కొలిచి బిందెల దోసుకొనుగాక యీ మలయు గోరికనెడి మాడలే పండె
పొలతి సిగ్గులపోడు వొదిచి చిత్తపుటడవి తొలుచూపు బదనుననె దున్నగాను
తలపోత విత్తగా తను చెమటవానలనె బలువైన తమకమను బంగారువండె
ఇచ్చకపు జిరునగవు లింటిలోపలి తోట మచ్చు జీకట్లె పలుమరు దవ్వగా
ఎచ్చుకుందుల సొలపు లేతపుజలము వారి నచ్చుగాకల పైడినక్కులే పండె
తగిలి వేంకట విభుని తనివోని కౌగిటను జగడంపు గూర్మి సరసము చల్లగా
నిగనిగని పలుకుదేనియలు వేమఋబారి నిగుడు విరహాగ్ని మాణికములే పండె
No comments:
Post a Comment