శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, July 11, 2010

నే ననగా నెంతవాడ

నే ననగా నెంతవాడ నెయ్యపుజీవులలోన యీనెపాన రక్షించీ నీశ్వరుడేకాక

యెవ్వరు బుద్దిచెప్పిరి యిలపై జీమలకెల్లా నెవ్వగ బుట్టల గొల్చు నించుకొమ్మని
అవ్వల సంసారభ్రాంతి అనాదినుండియు లోలో దవ్వించి తలకెత్తేయంతర్యామేకాని

చెట్టుల కెవ్వరు బుద్దిచెప్పేరు తతికాలాన బుట్టి కాచి పూచి నిండా బొదలుమని
గుట్టుతో జైతన్యమై గుణములన్నిటికిని తిట్టపెట్టి రచించినదేవు డింతేకాక

బుద్దు లెవ్వరు చెప్పిరి పుట్టినట్టిమెకాలకు తిద్ది చన్ను దాగి పూరి దినుమని
పొద్దువొద్దు లోన నుండి భోగములు మఱపిన నిద్దపు శ్రీవేంకటాద్రినిలయుండేకాక

No comments:

Post a Comment