శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Saturday, June 5, 2010

ఓ పవనాత్మజ

ఓ పవనాత్మజ ఓ ఘనుడా బాపు బాపనగా పరిగితిగా

ఓ హనుమంతుడ ఉదయాచల నిర్వాహక నిజ సర్వ ప్రబలా
దేహము మోచిన తెగువకు నిటువలె సాహస మిటువలె చాటితిగా

ఓ రవి గ్రహణ ఓదనుజాంతక మారులేక మతి మలసితిగా
దారుణపు వినతా తనయాదులు గారవింప నిటు కలిగితిగా

ఓ దశముఖ హర ఓ వేంకటపతి పాదసరోరుహ పాలకుడా
ఈ దేహముతో ఇన్నిలోకములు నీదేహమెక్క నిలిచితిగా

No comments:

Post a Comment