శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

Sunday, May 30, 2010

ఉయ్యాలా

ఉయ్యాలా బాలునూచెదరు కడు నొయ్య నొయ్య నొయ్యనుచు

బాలయవ్వనలు పసిడివుయ్యాల బాలుని వద్ద పాడేరు
లాలి లాలి లాలి లాలెమ్మ లాలి లాలి లాలి లాలనుచు

తమ్మిరేకు గనుదమ్ముల నవ్వుల పమ్ము జూపుల బాడేరు
కొమ్మలు మట్టెల గునుకుల నడపుల ధిమ్మి ధిమ్మి ధిమ్మి ధిమ్మనుచు

చల్లు జూపుల జవరాండ్లురే పల్లె బాలుని బాడేరు
బల్లిదు వేంకటపతి జేరి యందెలు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లనుచు

ఉమ్మడినే

ఉమ్మడినే యేమనినా మారకుండను అమ్మరో యెంతట గబ్బియనకు మీ నన్నను

మాటలు నీ వాడితేను మంచి తేనెలుగారీని గాటమై నీ చేతవై తే కారమయ్యీని
యీటు వెట్టితే జవి యిదొకటీ నదొకటీ కూటమి కాననరాదు కోపగించరాదు

కన్నుల నీవు చూచితే కడు వెన్నెల గాసీని యెన్నబోతే నీ సుద్దులు యెండగాసీని
పన్నినవి నీ గుణాలు పచ్చియును వెచ్చియును అన్నీ జేతబట్టరాదు అటు దోయరాదు

నీ వాసలు వెట్టితేను నిలువు నూరు వండీని భావించి నీ సింగారాలు పాలుకొనీని
యీవల శ్రీ వేంకటేశ యింతలో నన్నేలితివి చేవదేరె ననరాదు చిగురనరాదు

ఉప్పవడము

ఉప్పవడము గాకున్నారిందరు యెప్పుడు రేయి నీకెప్పుడు పగలు

వున్నతి చంద్రుడును కమలమిత్రుడును వున్నతి నివి నీకుండగను
వెన్నెలయెండలు వెలయగ మేల్కొను టెన్నడు నిద్దుర యెన్నడు నీకు

కందువ సతికనుగలువలు ముఖార విందము నిదివో వికసించె
ముందర నిద్దుర మొలవదు చూచిన విందగు నీతెలివికి దుదయేది

తమము రాజసము తగుసాత్వికమును నమరిన నీమాయారతులు
కమలాధిప వేంకటగిరీశ నిన్ను ప్రమదము మఱపును బైకొనుటెట్లా

ఉన్నవిచారములేల

ఉన్నవిచారములేల వోహో సంసారులాల యిన్నిటి కితడే రక్ష యిదే మీకు మనరో

తక్కక బ్రహ్మలగన్న తండ్రి గొలిచి మీరు యెక్కువ సంతతిగల్గి యీడేరరో
అక్కున లక్ష్మీనారాయణుల దలచి మీరు చొక్కి మీమీదంపతులు సుఖమున నుండరో

భవరోగవైద్యునిపాదములు సేవించి భువి రోగముల బాసి పొదలరో
తవిలి పదిదిక్కులు తానైనవాని గవిసి పొగడి దిక్కుగలిగి బ్రదుకరో

తల్లిదండ్రీ నీతడే తగ జుట్ట మీతడే యెల్లగా బుట్టించి పెంచేయేలి కీతడే
చల్లగా శ్రీవేంకటేశు శరణంటి మిదె మేము కొల్లగా మీరెల్లా మమ్ము గుఱిగా వర్ధిల్లరో

ఉన్నమంత్రాలిందు

ఉన్నమంత్రాలిందు సదా(రా) వొగివిచారించుకొంటే విన్నకన్నవారికెల్ల విష్ణునామమంత్రము

పరగ పుచ్చకాయల పరసిపోదు మంత్రము గరిమ ముట్టంటులేని ఘనమంత్రము
వరుస నెవ్వరు విన్నా వాడిచెడనిమంత్రము అరయనిదొక్కటేపో హరినామమంత్రము

యేజాతినోరికైన నెంగిలి లేని మంత్రము వోజదప్పితే జెడకవుండే మంత్రము
తేజాన నొకరికిస్తే తీరిపోనిమంత్రము సాజమైన దిదెపో సత్యమైన మంత్రము

యిహము పరము తానే యియ్యజాలిన మంత్రము సహజమై వేదాలసారమంత్రము
బహునారదాదులెల్ల పాటపాడినమంత్రము విహితమయిన శ్రీవేంకటేశుమంత్రము


Download

ఉన్నచోనే

ఉన్నచోనే మూడు లోకాలూహించి చూచితే నీవే కన్నచోటనే వెదకి కానడింతే కాక

యెక్కడ వొయ్యెడి జీవుడేది వైకుంఠము యిక్కడ హరి యున్నాడు హృదయమందె
ముక్కున నూరుపు మోచి ముంచి పుణ్యపాపాల కక్కసాన జిక్కి తమ్ము గాన డింతే కాక

యేమి విచారించీ దేహి యెందు దేవుని వెదకీ కామించి యాత డిన్నిటా గలిగుండగా
దోమటి సంసారపుదొంతికర్మముల జిక్కి కాముకుడై కిందుమీదు గాన డింతే కాక

యేవిధులు తా జేసీ యెవ్వరి నాడగబోయీ శ్రీవేంకటేశ్వరుసేవ చేతనుడగా
భావ మాతడుగాను బ్రతికె నిదవో నేడు కావరాన నిన్నాళ్ళు కాన డింతే కాక

ఉదయాద్రి

ఉదయాద్రి తెలుపాయె నుండు రాజు కొలు వీడె అద నెర్కిగి రాడాయె నమ్మ నా విభుడు

చన్నులపై ముత్యాల సరులెల్ల జల్లనాయె కన్నులకు గప్పొదవె గాంత నా కిపుడు
కనె కలువల జాతి కనుమోడ్చినది మీద వెన్నెల వేసంగి మొగ్గ వికసించె గదవె

పువ్వుల లోపలి కురులు బుగులు కొనగా నెర్కసె దవ్వుల దుమ్మెదగములు తరమి డాయగను
రవ్వసేయ శుక పికము రాయడి కోర్వగ రాదు అవ్వలనెవ్వతె పసల కలరున్నవాడో

పన్నీట జలక మార్చి పచ్చకప్రము మెత్తి చెన్ను గంగొప్పున విరులు చెరువందురిమి
ఎన్నంగల తిరువేంకటేశుం డిదె ననుంగూడి కన్నుల మనసునుం దనియం గరుణించెం గదవే

ఉగ్గు వెట్టరే

ఉగ్గు వెట్టరే వోయమ్మా చె య్యొగ్గీనిదె శిశు వోయమ్మా

కడుపులోని లోకమ్ములు గదలీ నొడలూచకురే వోయమ్మా
తొడికెడి సరుగున దొలగ దీయరే వుడికెడి పాలివి వోయమ్మా

చప్పలు వట్టుక సన్నపు బాలుని నుప్పర మెత్తకు రోయమ్మా
అప్పుడె సకలము నదిమీనోరనె వొప్పదు తియ్యరె వోయమ్మా

తొయ్యలు లిటు చేతుల నలగించక వుయ్యల నిడరే వోయమ్మా
కొయ్య మాటలను కొండల తిమ్మని నొయ్యన తిట్టకు రోరమ్మా

ఉండ బాసీనడవిలో

ఉండ బాసీనడవిలో నొకతెనేను ఎండలు నీడలు గాసీ నేమి సేతురా

చిన్ని నానడుము చూచి సింహము దగ్గరెనంటా ఉన్నతపు గుచముల కొరసెగరి
మున్నిటి వొందులు వైరమునుజేసె మ్రుగపతి యిన్నిటికి నగ్గమైతి నేమిసేతురా

నిండు నానడపుచూచి నెమలి దగ్గరవచ్చె బండు సేసి నారుసూచి పాయదు పాము
రెండు జూచి పగయు గూరిమి దోచెనింతలోనే యిండె పట్టె నిన్నిటికి నేమి సేతురా

కోరి నా పలుకువిని కోవిల దగ్గరవచ్చె చేరీ నా మోవికిదె చిలుకనేడు
గారవాన నిన్నియు వేంకటగిరి విభుడా యేరా యిట్టె చేకొంటి వేమిసేతురా