శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Tuesday, June 29, 2010

నెలత చక్కదనమే

నెలత చక్కదనమే నిండు బండారము నీకు గలిగె గనకలక్ష్మీ కాంతుడవైతివి

పడతి నెమ్మోమునకు బంగారు కళలుదేరీ వెడలే సెలవి నవ్వే వెండిగనులు
అడియాలమగు మోవినదె పగడపుదీగె నిడువాలుదనమే నీలముల రాశి

తరుణి పాదపు గోళ్ళు తళుకుల వజ్రములు పరగు జేతిగోళ్ళె పద్మరాగాలు
అంది కన్నుల తేటలాణి ముత్తెపు సరులు సరి బచ్చల కొండలు చనుమొనలు

చెలితేనె మాటలు జిగి బుష్యరాగాలు వలపు తెరసిగ్గులు వైడూర్యాలు
తొలకు ననురాగాలే దొడ్డ గోమేధికాలు కలసితీకెను శ్రీవేంకటేశు కౌగిటను

No comments:

Post a Comment