శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, July 16, 2010

ప్రతిలేని పూజదల

ప్రతిలేని పూజదల పంగకోటి మణుగులై అతివ పరవశము బ్రహ్మానందమాయె

మానినీమణిమనసు మంచియాసనమాయె ఆనందబాష్పజల మర్ఘ్యాదులాయె
మీనాక్షి కనుదోయి మించుదీపములాయె ఆనన సుధారసంబభిషేకమాయె

మగువచిరునవ్వులే మంచి క్రొవ్విరులాయె తగుమేనితావి చందనమలదుటాయె
నిగనిగనీతనుకాంతి నీరాజనంబాయె జగడంపుటలుకలుపచారంబులాయె

ననుపైన పొందులె నైవేద్య తతులాయె తనివోని వేడుకలు తాంబూలమాయె
వనిత శ్రీ వేంకటేశ్వరుని కౌగిట జేయు వినయ వివరంబు లరవిరిమ్రొక్కులాయె

No comments:

Post a Comment