శ్రీహరిసేసినచిహ్నలివి యీ మోహము విడుచుట మోక్షమది
మలినంబేది మణుగననేది కలుషపుమలముల కాయమిది
కలిగినదేది కడులేందేది చలనపుమాయల జన్మమిది
తనిసినదేది తనియనిదేది దినదినమాకలి దీరదిది
కొనయిందేది గురిమొదలేది పనిగొనుకర్మపు బంధమిది
నిండినదేది నిండనిదేది కొండలపొడపుల కోరికది
అండనే శ్రీ వేంకటాధిపు శరణని వుండుటె యిహపర యోగమది
Showing posts with label శ. Show all posts

Thursday, August 5, 2010
శ్రీహరి నిత్యశేషగిరీశ
శ్రీహరి నిత్యశేషగిరీశ మోహనాకార ముకుంద నమో
దేవకీ సుత దేవ వామన గోవిందా గోప గోపీనాథా
గోవర్ధనధర గోకులపాలక దేవేశాధిక తే నమో నమో
సామాజావన శార్ణపాణి వామనా కృష్ణ వాసుదేవ
రామనామ నారాయణ విష్ణో దామోదర శ్రీధర నమో నమో
పురుషోత్తమ పుండరీకాక్ష గరుడధ్వజ కరుణానిధి
చిరంతన అచ్యుత శ్రీవేంకటేశ్వర నరమృగ తే నమో నమో

శ్రీశోయం సుస్థిరోయం
శ్రీశోయం సుస్థిరోయం కౌశికమఖరక్షకోయం
నిగమనిధినిర్మలోయం జగన్మోహనసతీపతి
విగత భయోయం విజయసఖోయం భృగుముని సంప్రీతోయం
సకలపతి శ్శాశ్వతోయం శుకముకమునిజనసులభోయం
ప్రకటబహుళశోభనాధికోయం వికచరుక్మిణీవీక్షణోయం
సరసోయం పరిసరప్రియోయం తిరువేంకటాధిపోయం
చిరంతనోయం చిదాత్మకోయం శరణాగతవత్సలోయం

శ్రీవేంకటేశుడు
శ్రీవేంకటేశుడు శ్రీపతియు నితడే పావనపువైకుంఠపతియును నితడే
భాగవతములో జెప్పే బలరాముతీర్థయాత్ర నాగమోక్తమైనదైవ మాత డితడే
బాగుగా బ్రహ్మాండపురాణపద్ధతియాత డితడే యోగమై వామనపురాణోక్తదైవ మీతడే
వెలయ సప్తఋషులు వెదకి ప్రదక్షిణము లలర జేసినదేవు డాత డీతడే
నెలవై కోనేటిపొంత నిత్యము గుమారస్వామి కలిమి దనముసేసి కన్నదేవు డీతడే
యెక్కువై బ్రహ్మాదులు నెప్పుడు నింద్రాదులు తక్కక కొలిచియున్న తత్త్వ మీతడే
చక్క నారదాదులసంకీర్తనకు జొక్కి నిక్కినశ్రీవేంకటాద్రినిలయుడు నీతడే

శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు
కమలాసతీ ముఖకమల కమలహిత కమలప్రియ కమలేక్షణ
కమలాసనహిత గరుడగమన శ్రీ కమలనాభ నీపదకమలమే శరణు
పరమయోగిజన భాగధేయ శ్రీ పరమపూరుష పరాత్పర
పరమాత్మ పరమాణురూప శ్రీ తిరువేంకటగిరి దేవ శరణు
Download

శ్రీ వేంకటేశ్వరుని సింగారము
శ్రీ వేంకటేశ్వరుని సింగారము వర్ణించితే యే విధాన దలచిన యిన్నటికి దగును
కరిరాజు గాచిన చక్రము పట్టిన హస్తము కరి తుండమని చెప్పగా నమరును
వరములిచ్చేయట్టి వరద హస్తము కల్పతరు శాఖయని పొలుప దగు నీకును
జలధి బుట్టిన పాంచజన్య హస్తము నీకు జలధి తరగయని చాటవచ్చును
బలు కాళింగుని తోక పట్టిన కటి హస్తము పొలుపై ఫణీంద్రుడని పొగడగ దగును
నలిన హస్తంబుల నడుమనున్న నీయుర మలమేలు మంగ కిరవన దగును
బలు శ్రీ వేంకట గిరిపై నెలకొన్న నిన్ను నలరి శ్రీ వేంకటేశుడన దగును

శ్రీ వేంకటేశ రాజీవాక్ష
శ్రీ వేంకటేశ రాజీవాక్ష మేలుకొనవే వేగవేగ మేలుకొను వెలిఛాయ లమరే
సురలు గంధర్వ కిన్నరులెల్ల గూడి తంబురుశ్రుతులను జేర్చి సరవిగాను
అరుణోదయము దెలిసి హరిహరి యనుచు నర హరి నిన్ను దలచెదరు హంసస్వరూప
అల చిలుక పలుకులకు నధరబింబము బోలె తెలివి దిక్కుల మిగుల తేట బారే
అలరు కుచగిరుల నుదయాస్త్రాదిపై వెలిగె మలినములు తొలగ నిదో మంచు తెరవిచ్చే
తళుకొత్త నిందిరా తాటంకరైరుచుల వెలిగన్ను తామరలు వికసింపగాను
అలర్మేల్ మంగ శ్రీవేంకటాచలరమణ చెలువు మీఱగను ముఖకళలు గనవచ్చే

శోభనమే శోభనమే
శోభనమే శోభనమే వైభవముల పావన మూర్తికి
అరుదుగ మును నరకాసురుడు సిరులతో జెరలు దెచ్చిన సతుల
పరువపు వయసుల బదారు వేలను సొరిది బెండ్లాడిన సుముఖునికి
చెందిన వేడుక శిశుపాలుడు అంది పెండ్లాడగ నవగళించి
విందువలెనె తా విచ్చేసి రుకుమిణి సందడి బెండ్లాడిన సరసునుకి
దేవదానవుల ధీరతను దావతిపడి వార్థి దరుపగను
శ్రీ వనితామణి జెలగి పెండ్లాడిన శ్రీ వేంకటగిరి శ్రీనిధికి

శరణువేడెద యజ్ఞసంభవ
శరణువేడెద యజ్ఞసంభవ శ్రీరామ అరసి రక్షించుము అయోధ్యారామ
రావణనుని భంజించిన రాఘవ రామ వావిరి విభీషణ వరద శ్రీరామ
సేవనలమేల్మంగతో వేంకటేశుడై ఈవల దాసుల ఏలినట్టి శ్రీరామ
ధారుణిలో దశరథ తనయ రామ చేరిన యహల్యను రక్షించిన రామ
వారిధి బంధన కపి వల్లభ రామ తారక బ్రహ్మమైన సీతాపతి రామ
ఆదిత్య కులాంబుధి మృగాంక రామ హర కోదండ భంజనము చేకొనిన రామ
వేద శాస్త్ర పురాణాది వినుత రామ ఆది గొన్నతాటకా సంహార రామ

శరణు శరణు సురేంద్ర
శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీసతి వల్లభా శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయకా
కమలధరుడును కమలమిత్రుడు కమలశత్రుడు పుత్రుడు
క్రమముతో మీకొలువు కిప్పుడు కాచినా రెచ్చరికయా
అనిమిషేంద్రులు మునులు దిక్పతులమర కిన్నర సిద్ధులు
ఘనతతో రంభాదికాంతలు కాచినా రెచ్చరికయా
ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను గొలువగ వచ్చిరీ
విన్నపము వినవయ్య తిరుపతి వేంకటాచలనాయకా

శరణు శరణు వేద
శరణు శరణు వేద శాస్త్రనిపుణ నీకు అరుదైన రామ కార్యదురంధరా
హనుమంతరాయ అంజనాతనయా ఘనవాయుసుత దివ్యకామరూప
అనుపమలంకాదహన వార్ధిలంఘన జనసురనుత కలశాపురనివాస
రవితనయస చివ రావణవనాపహార పవనవేగబలాఢ్య భక్తసులభ
భువనపూర్ణదేహా బుధ్ధివిశారద జవసత్వవేగ కలశాపురనివాస
సీతాశోకనాశన సంజీవశైలాకర్షణ ఆతతప్రతాపశౌర్యా అసురాంతకా
కౌతుక శ్రీవేంకటేశు కరుణాసమేత సాతకుంభవర్ణ కలశాపురనివాస

శరణు శరణు విభీషణ
శరణు శరణు విభీషణ వరదా శరధిబంధన రామ సర్వగుణస్తోమ
మారీచసుబాహుమదమర్దన తాటకాహర కౄరేంద్రజిత్తులగుండుగండా
దారుణకుంభకర్ణదనుజ శిరచ్ఛేదక వీరప్రతాపరామ విజయాభిరామ
వాలినిగ్రహ సుగ్రీవరాజ్యస్థాపక లాలితవానరబల లంకాపహార
పాలితసవనాహల్యపాపవిమోచక పౌలస్త్యహరణ రామ బహుదివ్యనామ
శంకరచాపభంజక జానకీమనోహర పంకజాక్ష సాకేతపట్టణాధీశ
అంకితబిరుద శ్రీవేంకటాద్రినివాస ఓంకారరూప రామ వురుసత్యకామ

శరణు శరణు రామచంద్ర
శరణు శరణు రామచంద్ర నరేంద్రా సరి మమ్ముగావు రామచంద్రా నరేంద్రా
ఘన దశరథునకు కౌసల్యాదేవికిని జననమందిన రామచంద్రా నరేంద్రా
కనలి తాటకి చంపి కౌశుకుజన్నము గాచి చనవులిచ్చిన రామచంద్రా నరేంద్రా
అరిది సీత పెండ్లాడి అభయమందరికిచ్చి శరధిగట్టిన రామచంద్రా నరేంద్రా
అరసి రావణు చంపి అయేధ్యానగర మేలి సరవినేలిన రామచంద్రా నరేంద్రా
పన్నుగ నలమేల్మంగపతి శ్రీవేంకటేశ్వరు సన్నిధినిల్చిన రామచంద్రా నరేంద్రా
అన్నిటా లక్ష్మణభరతాంజనేయశత్రుఘ్నుల సన్నుతికెక్కిన రామచంద్రా నరేంద్రా

శరణు కపీశ్వర
శరణు కపీశ్వర శరణం బనిలజ సరవి నెంచ నీసరి యిక వేరీ
పుట్టిననాడే భువనములెరగగ పట్టితి సూర్యుని పండనుచు
ముట్టిన చుక్కలు మోవగ పెరిగితి ఇట్టిప్రతాపివి యెదురేదయ్యా
అంపినయప్పుడే యంబుధి దాటితివి ఇంపులు సీతకు నిచ్చితివి
సంపద మెరయుచు సంజీవి దెచ్చితి పెంపును సొంపును పేర్కొనవశమా
చెదరక నేడే శ్రీవేంకటగిరి గదిసి రాముకృప గైకొంటి
వదలక నీకృపవాడనైతి నిదె యెదుటనే కాచితి విక కడమేమీ

శరణాగత వజ్ర
శరణాగత వజ్ర పంజరుడితడు చక్రధరుడు అసుర సంహారుడు వెరవుతోడ తను శరణనువారికి వెనుబలమీతడే రక్షకుడు
అంతరాత్మ శ్రీ వేంకటేశ్వరుడు అన్యము భజించ చోటేది ఇంతట నమ్మక దేవతాంతరము లేటేటివొ మరి చెప్పుదురు
ఎంతలేదు ప్రాకృత జనముల భ్రమ ఎవ్వరి కాదన నేమిటికి ఇంతకు శ్రీ వేంకటేశు దాసుల ఈతడే మాకిక రక్షకుడు
శ్రీపతి దిక్కై కావగ జేరని సంపద లికనేవి దాపల బుద్ధుల నది నమ్మక విచ్చలవిడి నోములు చెప్పుదురు
తీపులు పుట్టించి యెవ్వ రేమనిన తెలిపి వాదడువ నేమిటికి శ్రీపతి గొలిచితి చేరె సంపదలు జిగినితడే మా రక్షకుడు

శరణంబితడే
శరణంబితడే సకలము నాకును వెరవున మనసా వెతకవో ఇతని
అభయంబొసగెడి యతడెవ్వడు మును ఇభరక్షకుడు అతడెవ్వడు
ఉభయవిభూతుల కొడయండెవడూ ప్రభువితడే నాపాలి దేవుడు
శరణాగతులకు సరి దా నెవ్వడు యిరవుగ శ్రీపతి యెవ్వడు
అరి దుష్ట దైత్య హంతకు డెవ్వడు పరమును నతడె నాపాలి దేవుడు
ఆది శంఖ చక్రాయుధు డెవ్వడు యేదెస పూర్ణు డెవ్వడు
వేదమయుడు శ్రీ వేంకట పతియై పాదాయ నిదె నా పాలిదేవుడు

శరణంటి
శరణంటి మాతనిసమ్మంధమున మరిగించి మమునేలి మన్నించవే
సకలవేదములు సంకీర్తనలు చేసి ప్రకటించి నిను బాడి పావనుడైన
అకలంకుడు తాళ్ళపాకన్నమాచార్యుల వెకలియై యేలిన శ్రీవేంకటనిలయ
నారదాది సనకసనందనాదులవలె పేరుపడి నిన్ను బాడి పెద్దలైనట్టి
ఆరీతి దాళ్ళపాకన్నమాచార్యుల చేరి యేలినయట్టి శ్రీ వేంకటనిలయ
సామవేదసామగానసప్తస్వరములను బాముతో నీసతి నిన్ను బాడినయట్టి
ఆముకొన్న తాళ్ళపాకన్నమాచరుల వేమరు మెచ్చిన శ్రీ వేంకటనిలయా

Monday, August 2, 2010
శతాపరాధములు
శతాపరాధములు సహస్రదండన లేదు గతి నీవని వుండగ కావకుండగారాదు
తలచి నీకు మొక్కగా దయజూడకుండరాదు కొలిచి బంటుననగా కోపించరాదు
నిలిచి భయస్తుడనై నీయెదుట దైన్యమే పలుక గావకుండ బాడిగాదు నీకు
శరణు చొరగ నీకు సారె నాజ్ఞ వెట్టరాదు సరి బూరి గరవగ చంపరాదు
అరయ జగద్రోహినౌదు నైనా నీనామము గరిమె నుచ్చరించగ గరగక పోదు
దిక్కు నీవని నమ్మగా దిగవిడువగరాదు యెక్కువ నీలెంకగాగా యేమనరాదు
తక్కక శ్రీవేంకటేశ తప్పులెల్లా జేసి వచ్చి యిక్కడ నీదాసినైతి నింక దోయరాదు

Subscribe to:
Posts (Atom)