శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Tuesday, June 29, 2010

నెలమూడు శోభనాలు

నెలమూడు శోభనాలు నీకు నతనికిదగు కలకాలమును నిచ్చకల్యాణమమ్మా

రామనామమతనిది రామవు నీవైతేను చామన వర్ణమతడు చామవు నీవు
వామనుడందురతని వామనయనవు నీవు ప్రేమపుమీ యిద్దరికి పేరుబలమొకటే

హరి పేరాతనికి హరిణేక్షణవు నీవు కరిగాచెదాను నీవు కరియానవు
సరి జలధిశాయి జలధికన్యవు నీవు బెరసి మీయిద్దరికి బేరుబలమొకటే

జలజ నాభుడతడు జలజముఖివి నీవు అలమేలుమంగవు నిన్నెలమెదాను
ఇలలో శ్రీవేంకటేశుడిటు నిన్నురానమోచె పిలిచి పేరుచెప్పెబేరుబలమొకటే

No comments:

Post a Comment