శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, July 16, 2010

పోరొ పోరొ

పోరొ పోరొ యమ్మలార బొమ్మలాటవారము యీరసాన మమ్ము నిట్టే యేమిసేసేరు

ఊరులేనిపొలమేర వొడలుమోచుకొని నేము తేరదేహ మెక్కుకొని తిరిగేము
వారువీరనుచు వట్టివావులు సేసుక లేని పేరుపెట్టుకొని లోలో బిరువీకులయ్యేము

బుద్ధిలేనిబుద్ధితోడ పొందుసేసుకొని వట్టి యెద్దుబండికంటిసంది నీగేము
నిద్దురలో తెలివంటూ నీడలోని యెండంటా వుద్దువుద్దులై లేనివొద్దిక నున్నారము

మాటులేనిమాటు దెచ్చి మరుగవెట్టుక వట్టి మేటానమేట్లవలె మెరసేము
గాటమైనతిరువేంకటగిరినిలయుని నాటకమే నిజమని నమ్మిక నున్నారము

No comments:

Post a Comment