ఒసగితివిన్నియు ఒకమాటే వెసనిక జేసే విన్నపమేది
నారాయణ నీ నామమె తలచిన నీరాని వరము లిచ్చితివి
చేరి నిన్నిట సేవించిన నిక కోరి పడయనిక కోరికలేవి
హరి నీ కొకమరి యటు శరణంటే గరిమల నన్నిటు గాచితివి
నిరతముగా నిక నుతియింపుచు అర గొరతని నిను అడిగేదో
శ్రీ వేంకటేశ్వర చేయెత్తి మ్రొక్కిన భావమె నీవై పరగితివి
ఈ వరుసల నీవింతటి దాతవు ఆవాలనిను కొనియాడేడి దేమి
No comments:
Post a Comment