శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Tuesday, June 29, 2010

నెరవాది సాహసులు

నెరవాది సాహసులు నిత్యశూరులు దురిత విదూరులు ధృవాదులు

తక్కక శ్రీహరిభక్తితపాలుసేసి యెక్కిరి చక్కగా వైకుంఠము సనకాదులు
వొక్కట విష్ణుకథలు వోడసేసుక దాటిరి పెక్కు సంసారజలధి భీష్మాదులు

కడువిరక్తి యనేటి కత్తులనే నరకిరి నడుమ భవపాశముల నారదాదులు
బడినే హరిదాసులపౌజులు గూడుకొనిరి నుడివడ కిహమందే శుకాదులు

పరమశాంతములనే పట్టపేనుగులమీద వరుసల నేగేరు వ్యాసాదులు
సిరుల శ్రీవేంకటేశు జేరి సుఖము బొందిరి బెరసి దాస్యమున విభీషణాదులు

No comments:

Post a Comment