శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, June 6, 2010

కొలిచిన వారల

కొలిచిన వారల కొంగుపైడితడు బలిమి తారక బ్రహ్మమీతడు

ఇనవంశాంబుధి నెగసిన తేజము ఘనయజ్ఞంబుల గల ఫలము
మనుజరూపమున మనియెడి బ్రహ్మము నినువుల రఘుకుల నిధానమీతడు

పరమాన్నములోపలి సారపుజవి పరగినదివిజుల భయహరము
మరిగినసీతా మంగళసూత్రము ధరలో రామావతారంబితడు

చకితదానవుల సంహారచక్రము సకల వనచరుల జయకరము
వికసితమగు శ్రీవేంకట నిలయము ప్రకటిత దశరథ భాగ్యంబితడు

No comments:

Post a Comment