శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

Monday, June 7, 2010

గోవిందాశ్రిత గోకులబౄందా

గోవిందాశ్రిత గోకులబౄందా పావన జయజయ పరమానంద

జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ
గగనశ్యామ ఘనరిపు భీమ అగణిత రఘువంశాంబుధి సోమ

జననుత చరణా శరణ్యు శరణా దనుజ హరణ లలిత స్వరణా
అనఘ చరణాయత భూభరణా దినకర సన్నిభ దివ్యాభరణా

గరుడ తురంగాకారోత్తుంగా శరధి భంగా ఫణి శయనాంగా
కరుణాపాంగా కమల సంగా వర శ్రీ వేంకట గిరిపతి రంగా


Download

గోవిందాది నామోచ్ఛారణ

గోవిందాది నామోచ్ఛారణ కొల్లలు దొరకెను మనకిపుడు ఆవలనీవల నోరగుమ్మలుగ నాడుద మీతని పాడుదము

సత్యము సత్యము సకలసురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు
ప్రత్యక్షమిదే ప్రాణులలోపల అత్యంతము శరణనరో యితని

చాటెడి చాటెడి సకలవేదములు పాటించినహరి పరమమని
కూటస్ఠుడితడు గోపవధూపతి కోటికి యీతని గొలువరో జనులు

నిలుచున్నాడిదె నేడును నెదుటను కలిగిన శ్రీవేంకటవిభుడు
వలసినవారికి వరదుండీతదు కలడు గలడితనిగని మనరో

గోవింద నందనందన

గోవింద నందనందన గోపాలక్రుశ్ణ నీ భావము మాకుంజిక్కె గోపాలక్రుశ్ణ

కొంగువట్టినదేమోయి గోపాలక్రుశ్ణ మా వంగెన కోవుదువా గోపాలక్రుశ్ణ
దొంగతనాల నవ్వేవు గోపాలక్రుశ్ణ బంగారు కాళితోడి గోపాలక్రుశ్ణ

కొమ్మల చీరలంటిన గోపాలక్రుశ్ణ పమ్మి నిన్నుం దిట్టేము గోపాలక్రుశ్ణ
కుమ్మరించేవేల సిగ్గు గోపాలక్రుశ్ణ బమ్మెర పోతిందుల గోపాలక్రుశ్ణ

గెలిచితి భవములు

గెలిచితి భవములు గెలిచితి లోకము యెలమి నీదాసుల కెదురింక నేది

జయ జయ నరసింహా జయ పుండరీకాక్ష జయ జయ మురహర జయ ముకుంద
భయహరణము మాకు పాపనాశనము క్రియతోడి నీ సంకీర్తన గలిగె

నమో నమో దేవ నమో నాగపర్యంక నమో వేదమూర్తి నారాయణా
తిమిరి మమ్ము గావగ దిక్కయి మాకు నిలువ జమళీభుజముల శంకుజక్రములు గలిగె

రక్ష రక్ష పరమాత్మ రక్ష శ్రీవేంకటపతి రక్ష రక్ష కమలారమణ పతి
అక్షయసుఖ మియ్యగల వటు దాపుదండగా పక్షి వాహనుడ నీ భక్తి మాకు గలిగె

గుఱ్ఱాల గట్టనితేరు

గుఱ్ఱాల గట్టనితేరు కొంక కెందైనా బారీ విఱ్ఱవీగుచు దీసీని వేడుకతో జీవుడు

సరి పిఱుదే రెండు జంటబండికండ్లు సరవితో బాదాలు చాపునొగలు
గరిమ జూపులు రెండు గట్టిన పగ్గములు దొరయై దేహరథము దోలీబో జీవుడు

పంచభూతములు పంచవన్నెకోకలు పంచల చేతులు రెండు బలుటెక్కేలు
మించైన శిరసే మీదనున్న శిఖరము పంచేంద్రియ రథము పఱపీబో జీవుడు

పాపపుణ్యములు రెండు పక్కనున్న చీలలు తోపులయన్నపానాలు దొబ్బుదెడ్లు
యేపున శ్రీవేంకటేశు డెక్కి వీధుల నేగగ కాపాడిన రథము గడపీబో జీవుడు

గుఱుతెఱిగిన

గుఱుతెఱిగిన దొంగ కూగూగు వీడెగుఱిలోనె దాగీనీ కూగూగు

నెలతల దోచీనీ నీళ్ళాడగానే కొలని దరిని దొంగ కూగూగు
బలువైన వుట్ల పాలారగించీనీ కొలది మీఱిన దొంగ కూగూగు

చల్లలమ్మగ చనుకట్టు దొడకీని గొల్లెతలను దొంగ కూగూగు
యిల్లిల్లు దప్పక ఇందరి పాలిండ్లు కొల్లలాడిన దొంగ కూగూగు

తావుకొన్న దొంగ దగిలి పట్టుడిదె గోవులలో దొంగ కూగూగు
శ్రీ వేంకటగిరి చెలువుడో యేమో కోవుదుడగు దొంగ కూగూగు


Download

గాలినే పోయ

గాలినే పోయ గలకాలము తాలిమికి గొంతయు బొద్దులేదు

అడుసు చొరనే పట్టె నటునిటు గాళ్ళు గుడుగుకొననే పట్టె గలకాలము
ఒడలికి జీవుని కొడయడైనహరి దడవగా గొంతయు బొద్దులేదు

కలచి చిందనే పట్టె గడవగ నించగ బట్టె కలుషదేహపుబాధ గలకాలము
తలపోసి తనపాలి దైవమైన హరి దలచగా గొంతయు బొద్దులేదు

శిరము ముడువబట్టె చిక్కుదియ్యగ బట్టె గరిమల గపటాల గలకాలము
తిరువేంకటగిరి దేవుడైనహరి దరిచేరా గొంతయు బొద్దులేదు

గరుడాద్రి వేదాద్రి

గరుడాద్రి వేదాద్రి కలిమి ఈపె సిరులొసగీ చూడరో చింతామణి ఈపె

పాలజలధిపుట్టిన పద్మాలయ ఈపె లాలిత శ్రీనారసింహ లక్ష్మి ఈపె
మేలిమి లోకమాతయై మించిన మగువ ఈపె ఈలీలా లోకములేలే ఇందిర ఈపె

ఘనసంపదలొసగు కమలాకాంత ఈపె మనసిజుగనిన రమాపతి ఈపె
అనిశము పాయని మహాహరిప్రియ ఈపె ధనధాన్యరూపపు శ్రీతరుణి ఈపె

రచ్చల వెలసినట్టి రమావనిత ఈపె మచ్చికగల అలమేల్మంగ ఈపె
ఇచ్చట వేంకటాద్రి నీ అహోబలమునందు నిచ్చలూ తావుకొనిన నిధానము ఈపె

గరుడధ్వజం

గరుడధ్వజం బెక్కె కమలాక్షు పెండ్లికి పరుష లదివో వచ్చె బైపై సేవించను

పాడిరి సోబాన నదే భారతియు గిరిజయు ఆడిరి రంబాదులైనఅచ్చరలెల్ల
కూడిరి దేవతలెల్ల గుంపులై శ్రీవేంకటాద్రి వేడుకలు మీరగ శ్రీవిభునిపెండ్లికిని

కురిసె బువ్వులవాన కుప్పలై యెందు చూచిన మొరసె దేవదుందుభిమోతలెల్లను
బెరసె సంపదలెల్ల పెంటలై శ్రీవేంకటాద్రి తిరమైమించిన దేవదేవుని పెండ్లికిని

వేసిరి కానుకలెల్ల వేవేలు కొప్పెరలు పోసి రదే తలబాలు పుణ్యసతులు
ఆసల శ్రీవేంకటేశుడలమేలుమంగదాను సేసలు వెట్టినయట్టిసింగారపు పెండ్లికి

గరుడ గమన

గరుడ గమన గరుడధ్వజ నరహరి నమోనమో నమో

కమలాపతి కమలనాభా కమలజ జన్మకారణిక
కమలనయన కమలాప్తకుల నమోనమో హరి నమో నమో

జలధి బంధన జలధిశయన జలనిధి మధ్య జంతుకల
జలధిజామాత జలధిగంభీర హలధర నమో హరి నమో

ఘనదివ్యరూప ఘనమహిమాంక ఘనఘనా ఘనకాయ వర్ణ
అనఘ శ్రీవేంకటాధిపతేహం నమో నమోహరి నమో నమో

గద్దరి జీవుడు

గద్దరి జీవుడు కామధేనువు మాని యెద్దు బిదుక జొచ్చె నేది దెరగు

మట మాయముల దనమనసె చంచలమంది ఇటినటు దిరిగిన నేది దెరగు
కట కట వూరేలు కర్తే దొంగలగూడి యెటువలె జేసిన నేది దెరగు

కల్లలాడగ జొచ్చె గలుషపు మతి సత్య మిల్లు వెడలగొట్టె నేది దెరగు
చెల్లబో నోరే చేదు మేయగ జొచ్చె నెల్లవారికి నింకనేది దెరగు

తియ్యని వేంకటాధిపు బాసి పరసేవ కియ్య కొనెడి జిత్తమేది దెరగు
అయ్యొ చక్కని బతినాలు విడిచిపోయి యెయ్యెడ దిరిగిన నేది దెరగు

గతులన్ని ఖిలమైన

గతులన్ని ఖిలమైన కలియుగమందును గతి ఈతడే చూపె ఘన గురుదైవము

ఈతని కరుణనేకా ఇలవైష్ణవుల మైతి మీతని వల్లనే కంటి మీ తిరుమణి
ఈతడే ఉపదేశమిచ్చెను అష్టాక్షరి మంత్రము ఈతడే రామానుజులు ఇహపర దైవము

వెలయించె నీతడేకా వేదపు రహస్యములు చలిమి నీతడే చూపె శరణాగతి
నిలిపినాడీతడే కా నిజముద్రా ధారణము మలసి రామానుజులు మాటలాడే దైవము

నియమములు ఈతడేకా నిలిపె ప్రపన్నులకు దయతో మోక్షము చూపె తగనీతడు
నయమై శ్రీవేంకటేశు నగమెక్కె వాకిటను దయచూచి మమ్మునిట్టే తల్లిదండ్రి

గడ్డపార మింగితే

గడ్డపార మింగితే నాకలి దీరీనా యీ వొడ్డినభవము దన్నువొడ కమ్ముగాక

చించుక మిన్నులబారే చింకలను బండిగట్టి వంచుకొనేమన్న నవి వసమయ్యీనా
యెంచరాని యింద్రియము లెవ్వరికి నేల చిక్కు పొంచి పొంచి వలపుల బొండబెట్టుగాక

మంటమండేయగ్గి దెచ్చి మసిపాత మూటగట్టి యింటిలోపల దాచుకొన్న నితవయ్యీనా
దంటమమకార మిట్టే తన్నునేల సాగనిచ్చు బంటుజేసి ఆసలనే పారదోసుగాక

పట్టరాని విషములపాము దెచ్చి తలకింద బెట్టుకొన్నా నది మందపిలి వుండీనా
వెట్టసంసారమిది వేంకటేశు గొలువని వట్టిమనుజుల పెడవాడ బెట్టుగాక

గంధము పూసేవేలే

గంధము పూసేవేలే కమ్మని మేనయీ గంధము నీ మేనితావి కంటి నెక్కుడా

అద్దము చూచే వేలే అప్పటికిని అద్దము నీ మోముకంటె నపురూపమా
ఒద్దిక తామర విరి నొత్తేవు కన్నులు నీ గద్దరి కన్నుల కంటె కమలము ఘనమా

బంగారు పెట్టేవేలే పడతి నీమెయినిండా బంగారు నీతనుకాంతి ప్రతివచ్చీనా
ఉంగరాలేటికి నే వొడికపు వేళ్ళ వెంగలి మణుల నీ వేలిగోరబోలునా

సవర మేటికినే జడియు నీనెరులకు సవరము నీకొప్పుసరి వచ్చీనా
యివలజవులు నీకు నేలే వేంకటపతి సవరని కెమ్మోవి చవికెంటేనా