గతులన్ని ఖిలమైన కలియుగమందును గతి ఈతడే చూపె ఘన గురుదైవము
ఈతని కరుణనేకా ఇలవైష్ణవుల మైతి మీతని వల్లనే కంటి మీ తిరుమణి
ఈతడే ఉపదేశమిచ్చెను అష్టాక్షరి మంత్రము ఈతడే రామానుజులు ఇహపర దైవము
వెలయించె నీతడేకా వేదపు రహస్యములు చలిమి నీతడే చూపె శరణాగతి
నిలిపినాడీతడే కా నిజముద్రా ధారణము మలసి రామానుజులు మాటలాడే దైవము
నియమములు ఈతడేకా నిలిపె ప్రపన్నులకు దయతో మోక్షము చూపె తగనీతడు
నయమై శ్రీవేంకటేశు నగమెక్కె వాకిటను దయచూచి మమ్మునిట్టే తల్లిదండ్రి
No comments:
Post a Comment