కోటి మన్మథాకార గోవింద కృష్ణ పాటించి నీమహిమలే పరబ్రహ్మము
ఆకాశమువంటిమేన నమరేమూర్తివిగాన ఆకాశనదియే నీకు నభిషేకము
మేకొని నీవే నిండుమేఘవర్ణుడవుగాన నీకు మేఘపు పుష్పాలే పన్నీరుకాపు
చంద్రుడు నీమనసులో జనించె నటుగాన చంద్రికలు కప్రకాపై సరి నిండెను
ఇంద్రనీలపుగనుల యిలధరుడవుగాన తంద్రలేని యీపెచూపే తట్టుపునుగాయను
లక్ష్మీపతిగాన లాగుల నీవురముపై లక్ష్మి యలమేలుమంగే లలి నీతాళి
సూక్ష్మమై శ్రీవేంకటేశ చుక్కలపొడవు గాగ పక్ష్మనక్షత్రములే యాభరణహారములు
No comments:
Post a Comment