పొలయలుక నిద్దురలు భోగించ దొరకొంటి వలరివడి మేల్కొనవె అఖిలేశ్వర
తరుణిమైనపుడె పరితాప సూర్యుడు వొడిచె వరుస జెలి కన్నుగలువలు మొగిచెను
మరుని సాయకపు తామరలు వడి వికసించె కరుణతో మేల్కొనవె కమలేశ్వరా
కాంత నిట్టూర్పులను గాలియును నగ్నియును వంత చెమటల వాన వరుణుండును
వింతలుగ నిన్ను సేవింతుమని యున్నారు పంతమున మేల్కొనవె పరమేశ్వరా
మోలుత పెనుదురుమనెడి మేఘ మండలములో నలుగడల జెలగె సుమ వస పంక్తులు
కులికి పూవుల వాన కురియంగ నున్నదిదే చలముడిగి మేల్కొనవె సర్వేశ్వరా
కదిసి పులకల సృష్టి కడలేక పొడమించు మదనుడను మానసక మలభవుడును
ముదితకోపపుహరుడు మొనసియున్నారిదే నిదుర మేల్కొనవె జలనిధి శయనుడా
ఒడికముగ జెలిలోన నుదయరాగము వొడమె వెడలె నవె పలుకు గోవిలరవములు
పడతి గూడితివి రతి పరవశంబికనైన కడగి మేల్కొనవె వేంకటరమణుడ
Showing posts with label ప. Show all posts

Sunday, August 8, 2010
Friday, July 16, 2010
ప్రాణులనేరమి గాదిది
ప్రాణులనేరమి గాదిది బహుజన్మపరంపరచే ప్రాణులుసేసిన తమతమ పాపఫల్ముగాని
హరి సకలవ్యాపకుడని అందరు జెప్పగ నెరిగియు పరదైవంబుల గొలువకపాయరు మానవులు
నరపతి భూమేలగ భూవరు భజియింపగనొల్లక పరిసరవర్తులబెంబడి బనిసేసినయట్లు
పొందుగ తమతమ సేసినపూజలు మ్రొక్కులు గైకొన అందముగా బురుషోత్తము డాతడే కలడనియు
అందరు నెరిగియు యితరుల జెందుదు రున్నతశైలము నందక చేరునతరువుల నందుకొనినయట్లు
శ్రీ వేంకటపతి యొక్కడె చెప్పగ జగములకెల్లను దైవము నాతములోపలి ధనమనగా వినియు
సేవింపరు పామరులీదేవుని మధురంబొల్లక వావిరి బులుసులు చేదులువలె ననికొనునట్లు

ప్రాణనాయకుడు వాడె
ప్రాణనాయకుడు వాడె ప్రాణేశ్వరివి నీవు జాణవు నీవిన్నిటాను చలమేటికే
వీడనాడివచ్చుగాని వెనకవేడుకోరాదు కూడేరు మీకెపోదు కోపమింతేలే
నీడలు వేరైతోచు నిలువొక్కటేకాదా
అలుగగవవచ్చుగాని అట్టె కిందుపడరాదు కలపేరు మీకెపోదు కపటమేలే
పలుకులెన్ననా దోచు బాసవొక్కటెకాదా పులకలి వేడవంటా పొర్లనేటికే
తప్పులెంచవచ్చుగాని తారుకాణించరాదు యెప్పుడు మీకెపోదు యెరవేటికే
అప్పుడిదే శ్రీ వేంకటాధిపుడు నిన్నుగూడె కుప్పశించి నవ్వెనంటా గోర జించనేతికే

ప్రలపనవచనైః
ప్రలపనవచనైః ఫలమిహకిం చల చల కుడ్య క్షాళనయాకిం
ఇతర వధూమోహితం త్వాంప్రతి హితవచనై రిహ ఫలమివోకిం
సతతం తవానుసరణ మిదం మమ గతజల సేతుకరణ మిదానీం
వికల వినయ దుర్విటం త్వా ప్రతి సుకుమారాద్రస్తుత్యాకిం
ప్రకట బహల కోపనం మమతే సకలం చర్విత చర్వత చర్వణమేవ
శిరసానత సుస్థిరం త్వాంప్రతి విరసాలాపన విధి నాకిలం
తిరువేంకటగిరి దేవత్వదీయ విరహ విలసనం వృధా చరణం

ప్రపన్నులకు
ప్రపన్నులకు నిది పరమాచారము విపరీతాచారము విడువగవలయు
భగవదపచారము భాగవతాపచారము దగులక దేవతాంతరము మాని
నగధరు శరణము నమ్మి యాచార్యుని బగివాయనిదే పరమవైష్ణవము
దురహంకారము దుఃఖము సుఖమును బొరయక ప్రాకృతుల పొంత బోవక
దరిశనాభిమానాన ధర్మము వదలక పరిశుద్ధి నుండుటే పరమవైష్ణవము
ఉపాయాంతరము లొల్లక భక్తిచేపట్టి యెపుడూ దీర్థప్రసాదేచ్ఛతోడ
నిపుణత శ్రీవేంకటనిలయుడే గతియని ప్రపత్తి గలుగుటే పరమవైష్ణవము

ప్రతిలేని పూజదల
ప్రతిలేని పూజదల పంగకోటి మణుగులై అతివ పరవశము బ్రహ్మానందమాయె
మానినీమణిమనసు మంచియాసనమాయె ఆనందబాష్పజల మర్ఘ్యాదులాయె
మీనాక్షి కనుదోయి మించుదీపములాయె ఆనన సుధారసంబభిషేకమాయె
మగువచిరునవ్వులే మంచి క్రొవ్విరులాయె తగుమేనితావి చందనమలదుటాయె
నిగనిగనీతనుకాంతి నీరాజనంబాయె జగడంపుటలుకలుపచారంబులాయె
ననుపైన పొందులె నైవేద్య తతులాయె తనివోని వేడుకలు తాంబూలమాయె
వనిత శ్రీ వేంకటేశ్వరుని కౌగిట జేయు వినయ వివరంబు లరవిరిమ్రొక్కులాయె

పోరొ పోరొ
పోరొ పోరొ యమ్మలార బొమ్మలాటవారము యీరసాన మమ్ము నిట్టే యేమిసేసేరు
ఊరులేనిపొలమేర వొడలుమోచుకొని నేము తేరదేహ మెక్కుకొని తిరిగేము
వారువీరనుచు వట్టివావులు సేసుక లేని పేరుపెట్టుకొని లోలో బిరువీకులయ్యేము
బుద్ధిలేనిబుద్ధితోడ పొందుసేసుకొని వట్టి యెద్దుబండికంటిసంది నీగేము
నిద్దురలో తెలివంటూ నీడలోని యెండంటా వుద్దువుద్దులై లేనివొద్దిక నున్నారము
మాటులేనిమాటు దెచ్చి మరుగవెట్టుక వట్టి మేటానమేట్లవలె మెరసేము
గాటమైనతిరువేంకటగిరినిలయుని నాటకమే నిజమని నమ్మిక నున్నారము

పోరాక పోయి
పోరాక పోయి తలపుననున్నదైవంబు జేరనొల్లక పరుల జేరదిరిగెదము
వడిబారుపెనుమృగము వలలలోపల దగులు వడి వెడల గతిలేక వడకుచున్నట్లు
చెడనికర్మములులలో జిక్కి భవములబాధ బడియెదముగాక యేపనికి దిరిగెదము
నీరులోపలిమీను నిగిడి యామిషముకై కోరి గాలము మ్రింగి కూలబడినట్లు
జారిపోయిననేల సంసారసౌఖ్యవి కారంపుమోహముల గట్టువడియెదము
శ్రీవేంకటేశు నాశ్రితలోకరక్షకుని భావింప దేవతాపతియైనవాని
సేవించుభావంబు చిత్తమెడబడక నే మీవలావలిపనుల నిట్ల దిరిగెదము

పోయబోయ గాలమెల్ల
పోయబోయ గాలమెల్ల పూట పూటకు చేయి నోరు నోడాయ చెల్లబో యీరోతలు
తిప్పన తొప్పన కేతు దేవన బావన గన్ను పప్పన బొప్పనగారి బాడిపాడి
కుప్పలుదెప్పలు నైనకోరికెలు మతిలోన యెప్పుడు బాయకపోయి నెన్ని లేవు రోతలు
కాచన పోచన మాచు కల్లప బొల్లప మల్లు బాచన దేచనగారి బాడిపాడి
యేచినపరసుఖము నిహమును లేకపోయి చీచీ విరిగితిమి చెప్పనేల రోతలు
బుక్కన తిక్కన చెల్లు బూమన కామన పేరి బక్కల నిందరి నోర బాడిపాడి
యెక్కువైనతిరివేంకటేశుని దలచలేక కుక్కకాటు జెప్పుటాటై కూడెనిన్ని రోతలు

పోయబోయ గాలమెల్ల పూట పూటకు రోయని రోతలు చూచి రుచి చూరబోయ
తాడిమానెక్కేటివాని తడయక పట్టి పట్టి తోడ దోడ నెందాకా దోయవచ్చును
కాడువడ్డ చిత్తమిది కలకాలము నిట్టే ఆడి కెలకులోనై తనియకపొయ
మన్నుదిని యేటిదూడ మానుమంటూ మొత్తి మొత్తి కన్నిగట్టి యెందాక గాయవచ్చును
సన్నపుటాసలమీద చరిబడ్డ దేహమిది కన్నపుగత్తుల చూపు కట్టరాకపోయ
హేయము దొక్కకుమన్న యేచితి నేననేవాడు చాయకు రాకున్న నేమి సేయవచ్చును
మాయల వేంకటపతి మచ్చుచల్ల నాయాత్మ పాయక యీతని జేరి భయమెల్లబోయ

పోయం గాలము
పోయం గాలము వృథయై పుట్టినమొదలుం గటకట నీయెడ నామది నిజమై నిలుచుట యెన్నడొకో
కుడిచిన నాకలి దీరదు కుడువగగుడువగ బైపై కడుబొదలెడుదీపన మిది గడచుట యికనెట్లు
కుడువకమానుట యెన్నడు కోరికదీరుట యెన్నడు తడయక నీరూపము నే దలచుట లెన్నడొకో
జీవుడుపుట్టిన మొదలును జేతికి నూఱట చాలక యేవిధమున భుజియించిన నెడయదు దీపనము
శ్రీవేంకటపతి నాకిక శ్రీకరుణామృత మియ్యక పావనమందదు నామది పాలించందగదా

పోయగాలం
పోయగాలం బడవికిగాయు వెన్నెల కరణిని శ్రీయుతు దలచుడీ నరులు మాయబడి చెడక
చిత్తము చేకూరుచుకొని చిత్తెకాగ్రతను చిత్తజగురుని దలచిడీ చిత్తజు జోరనీక
బూరుగు మాకున జెందిన కీరము చందమున అరయ నిశ్ఫలమగు మరియన్యుల జేరినను
కూరిమి మా తిరువేంకటగిరి గురు శ్రీపాదములు చేరినవారికి భవములు చెందవెపుడు నటుగాన

పొలతి జవ్వనామున
పొలతి జవ్వనామున బూవక పూచె యెలమి నిందుకు మనమేమి సేసేదే
సతిచింతాలతలో సంపెంగపూవులు పూచె మతివిరహపు మేన మల్లెలు పూచె
అతనునితలపోతను అడావిజాజులు పూచె హితవు తెలియదింకను ఏమిసేసేదే
తొయ్యలిచెమటనీట దొంతితామెరలు పూచె కొయ్యచూపు కోపముల కుంకుమ పూచె
కయ్యపు వలపుల జీకటి మాకులు పూచె నియ్యేడ చెలియభావ మేమి చేసేదె
మగువరతుల లోన మంకెన పువ్వులు పూచె మొగికొనగోళ్ళానే మొగలి పూచె
పొగరు శ్రీవేంకటేశు పొందుల కప్రము పూచె ఇగురు బోండ్ల మింక నేమి సేసేదే

పొరి నీకును
పొరి నీకును విరిగి పోయిన దానవులు బిరుదులుడిగి వోడ బేహారులైరి
మకుటాలుతీసి జటామకుటాలు గట్టుకొని వెకలిరిపులు ముని వేషులైరి
మొకములను సోమపు మొకములు పెట్టుకొని అకటా కొందరు రిపులాట వారైరి
పేరులు విడిచి సంకుబేరులు మెడవేసుక సారెకు కొందరు శివ సత్తులైరి
బీరపు సాములు మాని పెద్దగడ సామునేర్చి తోరపు బగతులెల్ల దొమ్మరులైరి
నాదించ వెరచి సింగి నాదాలూదు కొంటాను సోదించేరటాగొందరు జోగులైరి
ఈదెస శ్రీ వేంకటేశ యున్నియు మానికొందరు దాదాతని శరణనీ దాసులైరి

పొద్దికనెన్నడు
పొద్దికనెన్నడు వొడచునొ పోయిన చెలిరాదాయను నిద్దుర గంటికి దోపదు నిమిషంబొక యేడు
కన్నుల నవ్వెడి నవ్వులు గబ్బితనంబుల మాటలు నున్నవి యొయ్యారంబులు నొచ్చిన చూపులును
విన్నదనంబుల మఱపులు వేడుక మీరిన యలపులు సన్నపు జెమటలు దలచిన ఝల్లనె నా మనసు
ఆగిన రెప్పల నీరును నగ్గలమగు పన్నీటను దోగియు దోగని భావము దోచిన పయ్యెదయు
కాగిన దేహపు సెకలును కప్పిన పువ్వుల సొరబులు వేగిన చెలి తాపమునకు వెన్నెల మండెడిని
దేవశిఖామణి తిరుమల దేవుని దలచిన బాయక భావించిన యీ కామిని భావము లోపలను
ఆ విభుడే తానుండిక నాతడె తానెఱగగవలె నీ వెలదికి గల విరహంబేమని చెప్పుదము

పొదలె నిండు
పొదలె నిండు కళల పున్నమి నేడు అదను దప్పక జాజ రాడుదువు రావయ్యా
జలజాక్షి మోమునను చంద్రోదయమాయ నెలకొన్న నవ్వుల వెన్నెల గాసెను
కలికి కన్నుల నల్ల కలువలు వికసించె అలరి యీకెతో జాజ రాడుదువు రావయ్యా
యెనసి జవ్వనమున నేతెంచె వసంతకాల మొనరి మోవి చిగురు లుప్పతిల్లెను
గొనకొన్న తురుమున కూడె తుమ్మిదమూక అనుమానించక జాజ రాడుదువు రావయ్యా
కుంకుమ చెమట చను కొప్పెరల నిండుకొనె కొంకక గోళ్ళే బుఱ్ఱటకొమ్ము లాయెను
లంకెలై శ్రీవేంకటేశ లలనతో కూడితివి అంకెల నేపొద్దూ జాజ రాడుదువు రావయ్యా

పొత్తుల మగడవు
పొత్తుల మగడవు పొరుగున నుండగ తత్తరమింతేసి తమకేలనయ్యా
యేపున నీమోము యిటు నేజూచిన చూపు లాపెమై చురకనెను
ఆపొద్దు నీతో నాడిన మాటల తీపులు దనకటు తిన జేదాయ
నడుమ నే నీతో నవ్విన వెన్నెల కడనాపెకు జీకటులాయ
చిడుముడు నే నిను జెనకిన సరసము వెడ వెడ దనకవి విరసములాయ
వెస నా మోవులవిందు నీకిడిన వసిగొని నాపెకు బగలాయ
యెసగిన శ్రీ వేంకటేశు మమ్మిద్దరి గొసరికూడితివి గురి దనకాయ

పొడవైన శేషగిరి
పొడవైన శేషగిరి బోయనాయడు విడువ కిందరి గాచు వెడబోయనాయడు
పొలసి మీసాల పెద్దబోయనాయడు మలిగి వీపునగట్టేమంకుబోయనాయడు
పొలమురాజై తిరిగేబోయనాయడు వెలయ మోటుననుండేవేటబోయనాయడు
పొట్టిపొట్టియడుగులబోయనాయడు యెందు బుట్టుపగసాధించేబోయనాయడు
బొట్టులమెకమునే సేబోయనాయడు పట్టపునెమలిచంగుబలుబోయనాయడు
పొంచి శిగ్గెగ్గెఱగనిబోయనాయడు మించి రాలమీదదాటేమెండుబోయనాయడు
అంచెల శ్రీవేంకటేశుడనేబోయనాయడు పంచ గాలవేలములబలుబోయనాయడు

పొడగంటిమయ్య మిమ్ము
పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకవయ్య కోనేటి రాయడా
కోరిమమ్ము నేలినట్టి కులదైవమా చాల నేరిచి పెద్దలిచ్చిన నిధానమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా మాకు చేరువజిత్తములోని శ్రీనివాసుడా
భావింప గైవసమైన పారిజాతమా మమ్ము చేవదేర గాచినట్టి చింతామణీ
కావించి కోరికలిచ్చే కామధేనువా మమ్ము తావై రక్షించేటి ధరణీధరా
చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రోగా లడచి రక్షించే దివ్యౌషధమా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడియించినట్టి శ్రీ వేంకటనాథుడా
Download

Thursday, July 15, 2010
పేరంటాండ్లు పాడరే
పేరంటాండ్లు పాడరే పెండ్లివేళ సారెసారె నిద్దరికి సంతోషవేళ
చిత్తజు తల్లికి వేగ సింగారించరె మీరు తత్తరించేరిది ముహూర్తపువేళ
హత్తి తలబాలు నారాయణుని బోయమనరే పొత్తుల నిద్దరికిని బువ్వపువేళ
పాలవెల్లి కూతురుకు పసపుల నలచరే చాలించరేజోలి వీడుచదివే వేళ
పాలుపడీ పరపులు పరచరే దేవునికి నాలుగోదినము నేడూ నాగవల్లి వేళ
అంది బాగాలియ్యరే అలుమేలుమంగకును కందువ శ్రీ వేంకటేశుగలసే వేళ
గందము గస్తూరి నీరె ఘనరతినలరసరి కుండకీ యిద్దరు నికగొలువుండేవేళ

Subscribe to:
Posts (Atom)