ఔనయ్య జాణడువు ప్రహ్లాద వరద ఆసలు వెట్టకుము ప్రహ్లాదవరద
వేసరక శ్రీసతితో వేడుక నవ్వులు నవ్వి ఆసలు చూపేవు ప్రహ్లాద వరద
సేస వెట్టిన చేతుల చెరగు వట్టి తిసేవు ఆ సుద్దులె చెప్పేను ప్రహ్లాద వరద
నంటున తొడమీదను నలినాక్షి నెక్కించుక అంటేవు సిగ్గులు ప్రహ్లాదవరద
గెంటుక ఏ పొద్దును కేలుకేలు కీలించుక అంటువాయ వదివో ప్రహ్లాద వరద
కందువతో కాగిలించి కైవసము సేసుకొంటి వందముగ నీకెను ప్రహ్లాద వరద
పొంది శ్రీవేంకటమున పొంచి ఔభళములోన అంది వరాలిచ్చేవు ప్రహ్లాద వరద