శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, June 6, 2010

కొలువరో మొక్కరో

కొలువరో మొక్కరో కోరిన వరము లిచ్చీ సులభు డిన్నిటాను వీడె సుగ్రీవ నరహరి

కంబములోన పుట్టి కనకదైత్యుని కొట్టి అంబరపు దేవతలకు అభయమిచ్చి
పంబి సిరిదన తొడపై బెట్టుక మాటలాడి అంబుజాక్షుడైనట్టి ఆదిమ నరహరి

నానా భూషణములు ఉన్నతి తోడ నిడుకొని పూనికతో ప్రహ్లాదుని బుజ్జగించి
మానవులకెల్లను మన్నన చాలా నొసగి ఆనందముతో నున్నాడు అదిగో నరహరి

మిక్కిలి ప్రతాపముతో మించిన కాంతులతోడ అక్కజపు మహిమల నలరుచును
తక్కక శ్రీవేంకటాద్రి తావుకొని వరాలిచ్చీ చక్కదనములకెల్లా చక్కని నరహరి

No comments:

Post a Comment