ఓహో డేండేం వొగి బ్రహ్మ మిదియని సాహసమున శ్రుతి దాటెడిని
పరమున నరము బ్రకృతియు ననగా వెరవుదెలియుటే వివేకము
పరము దేవుడును అపరము జీవుడు తిరమైన ప్రకృతియె దేహము
జ్ఞానము జ్ఞేయము జ్ఞానగమ్యమును పూని తెలియుటే యోగము
జ్ఞానము దేహాత్మ జ్ఞేయము పరమాత్మ జ్ఞానగమ్యమే సాధించుమనసు
క్షరము నక్షరమును సాక్షి పురుషుడని సరవి దెలియుటే సాత్వికము
క్షరము ప్రపంచ మక్షరము కూటస్థుడు సిరిపురుషోత్తముడే శ్రీ వేంకటేశుడు
Showing posts with label ఓ. Show all posts

Saturday, June 5, 2010
ఓరుపే నేరుపు
ఓరుపే నేరుపు సుమ్మీ వువిదలకు మారుకోకు మగవాని మనసు మెత్తనిది
చలము సంపాదించవద్దు చనవే మెఱయవే చెలువుడాతడే నీచేత జిక్కీని
బలములు చూపవద్దు పకపక నగవే అలరిన జాణతనమందులోనే వున్నది
పగలు చాటగవద్దు పైకొని మెలగవే సొగసి ఆతడే నీ సొమ్మై వుండీనీ
తగవుల బెట్టవద్దు తమకము చూపవే అగపడ్డ నీ పంతములందులోనే వున్నవి
మొక్కల మేమియు నొద్దు మోహములు చల్లవే నిక్కి శ్రీ వేంకటేశుడు నిన్ను గూడెను
తక్కల బెట్టగవొద్దు దయలు దలచవే అక్కజపు నీ రతులు అందులోనే వున్నవి

ఓరుచుకోవే
ఓరుచుకోవే యెట్టయినా వువిద నీవు నేరుపరి నీ విభుడు నేడే వచ్చీ నీడకు
కలువల వేసితేనే కాముడు చుట్టము గాడా వెలయు విరహులకు వెగటు గాక
చలివెన్నెల గాసితే చందురుడు పగవాడా పొలయలు కలవారే పొగడరుగాక
కొసరుచు బాడితేనే కోయిల గుండె బెదరా అసదు విరహులు కాదందురు గాక
ముసరితే దుమ్మిద మూకలు దయలేనివా విసిగిన కాముకులే వినలేరు గాక
వనము సింగారించితే వసంతుడు కౄరుడా వొనరని విరహుల కొంటదుగాక
యెనసి శ్రీ వేంకటేశుడేలె నిన్ను చిలుకలు కినిసేనా పాంథులకు కేరడముగాక

ఓయమ్మా
ఓయమ్మా ఇంతయేల వొద్దనరే నాయముగాదిందరిలో నగుబాటు తనకును
చెక్కునొక్కితిని సెలవి నవ్వితిని మక్కువతో నెంతైనా మాటాడడు
మొక్కూ మొక్కితిని మోనాన నుండితిని యెక్కుడు దిట్టితినంటా నెగ్గువట్టీ నితడు
ఇచ్చకము జేసితి ఇచ్చితి విడెమును కచ్చుపెట్టి యెంతైనా కరగడు
ముచ్చటలాడితిని మోవిజూచితి తన్ను బచ్చిగా జేసితినంటా పగచాటీ నితడు
కన్నులా జొక్కితిని కాగిటా నించితిని మన్నించె రతినెంతైనా మానడు
సన్నల మెచ్చితిని చాయల హెచ్చితిని ఇన్నిటా శ్రీవేంకటేశు డెంతజాణే ఇతడు

ఓ పవనాత్మజ
ఓ పవనాత్మజ ఓ ఘనుడా బాపు బాపనగా పరిగితిగా
ఓ హనుమంతుడ ఉదయాచల నిర్వాహక నిజ సర్వ ప్రబలా
దేహము మోచిన తెగువకు నిటువలె సాహస మిటువలె చాటితిగా
ఓ రవి గ్రహణ ఓదనుజాంతక మారులేక మతి మలసితిగా
దారుణపు వినతా తనయాదులు గారవింప నిటు కలిగితిగా
ఓ దశముఖ హర ఓ వేంకటపతి పాదసరోరుహ పాలకుడా
ఈ దేహముతో ఇన్నిలోకములు నీదేహమెక్క నిలిచితిగా

Subscribe to:
Posts (Atom)