శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, July 16, 2010

పోయబోయ గాలమెల్ల

పోయబోయ గాలమెల్ల పూట పూటకు రోయని రోతలు చూచి రుచి చూరబోయ

తాడిమానెక్కేటివాని తడయక పట్టి పట్టి తోడ దోడ నెందాకా దోయవచ్చును
కాడువడ్డ చిత్తమిది కలకాలము నిట్టే ఆడి కెలకులోనై తనియకపొయ

మన్నుదిని యేటిదూడ మానుమంటూ మొత్తి మొత్తి కన్నిగట్టి యెందాక గాయవచ్చును
సన్నపుటాసలమీద చరిబడ్డ దేహమిది కన్నపుగత్తుల చూపు కట్టరాకపోయ

హేయము దొక్కకుమన్న యేచితి నేననేవాడు చాయకు రాకున్న నేమి సేయవచ్చును
మాయల వేంకటపతి మచ్చుచల్ల నాయాత్మ పాయక యీతని జేరి భయమెల్లబోయ

No comments:

Post a Comment