కరణే కిం మాం గృహీతుంతే హరే ఫణిసయ్యా సంభోగ
జలేతవ సంచరణ మిహాధః స్థలే భవనం తవ సతతం
బలేరూప ప్రకటనమతులా చలేస్థానం చలచలరమణా
పదే భువన ప్రామాణ్యం తవ హ్రదే ప్రచురవి హరణమదం
ముదే మునీనాం మోహనం తనుం మదే తవనర్మచ మాం విసృజ
స్మరేవిజయ స్తవ విమలతురగ ఖురే రతి సంకులరచనా
పురే తవ విస్ఫురణం వేంకట గిరే పతేతే ఖేలా ఘటిత
Showing posts with label క. Show all posts

Sunday, August 8, 2010
Monday, June 7, 2010
క్షీరాబ్ధి కన్యకకు
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనం
జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువుమాణిక్యముల నీరాజనం
చరణ కిసలయములకు సకియరంభోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివనిజనాభికిని నిరతి నానావర్ణ నీరాజనం
పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై నెగడు సతికళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం
Download

కౌసల్యానందన
కౌసల్యానందన రామకమలాప్తకుల రామ భాసురవరద జయ పూర్ణ రామ
మునుప దశరధరాముడవై తమ్ములు నీవు జనించి తాటక జంపి జన్నము గాచి
వెనుకొని హరువిల్లు విరిచి సీత బెండ్లాడి అనుమతి పరశురామునిచే గైకొంటివి
సుప్పనాతి శిక్శించి సొరిది రుశుల గాచి అప్పుడే ఖరదూశణాదుల గొట్టి
చొప్పుతో మాయామ్రుగము సోదించి హరియించి కప్పిహనుమంతు బంటుగానేలుకొంటివి
సొలసి వాలినడచి సుగ్రీవు గూడుక జలధి బంధించి లంకసాధించి
వెలయ రావణుగెల్చి విభీశణుని మన్నించి చెలగితివయోధ్యలో శ్రీవేంకటేశుడా

కోరుదు నామది
కోరుదు నామది ననిశము గుణధరు నిర్గుణు కృష్ణుని నారాయణు విశ్వంభరు నవనీతాహారుని
కుండలి మణిమయ భూషణు కువలదళ వర్ణాంగుని అణ్డజపతి వాహనుని అగణిత భవహరుని
మణ్డన చోదకదమనుని మాలాలంకృత వక్షుని నిండు కృపాంబుధి చంద్రుని నిత్యానందుని
ఆగమపుంజ పదార్థుని ఆపత్సఖ సంభూతుని నాగేంద్రాయుత తల్పుని నానా కల్పుని
చాగుబ్రహ్మ మయాఖ్యుని సంతతగాన విలోలుని వాగీశ సంస్తోత్రుని వైకుంఠోత్తముని
కుంకుమ వసంతకాముని గోపాంగన కుచలిప్తుని శంకర సతీమణి నుతుని సర్వాత్ముని సముని
శంఖ నినాద మృదంగుని చక్రాయుధ విదీప్తుని వేంకటగిరి నిజవాసుని విభవ విధాయకుని

కోరు వంచరో
కోరు వంచరో కొటారు అరసి మనసా అంతరాత్మకు
కొండలపొడవులు కోరికకుప్పలు పండినపంటలు భవములివి
నిండినరాసులు నిజకర్మంబులు అండనె యివె మాయారంభములు
వెలిధాన్యంబులు విషయపు రాసులు పొలివారేటి వూరుపుగములు
కలుషపుమదమున కావుగప్పినవి అలవిమీర మాయారంభములు
బడి నింద్రియములబంతులు నురిపి కడురతుల దండగట్టలతో
యెడనెడ శ్రీవేంకటేశు మహిమలవే అడియాలపు మాయారంభములు

కోరికె దీరుట
కోరికె దీరుట యెన్నడు గుణమును నవగుణమును జెడి వూరక యీమది నీపైనుండుట యెన్నడొకో
చిత్తం బాకలి దీరదు చింత దలంపున బాయదు యెత్తినపరితాపమునకు నేదీ మితిమేర
హత్తినపుణ్యము బాపము నప్పటిసుఖములకొరకే వత్తికి నూనెకు గొలదై వడి జనె దివసములు
జీవుడె పరతంత్రుడుగన చింతింపడు నిన్నెప్పుడు చావును బుట్టుగు సహజము శరీరధారులకు
శ్రీవనితాహృదయేశ్వర శ్రీవేంకటగిరివల్లభ పావనమతిమై ప్రాణులు బ్రదుకుట యెన్నడొకో

కోరికలు కొనసాగె
కోరికలు కొనసాగె గోవిందరాజు మేరమీర ఇట్లానే మెరసితివా
బాలుడవై రేపల్లెలో బాలుదాగేవేళ యీలీలనే పవళించి యిరవైతివా
గోలవై తొట్టెలలోన గొల్లత లూచిపాడగా ఆలకించి విని పాట లవధరించితివా
కొంచక మధురలోన గుబ్జయింట నీలాగుల మంచాలపై బవళించి మరిగితివా
చంచుల ద్వారకలోన సత్యభామ తొడమీద ముంచి యీరీతి నొరగి ముచ్చటలాడితివా
పదియారువేలింతుల పాలిండ్లు తలగడలై పొదల నిటువలెనే భోగించితివా
యెదుట శ్రీ వేంకటేశ ఇట్టె తిరుపతిలోన నిదిరించక శ్రీభూమి నీళల్ గూడితివా

కోడెకాడె వీడె
కోడెకాడె వీడె వీడె గోవిందుడు కూడె ఇద్దరు సతుల గోవిందుడు
గొల్లెతల వలపించె గోవిందుడు కొల్లలాడె వెన్నలు గోవిందుడు
గుల్ల సంకుజక్రముల గోవిందుడు గొల్లవారింట పెరిగె గోవిందుడు
కోలచే పసులగాచె గోవిందుడు కూలగుమ్మె కంసుని గోవిందుడు
గోలయై వేల కొండెత్తె గోవిందుడు గూళెపుసతుల దెచ్చె గోవిందుడు
కుందనపు చేలతోడి గోవిందుడు గొందులు సందులు దూరె గోవిందుడు
కుందని శ్రీవేంకటాద్రి గోవిందుడు గొంది దోసె నసురల గోవిందుడు

కోటి మన్మథాకార
కోటి మన్మథాకార గోవింద కృష్ణ పాటించి నీమహిమలే పరబ్రహ్మము
ఆకాశమువంటిమేన నమరేమూర్తివిగాన ఆకాశనదియే నీకు నభిషేకము
మేకొని నీవే నిండుమేఘవర్ణుడవుగాన నీకు మేఘపు పుష్పాలే పన్నీరుకాపు
చంద్రుడు నీమనసులో జనించె నటుగాన చంద్రికలు కప్రకాపై సరి నిండెను
ఇంద్రనీలపుగనుల యిలధరుడవుగాన తంద్రలేని యీపెచూపే తట్టుపునుగాయను
లక్ష్మీపతిగాన లాగుల నీవురముపై లక్ష్మి యలమేలుమంగే లలి నీతాళి
సూక్ష్మమై శ్రీవేంకటేశ చుక్కలపొడవు గాగ పక్ష్మనక్షత్రములే యాభరణహారములు

కొసరనేల నా
కొసరనేల నా గుణములివి రసికత నీ విన్నిటా రక్షించుకొనుమా
నేరమి నాది నేరుపునీచే దూరు నాది బంధుడవు నీవు
కోరుదు నేను కొమ్మని యిత్తువు కారుణ్యాత్మక గతి నీవు సుమా
నేను యాచకుడ నీవే దాతవు దీనుడ నే బరదేవుడవు
జ్ఞానరహితుడను సర్వజ్ఞునిధివి శ్రీనిధి యిక ననుకేరి కావుమా
అరయ నే జీవుడ నంత్ర్యామివి యిరవుగ దాసుడ నేలికవు
చిరజీవిని నే శ్రీ వేంకటపతివి వరదుడ నను జేవదలకుమా

కొలువై ఉన్నాడు
కొలువై ఉన్నాడు వీడె గోవింద రాజు కొల కొల నేగి వచ్చే గొవింద రాజు
గొడుగుల నీడల గొవింద రాజు గుడికొన్నా పడెగల గోవింద రాజు
కుడి యెడమ కాంతల గోవింద రాజు కొడిసాగె పవుజుల గోవింద రాజు
గొప్ప గొప్ప పూదండల గోవింద రాజు గుప్పేటి వింజామరల గోవింద రాజు
కొప్పు పై చుంగుల తోడి గోవింద రాజు కుప్పి కటారము తోడి గోవింద రాజు
గొరబు సింగారాల గోవింద రాజు కురులు దువ్వించు కొని గోవింద రాజు
తిరుపతిలొనను తిరమై శ్రీ వేంకటాద్రి కురిసీ వరములెల్ల గోవింద రాజు

కొలువుడీ భక్తి
కొలువుడీ భక్తి కొండలకోనేటి నిలయుని శ్రీనిధి యైనవాని
ఆదిదేవుని నభవుని సామ వేదనాద వినోదుని నెర
వాది జితప్రియు నిర్మలతత్త్వ వాదులజీవనమైన వాని
దేవదేవుడైన దివ్యుని సర్వ భావాతీత స్వభావుని
శ్రీవేంకటగిరి దేవుడైన పరదేవుని భూదేవతత్పరుని

Sunday, June 6, 2010
కొలువరో మొక్కరో
కొలువరో మొక్కరో కోరిన వరము లిచ్చీ సులభు డిన్నిటాను వీడె సుగ్రీవ నరహరి
కంబములోన పుట్టి కనకదైత్యుని కొట్టి అంబరపు దేవతలకు అభయమిచ్చి
పంబి సిరిదన తొడపై బెట్టుక మాటలాడి అంబుజాక్షుడైనట్టి ఆదిమ నరహరి
నానా భూషణములు ఉన్నతి తోడ నిడుకొని పూనికతో ప్రహ్లాదుని బుజ్జగించి
మానవులకెల్లను మన్నన చాలా నొసగి ఆనందముతో నున్నాడు అదిగో నరహరి
మిక్కిలి ప్రతాపముతో మించిన కాంతులతోడ అక్కజపు మహిమల నలరుచును
తక్కక శ్రీవేంకటాద్రి తావుకొని వరాలిచ్చీ చక్కదనములకెల్లా చక్కని నరహరి

కొలిచిన వారల
కొలిచిన వారల కొంగుపైడితడు బలిమి తారక బ్రహ్మమీతడు
ఇనవంశాంబుధి నెగసిన తేజము ఘనయజ్ఞంబుల గల ఫలము
మనుజరూపమున మనియెడి బ్రహ్మము నినువుల రఘుకుల నిధానమీతడు
పరమాన్నములోపలి సారపుజవి పరగినదివిజుల భయహరము
మరిగినసీతా మంగళసూత్రము ధరలో రామావతారంబితడు
చకితదానవుల సంహారచక్రము సకల వనచరుల జయకరము
వికసితమగు శ్రీవేంకట నిలయము ప్రకటిత దశరథ భాగ్యంబితడు

కొలిచి బిందెల
కొలిచి బిందెల దోసుకొనుగాక యీ మలయు గోరికనెడి మాడలే పండె
పొలతి సిగ్గులపోడు వొదిచి చిత్తపుటడవి తొలుచూపు బదనుననె దున్నగాను
తలపోత విత్తగా తను చెమటవానలనె బలువైన తమకమను బంగారువండె
ఇచ్చకపు జిరునగవు లింటిలోపలి తోట మచ్చు జీకట్లె పలుమరు దవ్వగా
ఎచ్చుకుందుల సొలపు లేతపుజలము వారి నచ్చుగాకల పైడినక్కులే పండె
తగిలి వేంకట విభుని తనివోని కౌగిటను జగడంపు గూర్మి సరసము చల్లగా
నిగనిగని పలుకుదేనియలు వేమఋబారి నిగుడు విరహాగ్ని మాణికములే పండె

కొలనిలోనమునుగోపికలు
కొలనిలోనమునుగోపికలు మొలకనవ్వులతో మ్రొక్కిరి నీకు
పిరుదులు దాటిన పింఛపు టలకల తురుములు వీడగ తొయ్యెలులు
అరిది నితంబులందునెదాచుక మురిపెపు కరముల మ్రొక్కిరినీకు
నిద్దపు మానము నెలతలు లోగుచు గద్దరి తొడలనె గట్టుచును
ముద్దుటుంగరంబుల కరములతో ముద్దులు గునియుచు మ్రొక్కిరి నీకు
పాలిండ్ల పెనుభారంబుల మూలపు మెరుగులు ముంచగను
వేలపు ప్రియముల వేంకటేశనిను మూలకుపిలుచుచు మ్రొక్కిరి నీకు

కొలని దోపరికి
కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు కుల స్వామికిని గొబ్బిళ్ళో
కొండ గొడుగుగా గోవుల గాచిన కొండొక శిశువునకు గొబ్బిళ్ళో
దండగంపు దైత్యుల కెల్లను తల గుండు గండనికి గొబ్బిళ్ళో
పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికిని గొబ్బిళ్ళో
యేపున కంసుని యిడుమల బెట్టిన గోప బాలునికి గొబ్బిళ్ళో
దండివైరులను తరిమిన దనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో
వెండిపైడి యగు వేంకట గిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో

కొమ్మలాలా
కొమ్మలాలా ఎంతవాడె గోవింద రాజు కుమ్మరించీ రాజసమే గోవింద రాజు
ఉలిపచ్చి నవ్వులతో ఒత్తిగిలి పవళించి కొలువు సేయించుకొనీ గోవింద రాజు
జలజాక్షు లిద్దరును సరి పాదాలొత్తగాను కొలది మీర మెచ్చేనీ గోవింద రాజు
అదె నాభికమలాన అజుని పుట్టించి తాను కొద లేక ఉన్న వాడు గోవింద రాజు
చెదరక తన వద్ద సేవ సేసే సతులకు గుదిగుచ్చీ వలపులు గోవింద రాజు
ఒప్పుగా వామకరము ఒగిచాచి వలకేల కొప్పు కడునెత్తినాడు గోవింద రాజు
ఇప్పుడు శ్రీ వేంకటాద్రి నిరవై శంఖుచక్రాలు కుప్పె కటారములు పట్టె గోవింద రాజు

కొమ్మ తన
కొమ్మ తన ముత్యాల కొంగు జారగ బగటు కుమ్మరింపుచు దెచ్చు కొన్నదీ వలపు
ఒయ్యారమున విభుని వొరపు గనుగొని రెప్ప మయ్యు నేరక మహా మురిపెమునను
కయ్యంపు గూటమికి గాలు దువ్వుచు నెంతె కొయ్యతనమున దెచ్చు కొన్నదీ వలపు
పైపైనె ఆరగింపకుము పన్నీరు గడు తాపమవునని చెలులు దలకగానే
తోపు సేయుచు గెంపు దొలకు గన్నుల కొనల కోపగింపుచు దెచ్చు కొన్న దీవలపు
ఎప్పుడును బతితోడ నింతేసి మేలములు ఒప్పదని చెలిగోర నొత్తగానే
యెప్పుడో తిరువేంకటేశు కౌగిట గూడి కొప్పుగులుకుచు దెచ్చు కొన్నదీవలపు

కొనుట వెగ్గళము
కొనుట వెగ్గళము దాదినుట యల్పము మీదు గనుట వినుట లేక దా కడచన్న భవము
ఆపద వడ్డికినిచ్చి అనుభవింపబోయిన యేపున నెవ్వరికి నిందేమిగలదు
పాపపుపైరువిత్తిన పండినపంటలలోన రూపింపగ నిందు రుచి యేమిగలదూ
ఘనుడైన తిరువేంకట నాథుడిన్నిటికి యును భోక్తయు గర్మియును నైనవాడు
పనిలేదు నిష్ఠూరపరుడు దానై వుండు తనకుదానె కర్తతనమౌట గాన

Subscribe to:
Posts (Atom)