పొడవైన శేషగిరి బోయనాయడు విడువ కిందరి గాచు వెడబోయనాయడు
పొలసి మీసాల పెద్దబోయనాయడు మలిగి వీపునగట్టేమంకుబోయనాయడు
పొలమురాజై తిరిగేబోయనాయడు వెలయ మోటుననుండేవేటబోయనాయడు
పొట్టిపొట్టియడుగులబోయనాయడు యెందు బుట్టుపగసాధించేబోయనాయడు
బొట్టులమెకమునే సేబోయనాయడు పట్టపునెమలిచంగుబలుబోయనాయడు
పొంచి శిగ్గెగ్గెఱగనిబోయనాయడు మించి రాలమీదదాటేమెండుబోయనాయడు
అంచెల శ్రీవేంకటేశుడనేబోయనాయడు పంచ గాలవేలములబలుబోయనాయడు
No comments:
Post a Comment