయ్యని పోసుకోరాదు

నెయ్యని పోసుకోరాదు నీళ్ళని చల్లగరాదు చెయ్యార గంటిమి నేడు చేరి నీతో పొందుట

 ప్రేమము చాలాజేసి పెక్కు సతులతోను మోము చూడ సిగ్గుపడి ముసుగుతో నున్నదాన
జామువోయి వచ్చినీవు సరసములాడేవు యేమని నేనియ్యకుందు నేటిజన్మమయ్య

పలుమారు నీతోనవ్వి పరాకై వుండిన నీతో పలుకగ సిగ్గుపడి భావింపుచు నున్నదాన
కలగన్నట్లా వచ్చి కందువలంటేవు నన్ను బలిమి యేమున్నది నాబదుకు నీ చేతిది

మచ్చికతో నిన్నుగూడి మన్నించిన నీతోను పచ్చిసేయ సిగ్గుపడి వదరక వున్నదాన
యెచ్చుగా శ్రీ వేంకటేశ యిట్టెనన్ను నేలితివి విచ్చన విడాయ నా విభవము లెల్లను