ప్రపన్నులకు నిది పరమాచారము విపరీతాచారము విడువగవలయు
భగవదపచారము భాగవతాపచారము దగులక దేవతాంతరము మాని
నగధరు శరణము నమ్మి యాచార్యుని బగివాయనిదే పరమవైష్ణవము
దురహంకారము దుఃఖము సుఖమును బొరయక ప్రాకృతుల పొంత బోవక
దరిశనాభిమానాన ధర్మము వదలక పరిశుద్ధి నుండుటే పరమవైష్ణవము
ఉపాయాంతరము లొల్లక భక్తిచేపట్టి యెపుడూ దీర్థప్రసాదేచ్ఛతోడ
నిపుణత శ్రీవేంకటనిలయుడే గతియని ప్రపత్తి గలుగుటే పరమవైష్ణవము
No comments:
Post a Comment